Reliance Jio : జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఈ రీఛార్జ్ ప్లాన్ ఇక దొరకదు.. అసలు ట్విస్ట్ ఇదే!

Reliance Jio : మైజియో యాప్ ప్రత్యేకించి అందించే ప్రీపెయిడ్ ప్లాన్ నిలివేయాలంటూ ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. యాప్‌కు మాత్రమే లిమిట్ యాక్సెస్ అందించే రూ. 209 ప్లాన్ ఇప్పుడు అదృశ్యమైంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Reliance Jio

  • జియో రూ. 209 ప్రీపెయిడ్ ప్లాన్ మైజియో యాప్‌లో కనిపించదు
  • ఈ ప్లాన్ 22 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1GB డేటా అందిస్తుంది
  • ఓటీటీ బెనిఫిట్స్ కోసం జియోటీవీ, జియోఏఐక్లౌడ్ స్టోరేజ్

Reliance Jio : రిలయన్స్ జియో యూజర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. పాపులర్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ను సైలెంట్‌గా ఎత్తేసింది. యాప్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ అయిన రూ. 209 తొలగించింది. కంపెనీ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

గతంలో మైజియో యాప్‌లోని అఫర్డబుల్ ప్యాక్స్ కేటగిరీలో వాల్యూ ప్లాన్స్ కేటగిరీ కింద ఈ ప్లాన్ (Reliance Jio) అందుబాటులో ఉండగా ఇప్పుడు ఒక్కసారిగా అదృశ్యమైంది. ఇప్పటికే మీరు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుని డ్యూ డేట్ వరకు మాత్రమే యాక్సస్ పొందగలరు. ఆ తర్వాత ఈ ప్లాన్ మళ్లీ రీఛార్జ్ చేసుకోవడం కుదరదు.

ఇదిలా ఉండగా, జియో 4జీ ఫీచర్ ఫోన్లలో అందించే జియో ఫోన్ రీఛార్జ్ ప్లాన్లను కూడా జియో ఎత్తేసింది. జియోభారత్ ప్లాన్ పేరులో కూడా మార్పులు చేసింది. జియోఫోన్ ఫోన్లలో అందించే ప్లాన్లలో పారదర్శకత లోపించిందని వివక్షాపూరితంగా ఉన్నాయని, కొన్ని టారిఫ్ విధానాలను నిలిపివేయాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) రిలయన్స్ జియోను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మైజియోలో రూ. 209 ప్లాన్ కనిపించడం లేదు.

Read Also :  Vodafone Idea : Vi బంపర్ ఆఫర్.. జస్ట్ రూ. 99 ప్లాన్‌తో నాన్‌స్టాప్ డేటా.. యూజర్లకు ఫుల్ జోష్!

యూజర్లు కోల్పోయే బెనిఫిట్స్ ఏంటి? :
జియో యూజర్లు ఇప్పుడు రోజుకు 1GB డేటా అందించే జియో సింగిల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ . 209 ప్యాక్‌ ఇక పొందలేరు. ప్రస్తుతం ఈ రీఛార్జ్ ప్లాన్ (MyJio) యాప్‌లో కనిపించడం లేదు. జియో మళ్లీ ఈ ప్లాన్ తిరిగి ప్రవేశపెడుతుందో లేదో స్పష్టంగా తెలియదు.

జియో రూ. 209 ప్రీపెయిడ్ ప్లాన్ :
రూ. 209 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే రోజుకు రూ. 9.5 చొప్పున ఛార్జ్ అవుతుంది. 22 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1GB చొప్పున మొత్తం 22GB హై-స్పీడ్ డేటా అందిస్తుంది. ఈ ప్యాక్‌లో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్, ఓటీటీ బెనిఫిట్స్ కోసం జియోటీవీ, జియోఏఐక్లౌడ్ స్టోరేజ్‌కు యాక్సెస్ అందిస్తుంది. రోజువారీ హై-స్పీడ్ కోటా తర్వాత ఆ రోజు మిగిలిన సమయానికి డేటా స్పీడ్ 64Kbpsకి పడిపోతుంది.