Vodafone Idea : Vi బంపర్ ఆఫర్.. జస్ట్ రూ. 99 ప్లాన్‌తో నాన్‌స్టాప్ డేటా.. యూజర్లకు ఫుల్ జోష్!
Vodafone Idea : వోడాఫోన్ ఐడియా ఇటీవల రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. పాత కస్టమర్ల కోసం ఇప్పటికే రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో ఉండేది. ఆ ప్లాన్‌తో 14 రోజుల సర్వీస్ వ్యాలిడిటీ, 200MB డేటా అందిస్తుంది.
Vodafone Idea Recharge
- వోడాఫోన్ ఐడియా రూ. 99 డేటా వోచర్‌తో అన్లిమిటెడ్ డేటా
- యూజర్ల కోసం రూ. 99 డేటా వోచర్ అందుబాటులో
- ఇది కొత్త ప్లాన్ కాదు.. ఎలా రీఛార్జ్ చేయాలంటే?
Vodafone Idea : వోడాఫోన్ ఐడియా యూజర్లకు పండగే.. టెల్కో కంపెనీ కొత్త రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. పాత కస్టమర్ల కోసం ఇప్పటికే రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఆ ప్లాన్‌తో 14 రోజుల సర్వీస్ వ్యాలిడిటీ, 200MB డేటా లభించేది. అయితే, ప్రస్తుత రూ.99 ప్లాన్‌తో సర్వీస్ (Vodafone Idea Plans ) వ్యాలిడిటీ రాదు. అందుకే కంపెనీ 4G, 5G ప్రీపెయిడ్ ప్లాన్లతో అన్ లిమిటెడ్ డేటాను అందిస్తోంది.
ఈ అన్ లిమిటెడ్ డేటాకు లిమిట్ ఉంది. 300GB FUP (ఫెయిర్ యూసేజ్ పాలసీ) లిమిట్ కూడా ఉంది. అయినా డేటా (Vodafone Idea) వాడేసుకోవచ్చు. వోడాఫోన్ ఐడియా 4G డేటా వోచర్లతో కూడా అన్ లిమిటెడ్ డేటాను అందిస్తోంది. రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్ ఎలా రీఛార్జ్ చేసుకోవాలి? ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు అనేది వివరంగా పరిశీలిద్దాం..
రూ. 99 డేటా వోచర్ బెనిఫిట్స్ :
వోడాఫోన్ ఐడియా యూజర్ల కోసం రూ. 99 డేటా వోచర్ అన్లిమిటెడ్ డేటాతో వస్తుంది. అయితే, కొత్త ప్లాన్ కాదు. ఈ రూ. 99 డేటా వోచర్ ఇప్పటికే ఉంది. దేశంలోని ప్రతి టెలికాం సర్కిల్లోని కస్టమర్లకు లభిస్తోంది. ఈ ప్లాన్ 2 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. సర్వీస్ వ్యాలిడిటీ కాదు.
కేవలం డేటా వోచర్ స్టాండ్అలోన్ వ్యాలిడిటీ మాత్రమే. సాధారణంగా డేటా వోచర్లు యూజర్లకు ఎలాంటి సర్వీస్ వ్యాలిడిటీని అందించవు. డేటా వోచర్‌తో రీఛార్జ్ చేసి బెనిఫిట్స్ పొందాలంటే మీకు ముందుగా యాక్టివ్ బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ ఉండాలి.
ఈ రూ. 99 ప్లాన్ కోసం రోజుకు సుమారుగా రూ. 50 ఖర్చవుతుంది. ప్రతిరోజూ 20GB డేటా లభిస్తుంది. రెండు రోజుల్లో వాడితే 40GB డేటా కోసం రూ. 99తో రీఛార్జ్ చేసుకోవాలి. టెల్కో మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.
