Redmi Turbo 6 Max : 10,000mAh బ్యాటరీతో కొత్త రెడ్‌మి టర్బో వస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. లాంచ్ ఎప్పుడంటే?

Redmi Turbo 6 Max : రెడ్‌మి నుంచి సరికొత్త ఫీచర్లతో రెడ్‌మి టర్బో 6 మ్యాక్స్ వచ్చేస్తోంది.. భారీ బ్యాటరీ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.

Redmi Turbo 6 Max

  • ఈ ఫోన్‌లో 2K రిజల్యూషన్‌తో ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటుందని అంచనా
  • ఫస్ట్ టైమ్ షావోమీ రెగ్యులర్ ఫోన్‌లో భారీ డిస్‌ప్లేను అందించనుంది
  • ఈ ఫోన్ 2027 మొదటి త్రైమాసికంలో లాంచ్ కావచ్చు.

Redmi Turbo 6 Max : రెడ్‌మి లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్ వస్తోంది. కంపెనీ త్వరలో రెడ్‌మి టర్బో 6 మ్యాక్స్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ ముందు బ్యాటరీకి సంబంధించి కీలక వివరాలు రివీల్ అయ్యాయి. ఈ ఫోన్‌లో భారీ డిస్‌ప్లే ఉంటుందని అంచనా. మీడియాటెక్ డైమెన్సిటీ 9600s చిప్‌సెట్ కూడా ఉండొచ్చు. ఈ లైనప్‌లో 2 మోడళ్లు ఉండవచ్చు. ఈ రెడ్‌మి ఫోన్ ఫీచర్లను ఓసారి పరిశీలిద్దాం..

రెడ్‌మి టర్బో 6 మ్యాక్స్ లాంచ్ ముందు స్పెసిఫికేషన్లపై భారీ చర్చ జరుగుతోంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ఈ ఫోన్ బ్యాటరీకి సంబంధించి కీలక వివరాలను వెల్లడించింది. ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ ప్రకారం.. రెడ్‌మి టర్బో 6 మ్యాక్స్ 10,000mAh బ్యాటరీతో వస్తుందని అంచనా. కంపెనీ ఈ ఫోన్ టెస్టింగ్ చేస్తున్నట్టు సమాచారం. రెడ్‌మి నోట్ 17 ప్రో మ్యాక్స్‌తో సమానమైన బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.

Read Also : Apple iPhone 17 Pro Max : సూపర్ ఆఫర్ బ్రో.. ఈ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ భారీగా తగ్గిందోచ్.. ఇలా కొన్నారంటే?

రెడ్‌మి టర్బో 6 సిరీస్‌లో 2 మోడళ్లు ఉంటాయని అంచనా. అందులో ఒకటి స్టాండర్డ్ రెడ్‌మి టర్బో 6 కాగా, మరొకటి హై-పెర్ఫార్మెన్స్ రెడ్‌మి టర్బో 6 మ్యాక్స్ కావచ్చు. ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. ఇటీవల ఈ ఫోన్ రెండర్లు సైతం లీక్ అయ్యాయి. ఈ ఫోన్ ఐఫోన్ ఎయిర్ మాదిరిగానే ఫ్లాట్‌గా, గూగుల్ పిక్సెల్ వంటి కెమెరా బార్‌తో కనిపిస్తోంది.

లీకుల ప్రకారం.. రెడ్‌మి టర్బో 6 మ్యాక్స్ భారీ 7-అంగుళాల డిస్‌ప్లేతో రానుంది. 2K రిజల్యూషన్‌తో ఫ్లాట్ డిస్‌ప్లేగా వస్తుంది. భారీ స్క్రీన్‌తో ఇండస్ట్రీలోనే ఫస్ట్ రెగ్యులర్ స్మార్ట్‌ఫోన్ కావచ్చు. ఈ ఫోన్‌లో ఇంత పెద్ద డిస్‌ప్లేను అందించడం షావోమీకి కూడా ఇదే ఫస్ట్ టైమ్. ఈ ఫోన్ 2027 మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. కంపెనీ 2027 జనవరిలోనే లాంచ్ చేసే అవకాశం ఉంది.