Redmi Note 17 5G Launch : భలే ఉంది భయ్యా ఫోన్.. ఈ రెడ్‌మి నోట్ 17 5G మీ బడ్జెట్ ధరలోనే.. ఇలా కొంటే ఇంకా తక్కువకే..!

Redmi Note 17 5G Launch : కొత్త రెడ్‌మి నోట్ 17 5జీ ఫోన్ వచ్చేసింది. భారీ 8,000mAh బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 27,999 నుంచి లభ్యం కానుంది. రూ. 3వేలు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.

Redmi Note 17 5G Launch

  • 6.9-అంగుళాల 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, భారీ 8,000mAh బ్యాటరీ
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌, ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3
  • ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 27,999 నుంచి లభ్యమవుతుంది
  • రూ. 3వేలు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా పొందొచ్చు

Redmi Note 17 5G Launch : రెడ్ మి లవర్స్ కోసం అద్భుతమైన 5జీ ఫోన్ వచ్చేసింది. షావోమీ రెడ్‌మి ఎట్టకేలకు భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 17 5జీ ఫోన్ లాంచ్ చేసింది. గత మోడల్‌తో పోలిస్తే.. ఈ ఫోన్ భారీ బ్యాటరీ, డిజైన్‌తో ఆకట్టుకుంటోంది.

ఈ రెడ్‌మి ఫోన్‌లో 8,000mAh బ్యాటరీ, 6.9-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4వ జనరేషన్ (Redmi Note 17 5G Launch) చిప్‌సెట్ ఉన్నాయి. ఈ ఫోన్ భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. రెడ్‌మి నోట్ 17 5జీ ధర, స్పెసిఫికేషన్లు, డిస్కౌంట్లు, ఏఐ ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 17 5జీ స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి నోట్ 17 5జీ ఫోన్ 7-అంగుళాల ట్రూకలర్ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.ఈ ఫోన్ తడి వేలితో కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇందులో హైడ్రోటచ్ 2.0 ఫీచర్ ఉంది. లో బ్లూ లైట్, PWM డిమ్మింగ్ కోసం TÜV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌ను అందిస్తుంది.

Read Also : Vi vs BSNL Plans : Vi, BSNL రూ. 998 ప్లాన్ , రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఇందులో ఏది బెటర్? వ్యాలిడిటీ, డేటా బెనిఫిట్స్ ఒకటేనా?

ఈ రెడ్‌మి నోట్ 4nm స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్, 8GB వరకు ర్యామ్, 2TB వరకు స్టోరేజ్ ఉన్నాయి. ఈ రెడ్‌మి నోట్ 8,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. 45W వైర్డ్ ఛార్జింగ్, 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ హైపర్‌ఓఎస్ 3 కింద ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. షావోమీ 4 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లకు అందిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. ఈ రెడ్‌మి ఫోన్ 2x ఇన్-సెన్సార్ జూమ్, నైట్ మోడ్, ఏఐ-ఆధారిత హెచ్‌డీఆర్, సీన్ డిటెక్షన్‌తో 50MP ఏఐ కెమెరా, 8MP ఫ్రంట్-ఫేసింగ్ సెన్సార్ కూడా ఉంది. అదనపు ఫీచర్లలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, IP65 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

ధర ఎంతంటే? :
షావోమీ రెడ్‌మి నోట్ 17 బేస్ వేరియంట్ ధర రూ. 27,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB ర్యామ్ టాప్ వేరియంట్ ధర రూ. 30,999గా ఉంది. ఈ ఫోన్ ఆర్కిటిక్ బ్లూ, స్టార్‌లైట్ పర్పుల్, డార్క్ నైట్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆసక్తిగల యూజర్లు రూ. 3వేలు బ్యాంక్ డిస్కౌంట్‌ అందిస్తుంది. ఈ రెడ్‌మి ఆగస్టు 12 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. షావోమీ ఇ-స్టోర్, రిటైల్ ఛానెల్‌, అమెజాన్‌లో సొంతం చేసుకోవచ్చు.