MacBook Air M5 : లక్ష విలువైన ఈ ల్యాప్‌టాప్ ఇప్పుడు అతి తక్కువ ధరకే.. మ్యాక్‌బుక్ ఎయిర్ M5పై బంపర్ డీల్!
MacBook Air M5 : క్రోమా ఎవ్రీథింగ్ ఆపిల్ సేల్ సెకండ్ సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో అనేక ఆపిల్ ప్రొడక్టులపై కొత్త డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు పొందవచ్చు. ఈ ఆఫర్ మే 16వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
MacBook Air M5
- క్రోమా ఎవ్రీథింగ్ ఆపిల్ సెకండ్ సేల్ ప్రారంభం
- ఆపిల్ ప్రొడక్టులపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు
- మ్యాక్ బుక్ ఎయిర్ M4పై అద్భుతమైన డిస్కౌంట్
MacBook Air M5 : ఆపిల్ లవర్స్ డోంట్ మిస్.. కొత్త సేల్ మళ్లీ మొదలైంది. కొత్త ఐఫోన్, మ్యాక్ బుక్ ల్యాప్ టాప్ తీసుకునేవారికి అద్భుతమైన టైమ్. ఆపిల్ ప్రొడక్టులను కొనుగోలుచేసేవారిక కోసం ప్రత్యేకించి క్రోమా ఎవ్రీథింగ్ ఆపిల్ సేల్ మొదలైంది. ఈ సెకండ్ సేల్‌లో అనేక ఆపిల్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు, మరెన్నో ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయి.
ఈ సేల్ మే 1వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో ఐఫోన్, మ్యాక్‌బుక్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్, ఆపిల్ వాచ్ వంటి ప్రొడక్టులపై స్పెషల్ డీల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ సేల్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M5 ధర భారీగా తగ్గింపుతో లభిస్తుంది. ఇప్పుడు షరతులతో ఈ మ్యాక్‌బుక్ రూ. 74,619 ధరకు లభిస్తుంది.
మ్యాక్‌బుక్ ఎయిర్ M5 ధర భారీ తగ్గింపు :
రూ. 1,19,900 ధరతో లాంచ్ అయిన 13-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ M5 ఇప్పుడు విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం రూ. 1,07,910 ప్రత్యేక ధరకు లభిస్తోంది. వినియోగదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, టాటా న్యూ కాయిన్స్ బెనిఫిట్స్ ద్వారా ధర మరింత తగ్గించుకోవచ్చు.
క్రోమా ప్రకారం.. ఆసక్తిగల కొనుగోలుదారులు తమ పాత ఫోన్ రూ.15వేల వరకు అదనంగా రూ. 10వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
ఇందులో రూ. 8,291 వరకు టాటా న్యూ కాయిన్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. తద్వారా అసలు ధర నుంచి రూ. 74,619కి తగ్గుతుంది. ఈ సేల్‌లో మ్యాక్‌బుక్ (13-అంగుళాల)పై కూడా ఆఫర్లు ఉన్నాయి. అర్హత గల ఆఫర్లతో రూ. 39,069 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో ఐఫోన్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి.
ఆపిల్ ఐఫోన్ 17(256GB) ప్రారంభ ధర రూ. 44,768గా ఉంది. అసలు ధర 82,900 నుంచి రూ. 23,500 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, రూ. 8వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, డిస్కౌంట్ కూపన్లు, టాటా న్యూ కాయిన్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. అంతేకాదు.. క్రోమా ఇతర ఆఫర్లతో ఐఫోన్ 15 (128GB)ని రూ. 36,891కి, ఐఫోన్ 16 (128GB)ని రూ. 40,041 ధరకు అందిస్తోంది.
ఇతర ఆపిల్ ప్రొడక్టులపై కూడా భారీ ఆఫర్లు :
- ఐప్యాడ్ 11వ జనరేషన్ ప్రారంభ ధర రూ. 29,489
- ఐప్యాడ్ ఎయిర్ M4 ప్రారంభ ధర రూ. 55,490
- ఎయిర్‌పాడ్స్ ప్రో 3 ప్రారంభ ధర రూ. 22,491
- ఎయిర్‌పాడ్స్ 4 ప్రారంభ ధర రూ. 10,791
- ఆపిల్ వాచ్ SE 3 ప్రారంభ ధర రూ. 23,388
క్రోమా ప్రకారం.. ఈ సేల్ ప్రత్యేకంగా విద్యార్థులు, నిపుణులు, కంటెంట్ క్రియేటర్లు, ఆపిల్ యూజర్లను లక్ష్యంగా చేసుకుంది. ఈ సేల్ సమయంలో HDFC టాటా న్యూ కార్డ్ హోల్డర్ల కోసం కంపెనీ ఈఎంఐ ప్లాన్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, అదనపు సేవింగ్ ఆఫర్లను కూడా అందిస్తోంది.
