Redmi Note 17 Series : 200MP కెమెరా, 10000mAh బ్యాటరీతో రెడ్‌మి నోట్ 17 సిరీస్ వస్తోందోచ్.. లాంచ్ కు ముందే కీలక ఫీచర్లు లీక్!

Redmi Note 17 Series : రెడ్‌మి నోట్ 17 ప్రో మ్యాక్స్ ఈ సిరీస్‌లో టాప్ వేరియంట్‌గా ఉండనుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 చిప్‌సెట్‌ ఉండొచ్చు.. పూర్తి ఫీచర్ల వివరాలివే..

Redmi Note 17 Series

  • స్మార్ట్‌ఫోన్‌లు పవర్‌ఫుల్ చిప్‌సెట్‌లు, భారీ బ్యాటరీ కెపాసిటీ
  • రెడ్‌మి నోట్ 17 ప్రో మాక్స్ ఫోన్‌లో 200MP మెయిన్ కెమెరా ఉండొచ్చు
  • నోట్ 17 ప్రో మాక్స్ ఫోన్ 10,100mAh బ్యాటరీతో రానుంది

Redmi Note 17 Series : కొత్త రెడ్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో రెడ్‌మి నోట్ 17 సిరీస్ వచ్చేసింది. లాంచ్ డేట్ కూడా ఖరారైంది. ఈ సిరీస్ త్వరలో దేశీయ మార్కెట్లో లాంచ్ కానుందని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.

రెడ్‌మి నోట్ 17 సిరీస్‌లో రెడ్‌మి నోట్ 17, రెడ్‌మి నోట్ 17 ప్రో, రెడ్‌మి నోట్ 17 ప్రో మాక్స్ సహా పలు మోడళ్లు ఉంటాయని కంపెనీ చెబుతోంది. రెడ్‌మి నోట్ 17 ప్రో మాక్స్ టాప్ మోడల్ అని చెప్పొచ్చు. లాంచ్ కు ముందే ఈ సిరీస్ కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.. అవేంటో ఓసారి వివరంగా పరిశీలిద్దాం..

రెడ్‌మి నోట్ 17 సిరీస్ లాంచ్ సమయాన్ని కంపెనీ ధృవీకరించింది. ఈ కొత్త సిరీస్‌ను జూలైలో చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సిరీస్‌లో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో పవర్ ఫుల్ చిప్‌సెట్‌లు, భారీ బ్యాటరీతో వస్తాయని అంచనా. రెడ్‌మి నోట్ 15 సిరీస్‌కు అప్ గ్రేడ్ వెర్షన్‌గా రాబోతుంది.

Read Also : Gold Monetisation Scheme : లాకర్‌లో బంగారం ఉందా? ఇక అదే మీకు ఆదాయం తెచ్చిపెడుతుంది.. కేంద్రం కొత్త గోల్డ్ ప్లాన్!

స్పెషిఫికేషన్లు (అంచనా) :
ఈ సిరీస్‌కు సంబంధించి అనేక కీలక స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. నివేదికల ప్రకారం.. స్టాండర్డ్ రెడ్‌మి నోట్ 17లో 1.5K రిజల్యూషన్‌తో 6.83-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుందని అంచనా. రియర్ కెమెరాలో 50MP ప్రైమరీ కెమెరా, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

రెడ్‌మి నోట్ 17 ప్రో ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్‌ కలిగి ఉండొచ్చు. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుందని అంచనా. ఇందులో 50MP వెనుక కెమెరా ఉండే అవకాశం ఉంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 9000mAh బ్యాటరీతో వస్తుందని అంచనా.

ఈ సిరీస్‌లో రెడ్‌మి నోట్ 17 ప్రో మ్యాక్స్ టాప్ వేరియంట్‌గా రానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7500 చిప్‌సెట్ ఉంటుందని అంచనా. ఈ ఫోన్‌లో 200MP మెయిన్ కెమెరా ఉంటుందని అంచనా. అలాగే, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 10,100mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. అయితే, ఈ స్పెసిఫికేషన్లపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.