Jio Google AI Pro : జియో యూజర్లకు బిగ్ షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో గూగుల్ ఏఐ ప్రో బంద్.. వారికి మాత్రమే..!
Jio Google AI Pro : జియో ప్రీపెయిడ్ ప్లాన్ కావాలా? కొత్త యూజర్లకు గూగుల్ ఏఐ ప్రో ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఇక లభించదు.. రిలయన్స్ జియో ఇప్పుడు కాన్వా ప్రో, కాన్వా ప్రో లైట్ ఆఫర్లు అందిస్తోంది. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- November 15, 2026 / 04:24 PM IST
Jio Google AI Pro
- కొత్త జియో యూజర్లకు గూగుల్ ఏఐ ప్రో బెనిఫిట్ కట్
- రూ.35,100 విలువైన గూగుల్ ఏఐ ప్రోకి గుడ్‌బై..
- జియో రీఛార్జ్ ప్లాన్స్‌లో మార్పులు..
- గూగుల్ ఏఐ ప్రో స్థానంలో ఏమొచ్చిందో తెలుసా?
Jio Google AI Pro : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు ఎంపిక చేసిన ప్లాన్లపై ఉచితంగా అందిస్తున్న గూగుల్ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్ బెనిఫిట్ కొత్త యూజర్లకు నిలిపివేసింది.
దీంతో జియో రీఛార్జ్ చేసుకునే వారికి కొంత నిరాశ ఎదురుకానుంది. అయితే, ఇప్పటికే ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకున్న యూజర్లు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి గతంలో ఇచ్చిన బెనిఫిట్ గడువు తేదీవరకు యథావిధిగా కొనసాగుతుంది..
గతంలో జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు సుమారు రూ.35,100 విలువైన గూగుల్ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అందించింది. ఈ ఆఫర్ ద్వారా 18 నెలల పాటు గూగుల్ ఏఐ సర్వీసులను వినియోగించుకునే అవకాశం కల్పించింది. అయితే తాజాగా కొత్తగా ఈ బెనిఫిట్ పొందాలనుకునే వారికి మాత్రం అవకాశం లేకుండా పోయింది..
గూగుల్ ఏఐ ప్రో స్థానంలో కాన్వా సబ్‌స్క్రిప్షన్ :
గూగుల్ ఏఐ ప్రో ఆఫర్‌ను నిలిపివేసిన జియో.. ఇప్పుడు కాన్వా సబ్‌స్క్రిప్షన్‌పై ఫోకస్ పెట్టింది. ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్లతో కాన్వా ప్రో, కాన్వా ప్రో లైట్ బెనిఫిట్స్ అందిస్తోంది. రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే వారికి రూ.4వేల విలువైన కాన్వా ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను 12 నెలల పాటు ఫ్రీగా అందిస్తోంది.
Read Also : Samsung Galaxy F70 Pro 5G : ఫ్లిప్‌కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్.. రూ.26వేల శాంసంగ్ 5G ఫోన్ జస్ట్ ఎంతంటే?
ఈ ప్లాన్‌లో రోజుకు 2.5GB డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు జియోహాట్‌స్టార్ మొబైల్, జియోగేమ్స్ వంటి అదనపు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
అలాగే, రూ.349 ప్లాన్‌తో పాటు రోజుకు 2GB లేదా ఆపై ఎక్కువ డేటా అందించే అర్హత ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్లపై రూ.1,590 విలువైన కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను 12 నెలల పాటు ఫ్రీగా పొందవచ్చు. దీనికి అదనంగా జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, 50GB జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ బెనిఫిట్స్ లభిస్తాయి.
ఈ ఆఫర్లను మైజియో యాప్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఒక్క మొబైల్ నంబర్‌పై ఒక్కసారి మాత్రమే ఈ బెనిఫిట్ పొందవచ్చు. గూగుల్ ఏఐ ప్రో ఆఫర్‌ను ఎందుకు నిలిపివేశారనే దానిపై జియో క్లారిటీ ఇవ్వలేదు..
