Redmi Turbo 5 : ఫోన్ కాదు పవర్‌బ్యాంక్ బాస్.. 100W ఛార్జింగ్, 7,560mAh బ్యాటరీతో రెడ్‌మి టర్బో 5 వస్తోందోచ్!

Redmi Turbo 5 : రెడ్‌మి టర్బో 5 స్మార్ట్‌ఫోన్‌ అతి త్వరలో లాంచ్ కానుంది. టర్బో సిరీస్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే కానుంది. లాంచ్ తేదీని కూడా కంపెనీ వెల్లడించింది.

Redmi Turbo 5

  • జూన్ 16న భారత మార్కెట్లో రెడ్‌మి టర్బో 5 లాంచ్
  • అమెజాన్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌
  • 24GB వరకు ఫుల్ ర్యామ్ సపోర్ట్‌, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌
  • 7,560mAh బ్యాటరీ, 50MP సోనీ ప్రైమరీ కెమెరా

Redmi Turbo 5 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? చైనా కంపెనీ రెడ్‌మి త్వరలో టర్బో 5 స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. టర్బో సిరీస్‌లో రానున్న ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే. అయితే, లాంచ్ తేదీ కూడా ముందే రివీల్ చేసింది.

రెడ్‌మి టర్బో 5లో మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, అమోలెడ్ డిస్‌ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటాయి. ఇప్పటివరకు వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లలో ఇదే సూపర్ ఫాస్ట్ ఫోన్ కానుంది. ఇందులో భారీ బ్యాటరీ 7,560mAh కూడా ఉంటుందని రెడ్‌మి చెబుతోంది.

రెడ్‌మి టర్బో 5 లాంచ్ డేట్ :
రెడ్‌మి టర్బో 5 స్మార్ట్‌ఫోన్ జూన్ 16న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ కోసం అమెజాన్‌లో మైక్రోసైట్‌ను కూడా కంపెనీ లైవ్‌స్ట్రీమ్ చేసింది. లాంచ్ తర్వాత ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో అమ్మకానికి రానుంది. రెడ్‌మి టర్బో 5 స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభించనుంది.

Read Also : Samsung Galaxy A35 5G : ఏంది భయ్యా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5G ఫోన్ మరి ఇంత తక్కువా?

రెడ్‌మి టర్బో 5 ఫీచర్లు ఇవే :
చైనా మార్కెట్లో రెడ్‌మి టర్బో 5 ఫోన్ లాంచ్ అయింది. 6.59-అంగుళాల (1,268×2,756 పిక్సెల్స్) అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్ 3,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 16GB వరకు LPDDR5x అల్ట్రా, ర్యామ్ 512GB వరకు, యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. పర్ఫార్మెన్స్ పరంగా పరిశీలిస్తే.. AnTuTu బెంచ్‌మార్క్‌లో దాదాపు 2.3 మిలియన్ పాయింట్లతో మంచి స్కోర్‌ను సాధించింది. ఈ ఫోన్ 12GB వర్చువల్ ర్యామ్ సహా 24GB వరకు ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. అయితే, ఇందులో 12GB LPDDR5x ర్యామ్ ఉంటుందని సమాచారం.

స్టోరేజ్ పరంగా చూస్తే.. UFS 4.1 టెక్నాలజీతో వస్తుంది. ఫాస్ట్ డేటా ట్రాన్స్‌ఫర్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో 3డీ ఐస్-లూప్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. లాంగ్ గేమింగ్ సెషన్‌లు, హై పర్ఫార్మెన్స్ సమయంలో మీ ఫోన్‌ కూలింగ్ అవుతుంది.

కెమెరా విషయానికి వస్తే.. రెడ్‌మి టర్బో5 ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 50MP (ఎఫ్/1.5) సోనీ IMX882 ప్రైమరీ షూటర్ 8MP (ఎఫ్/2.2) అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP (f/2.2) ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్‌లో 7,560mAh బ్యాటరీ కూడా ఉంది. 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.