Reliance Jio : జియోలో ఆ చౌకైన ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. మరో ప్లాన్ ధర తగ్గింది.. డేటా, వ్యాలిడిటీ ఎంత? ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

Reliance Jio : జియో యూజర్ల కోసం అత్యంత చౌకైన మళ్లీ తీసుకొచ్చింది. అలాగే మరో రెండు ప్లాన్ల ధరలను కూడా సవరించింది. రూ. 189 ప్లాన్, రూ. 445 ప్లాన్ డేటా, వ్యాలిడిటీ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Reliance Jio revises Rs 448 prepaid plan

Reliance Jio : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. భారత అతిపెద్ద టెలికాం ఆపరేటర్ సంస్థ రిలయన్స్ జియో వినియోగదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ధర రూ.445. అయితే, ఇది నిజంగా కొత్త ప్లాన్ కాదని గమనించాలి. ఇది పాత ప్లాన్.. కాకపోతే జియో ఈ ప్లాన్ ధరను చాలా స్వల్పంగా తగ్గించింది.

Read Also : Reliance Jio : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఫ్రీగా రెండేళ్లు యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్.. జియోఫైబర్ ఎయిర్ ఫైబర్ ప్లాన్లు కూడా..!

ఈ ప్లాన్ ధర గతంలో రూ. 448గా ఉండేది. అయితే, ఇప్పుడు కొత్త ధర రూ.3 తగ్గించింది. దాంతో రూ.448 ప్లాన్ ధర కాస్తా రూ.445కి చేరుకుంది. ఈ ప్లాన్ కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ ఆఫర్ మాత్రమే అందిస్తుంది. రూ. 445 ప్లాన్ కొత్త జియోటీవీ ప్రీమియం బండిల్ ప్లాన్, బెనిఫిట్స్ పాత రూ. 448 ప్లాన్ మాదిరిగానే ఉంటాయి.

జియో రూ. 445 రీఛార్జ్ :
రిలయన్స్ జియో రూ. 445 ప్రీపెయిడ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్, 2GB రోజువారీ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు అన్‌లిమిటెడ్ డేటాను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ సర్వీస్ వాలిడిటీ 28 రోజులు ఉంటుంది.

వినియోగదారులకు జియో టీవీ ప్రీమియం యాక్సస్ పొందవచ్చు. అంటే.. మీరు SonyLIV, ZEE5, Jio Cinema Premium, Lionsgate Play, Discovery+, SunNXT, Kancha Lanka, Planet Marathi, Chaupal, Hoichoi, Fancode కంటెంట్ పొందవచ్చు. వాస్తవానికి, జియో టీవీ, జియో క్లౌడ్ కూడా ఉన్నాయి.

జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్‌ బ్యాక్ :
జియో గతంలో తొలగించిన రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ‘సరసమైన ప్యాక్స్’ కేటగిరీ కింద జాబితా చేసిన ఈ ప్యాక్ 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. వినియోగదారులకు మొత్తం 2GB డేటాను (లిమిట్ దాటాక స్పీడ్ 64kbpsకి తగ్గుతుంది), ఏదైనా నెట్‌వర్క్‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది.

జియో సబ్‌స్ర్కైబర్లు జియోటీవీ, జియోసినిమా, (ప్రీమియం కంటెంట్ మినహాయించి) జియోక్లౌడ్ స్టోరేజీ వంటి జియో సర్వీసులకు కూడా కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ ప్లాన్ ట్రాయ్ నుంచి ఇటీవలి నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా వచ్చింది.

దీని ప్రకారం.. టెలికాం ఆపరేటర్లు వాయిస్, ఎస్ఎంఎస్-కేంద్రీకృత ప్యాక్‌లను ప్రవేశపెట్టాలి. తక్కువ ధరకు ప్రాథమిక కనెక్టివిటీ అవసరమయ్యే వినియోగదారులకు ఈ ప్లాన్ తగిన ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : Reliance Jio : జియో యూజర్లకు భలే షాకిచ్చిందిగా.. ఆ రెండు పాపులర్ ప్లాన్లను సైలెంట్‌గా ఎత్తేసింది.. అసలు రీజన్ ఇదే!

ఈ రెండు ప్లాన్లలో మార్పులు :
ఇటీవల, రిలయన్స్ జియో మరో రెండు ప్రీపెయిడ్ ప్లాన్లలో మార్పులు చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనల ప్రకారం.. ఈ మార్పులను చేసింది. వాయిస్, ఎస్ఎంఎస్ సర్వీసులను మాత్రమే అందించే ప్లాన్‌లను తిరిగి ప్రవేశపెట్టాలని ట్రాయ్ టెలికాం కంపెనీలను ఆదేశించింది. దాంతో జియో రూ. 448, రూ. 1,748 రెండు కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా కాలింగ్, మెసేజింగ్ సర్వీసు మాత్రమే ఉపయోగించాలనుకునే, డేటా అవసరం లేని కస్టమర్ల కోసం తీసుకొచ్చింది.

జియో రూ. 1748 ప్లాన్ వివరాలు :
ఈ ప్లాన్ 336 రోజుల వ్యాలిడీటీతో వస్తుంది. వినియోగదారులకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 3,600 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఎక్కువ రోజులు కాలింగ్, మెసేజింగ్ సర్వీసులను మాత్రమే ఉపయోగించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.