×
Ad

Republic Day Sale 2026 : రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు.. కొత్త ఫోన్ కొనే ముందు ఈ 5 విషయాలను తప్పక తెలుసుకోండి.. లేదంటే భారీగా నష్టపోతారు!

Republic Day Sale : అమెజాన్‌లో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. మీరు ఈ కొత్త ఫోన్ కొనాలని చూస్తుంటే ముందుగా కొన్ని విషయాలను తప్పక తెలుసుకోండి.

Republic Day Sale (Image Credit To Original Source)

Republic Day Sale 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఒక్క క్షణం ఆగి ఈ స్టోరీ చదవండి.. జనవరి 16న అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. అలాగే, ఈ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతుంది. మీరు ఈ సేల్‌ సందర్భంగా కొత్త ఫోన్ కొనాలనుకుంటే కొనేసుకోండి. కానీ, కొన్ని విషయాలను తప్పక తెలుసుకుని ఉండాలి.

భారీ ఫ్లాట్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ చూసి తొందరపడి అనేక మంది కొత్త మొబైల్స్ ఆర్డర్ చేస్తారు. ఒకసారి కొన్నాక ఆ ఫోన్ తమకు నచ్చిన విధంగా లేదని బాధపడాల్సి వస్తుంది. మీరు కూడా కొత్త ఫోన్ కొనాలని భావిస్తుంటే ముందుగా ఈ 5 ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. ఆ తర్వాత కొత్త ఫోన్ కొనేసుకోండి.

పాత ఫోన్ మోడల్ కొనొద్దు :
చాలామంది సేల్ సమయంలో తక్కువ ధరకే వస్తుందని ఒక ఏడాది లేదా 2 ఏళ్ల పాత స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేస్తుంటారు. ఆ తర్వాత తెగ బాధపడిపోతుంటారు. ఎందుకంటే.. పాత మోడళ్లు లేటెస్ట్ ప్రాసెసర్‌లు, కొత్త సాఫ్ట్‌వేర్ అప్ డేట్స్ లేదా లాంగ్ టైమ్ సపోర్టును అందించవు. ఆ తర్వాత మీ పాత ఫోన్ వాడినా అన్ని ఫీచర్లు, ఇతర బెనిఫిట్స్ పొందలేరు.

మీకు కొత్త ఫోన్ అవసరమా? :
సాధారణంగా చాలామంది సేల్ సమయంలో కొత్త ఫోన్ కొనాలని చూస్తుంటారు. కొంతమంది ఫోన్ అవసరం లేకున్నా ఆఫర్ పేరుతో కొనేస్తుంటారు. ముందుగా మీకు ఫోన్ అవసరం ఉందో లేదో చూసుకోండి.

Republic Day Sale (Image Credit To Original Source)

ఉదాహరణకు.. మీరు గేమింగ్ కోసం ఫోన్ కొనుగోలు చేస్తుంటే.. ప్రాసెసర్, ర్యామ్ ఎంత ఉండాలో ముందే నిర్ణయించుకోండి. మీరు ఫొటోగ్రఫీని ఇష్టపడితే కెమెరా సెన్సార్ ఫీచర్లను చెక్ చేయండి. ఎక్కువగా వీడియోలు చూసేవారు అయితే డిస్‌ప్లే, బ్యాటరీ లైఫ్ ఎంత అనేది చెక్ చేయండి.

Read Also : PF withdraw UPI : ఈపీఎఫ్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. ఇకపై UPI నుంచే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఎప్పటినుంచంటే?

బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్ :

సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ వాల్యూ ఎంత అనేది చాలామంది కొనుగోలుదారులు పెద్దగా పట్టించుకోరు. కొన్నిసార్లు మీ దగ్గర బ్యాంకు క్రెడిట్ కార్డ్ లేకపోవచ్చు. అలాగే మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ సరిగా లేకున్నా డీల్ పూర్తి బెనిఫిట్ పొందలేరు. కొత్త ఫోన్ కొనుగోలు చేసే ముందు ఆఫర్, ఎక్స్చేంజ్ నిబంధలను తప్పనిసరిగా తెలుసుకోండి.

ర్యామ్, స్టోరేజీ ఆప్షన్లు :
తక్కువ ధరలో వస్తుంది కదా అని 4GB ర్యామ్, అంతకంటే తక్కువ స్టోరేజ్ ఫోన్‌ కొనకండి. కనీసం 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఫోన్‌ తీసుకోండి. తద్వారా మీరు ఎక్కువ కాలం ఆ ఫోన్ వాడుకోవచ్చు.

రివ్యూలు, రేటింగ్‌లు :
మీరు కొత్త ఫోన్ కొనే ముందు ఫోన్ రివ్యూ, రేటింగ్‌లను ఆన్‌లైన్‌లో చెక్ చేయొచ్చు. యూజర్ల రివ్యూలు, ఎక్స్ పర్ట్స్ రివ్యూలను తప్పకుండా చదవండి. కొన్నిసార్లు ఫోన్‌లు ఆన్‌లైన్‌లో మంచిగా కనిపిస్తాయి. కానీ, రియల్ టైమ్ వాడినప్పుడు బ్యాటరీ, కెమెరా లేదా హీటింగ్ సమస్యలు బయటపడతాయి.