Jio Recharge Plan : జియో రూ.3,599 ప్లాన్‌తో డబుల్ ధమాకా.. 912GB డేటా, అన్‌లిమిటెడ్ 5G, జెమిని ప్రో ఫ్రీ!
Jio Recharge Plan : జియో యూజర్ల కోసం అద్భుతమైన వార్షిక ప్లాన్.. ఒకసారి రీఛార్జ్ చేశారంటే ఏడాది మొత్తం ఎంజాయ్ చేయొచ్చు.. 912GB డేటా, అన్‌లిమిటెడ్ 5G, ఫ్రీగా జెమిని ప్రో కూడా పొందవచ్చు.
- Sreehari A
- Published on- August 2, 2026 / 02:22 PM IST
Jio Recharge Plan
- 365 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్
- SMS బెనిఫిట్స్, అన్‌లిమిటెడ్ 5జీ డేటా
- 50GB జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల గూగుల్ జెమిని ప్రో
Jio Recharge Plan : జియో బంపర్ ఆఫర్.. జియో సరికొత్త వార్షిక ప్లాన్ తీసుకొచ్చింది. లాంగ్ టైమ్ ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.3,599 వార్షిక ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, SMS బెనిఫిట్స్ అందిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ 5జీ డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. అంతేకాదు.. రోజుకు 2.5GB హై-స్పీడ్ 4జీ డేటా అందిస్తుంది. ఏడాది మొత్తం 912.5GB హై-స్పీడ్ డేటా ఎంజాయ్ చేయొచ్చు.
రోజువారీ లిమిట్ దాటాక ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది. ఈ ప్లాన్‌తో అన్ని నెట్‌వర్క్‌లకు (Jio Recharge Plan) అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ పొందవచ్చు. జియో ఏఐ ఆధారిత సర్వీసులు, ఇతర డిజిటల్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
ప్రతి నెలా రీఛార్జ్ లేకుండా ఒకేసారి ఏడాది వ్యాలిడిటీ కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ అద్భుతంగా ఉంటుంది. స్ట్రీమింగ్ కంటెంట్, ఆన్‌లైన్‌లో క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోం లేదా మొబైల్ డేటా టెన్షన్ అవసరం లేనివారికి ఇది సరైన ప్లాన్.
- 3 నెలలు జియోహాట్‌స్టార్ మొబైల్ + హాలీవుడ్ కంటెంట్
- 50GB జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్
- 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్
జియో రూ. 3,999 వార్షిక ప్లాన్ బెనిఫిట్స్ అందిస్తుంది. 365 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజువారీ హై-స్పీడ్ డేటా, SMS బెనిఫిట్స్, జియో యాప్స్, డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లకు కూడా యాక్సెస్ పొందవచ్చు.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే 336 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. దాదాపు ఏడాది వరకు లాంగ్ వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజువారీ డేటా, రోజుకు 100 SMS బెనిఫిట్స్, అలాగే జియో యాప్స్ యాక్సస్ పొందవచ్చు. తక్కువ ఖర్చుతో లాంగ్ వ్యాలిడిటీ కోరుకునేవారికి సరిపోతుంది.
మీరు ఎక్కువ కాల్స్ చేస్తుంటారా? డేటా అవసరం లేదా? అయితే రూ. 2,025 ప్లాన్ తీసుకోండి. ఎక్కువ ఇంటర్నెట్ అవసరంలేనివారికి చాలా బెస్ట్. ఏడాదిపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, కొంత డేటా SMS బెనిఫిట్స్ మాత్రమే కోరుకునే వారికి చాలా బెస్ట్. సెకండరీ సిమ్ యూజర్లకు Wi-Fi పెద్దగ వాడనవారికి బెస్ట్ ప్లాన్.
జియో వార్షిక ప్లాన్లలో ఏది బెస్ట్? :
- రూ. 2,025 : అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా ఎక్కువ వాడేవాళ్లకు బెస్ట్
- రూ. 3,336 : తక్కువ ధరలో లాంగ్ టైమ్ వ్యాలిడిటీ కోసం
- రూ. 3,599 : ఎక్కువగా కాల్స్, అన్‌లిమిటెడ్ 5జీ, OTT, ఏఐ ఫీచర్లు
- రూ. 3,999 : ప్రీమియం బెనిఫిట్స్, బండిల్ సబ్‌స్క్రిప్షన్లు
నెలవారీ రీఛార్జ్‌లతో కాకుండా కాలింగ్, ఫాస్ట్ డేటా, స్ట్రీమింగ్ వంటి బెనిఫిట్స్ కోసం చూస్తుంటే జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు తీసుకోవచ్చు.
