Jio Recharge Plans : వారెవ్వా.. డేటా వాడని వారికి జియో బంపర్ ఆఫర్.. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో కొత్త ప్లాన్లు.. 84 రోజులు ఎంజాయ్!

Jio Recharge Plans : జియో కొత్త రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది. ఇకపై డేటా అవసరం లేకుండానే జియో రీఛార్జ్ ప్లాన్ పొందవచ్చు. అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్, డేటా ప్యాక్ కూడా పొందవచ్చు.

Jio Recharge Plans

  • రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్లు వచ్చేశాయి
  • డేటాతో పనిలేకుండా వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్
  • అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS బెనిఫిట్స్, 84 రోజలు వ్యాలిడిటీ

Jio Recharge Plans : జియో యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. ఇకపై డేటా ప్యాక్ లేకుండానే రీఛార్జ్ చేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS బెనిఫిట్స్ పొందవచ్చు. మీకు కేవలం కాలింగ్ మాత్రమే అందించే ప్లాన్ కావాలా? అయితే, జియో పోర్ట్‌ఫోలియోలో అన్ లిమిటెడ్ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

కేవలం కాలింగ్ బెనిఫిట్స్ మాత్రమే అందించే ప్లాన్ కావాలా? జియో పోర్ట్‌ఫోలియోలో (Jio Recharge Plans) సరికొత్త ప్లాన్‌ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద మీరు రూ. 450 కన్నా తక్కువ ధరకే 84 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను పొందవచ్చు.

ఈ జియో ప్లాన్ ధర కేవలం రూ. 448 మాత్రమే. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ డేటా ఉండదు. కానీ, రూ. 448కే నెలకు కేవలం రూ. 160కే అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్ పొందవచ్చు.

జియో రూ. 448 ప్లాన్‌లో స్పెషాలిటీ ఏంటి? :
స్పెషల్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేని వారికి బెస్ట్ ప్లాన్ ఇది. ఇల్లు లేదా ఆఫీస్ వై-ఫై స్పీడ్ తక్కువ ఉండేవారికి జియో రూ. 448 ప్లాన్ చాలా బెస్ట్. అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS సర్వీసులను అందిస్తుంది. మీకు వేరే డేటా ప్యాక్ కావాలంటే రూ. 11 నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు.

Read Also : MacBook Air M5 : లక్ష విలువైన ఈ ల్యాప్‌టాప్ ఇప్పుడు అతి తక్కువ ధరకే.. మ్యాక్‌బుక్ ఎయిర్ M5పై బంపర్ డీల్!

ఈ రీఛార్జ్ ఎందుకు ముఖ్యమంటే? :
ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎక్కువగా ఫోన్లలో రెండు నంబర్లను వాడుతున్నారు. జియో యూజర్లు కాలింగ్, SMS సర్వీసుల కోసం 84 రోజుల వ్యాలిడిటీతో ఈ జియో ప్లాన్ ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ వాయిస్ కాలింగ్, SMS సర్వీసులు యాక్టివ్‌గా ఉంటాయి. సిమ్ ఇన్ యాక్టివ్‌గా ఉంటే డిసేబుల్ అవ్వడం లేదా వేరొకరికి చేతికి వెళ్తుంది.

ఈ ప్లాన్ ద్వారా మీ నంబర్‌ యాక్టివ్‌గా ఉండటమే కాదు.. నెలకు రూ. 160 కన్నా తక్కువకే వాడుకోవచ్చు. మీ నంబర్‌ను యాక్టివ్‌ కోసం రూ. 11 మెథడ్ కన్నా చాలా బెస్ట్. మీ నంబర్ 90 రోజుల పాటు యాక్టివ్‌గా ఉన్నప్పటికీ వాయిస్ కాల్స్, SMS పంపలేరు. చివరికి ఇతరులు పంపిన మెసేజ్ పొందలేరు.

అన్‌లిమిటెడ్ కాలింగ్‌ బెనిఫిట్స్ :
రూ. 448 ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ కాలింగ్, SMS బెనిఫిట్స్ పొందవచ్చు. జియోటీవీ, జియోక్లౌడ్ యాప్‌లను కూడా పొంవచ్చు. ఈ ప్లాన్ కేవలం వాయిస్ కాల్స్ లేదా టెక్స్ట్ మాత్రమే పరిమితం కాదు. జియోటీవీలో ఇష్టమైన షోలు, మూవీలు, లైవ్ టీవీని చూడొచ్చు. అదే సమయంలో జియోక్లౌడ్ మీ ఫోన్ స్టోరేజ్‌ మరింత పెంచుకోవచ్చు. కనెక్టివిటీ కోసం ఎంటర్ టైన్మెంట్, స్టోరేజ్ కోరుకునే యూజర్లకు అద్భుతంగా ఉంటుంది.