Samsung-Xiaomi Prices : స్మార్ట్‌ఫోన్ కొనేవారికి బిగ్ షాక్.. భారీగా పెరిగిన శాంసంగ్, షావోమీ ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంతంటే?
Samsung-Xiaomi Prices : శాంసంగ్, షావోమీ స్మార్ట్ఫోన్ల ధరలు రూ.4వేల వరకు పెరిగాయి. గెలాక్సీ, రెడ్మి మోడళ్ల కొత్త ధరలు, ఏయే ఫోన్లపై ఎంత పెంపు ఉందో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- November 17, 2026 / 10:03 AM IST
Samsung-Xiaomi Prices
- శాంసంగ్, షావోమీ యూజర్లకు బ్యాడ్ న్యూస్..
- షావోమీ, శాంసంగ్ ఫోన్ల ధరలు రూ.4 వేల వరకు పెంపు
- మొబైల్ మార్కెట్లో ధరల మంటలు
- రెడ్మీ, గెలాక్సీ ఫోన్ల ధరలు పెరిగాయి
Samsung-Xiaomi Prices : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో బ్యాడ్ న్యూస్.. ప్రముఖ మొబైల్ కంపెనీలు శాంసంగ్, షావోమీ తమ బడ్జెట్, మిడ్‌రేంజ్ స్మార్ట్ఫోన్ల ధరలను భారీగా పెంచాయి. మొత్తం 41 ఫోన్ వేరియంట్లపై రూ.1,000 నుంచి రూ.4వేల వరకు ధరలు పెరిగినట్లు రిటైల్ వర్గాలు వెల్లడించాయి. కొత్త ధరలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి.. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
గెలాక్సీ ఫోన్ల ధరలు ఎంత పెరిగాయంటే? :
శాంసంగ్ తన గెలాక్సీ ఏ, ఎఫ్ సిరీస్‌లలోని 22 వేరియంట్ల ధరలను సవరించింది. మోడల్, స్టోరేజ్ ఆధారంగా 3.13 శాతం నుంచి 9.52 శాతం వరకు పెరిగింది. గెలాక్సీ ఏ07 5జీ 4జీబీ + 128జీబీ మోడల్ ధర రూ.21వేల నుంచి రూ.23వేలకు చేరింది. 6జీబీ వేరియంట్ ధర కూడా రూ.2వేలు పెరిగి రూ.26వేలు అయింది.
గెలాక్సీ ఎఫ్17 5జీ అన్ని వేరియంట్లపై రూ.2వేలు పెరిగింది. శాంసంగ్ గెలాక్సీ A17 5జీ, A36, A56, A37 మోడళ్ల ధరలు కూడా పెరిగాయి. ఇందులో గెలాక్సీ A57పై అత్యధికంగా రూ.4వేలు పెరిగింది. దాంతో 8GB + 256GB మోడల్ ధర రూ.67వేలకు చేరింది.
Read Also : iPhone 18e Leak : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఐఫోన్ 18, ఐఫోన్ 18e వస్తున్నాయ్.. ఫీచర్లు, ధర వివరాలు లీక్..!
షావోమీ, రెడ్మి ఫోన్ల కొత్త ధరలివే :
షావోమీ, రెడ్మి పోర్ట్‌ఫోలియోలోని 19 వేరియంట్ల ధరలను పెంచింది. ఈ పెంపు 4.26 శాతం నుంచి 18.75 శాతం వరకు ఉంది. రెడ్మి A7 4GB + 64GB మోడల్ ధర రూ.13వేల నుంచి రూ.15వేలకు చేరింది. రెడ్మి A7 ప్రో ధర రూ.14వేల నుంచి రూ.16వేలు అయింది.
రెడ్మీ నోట్ 17 5జీ ప్రారంభ ధర రూ.28వేల నుంచి రూ.31వేలకు పెరిగింది. నోట్ 17 ప్రో 5జీ వేరియంట్లపై రూ.4వేల పెంపు నమోదైంది. ప్రో మ్యాక్స్ మోడళ్ల ధరలు రూ.3వేలు పెరిగాయి. ఈ ధరల పెరుగుదలకు మెమరీ చిప్స్, ఇతర స్పేర్ పార్టుల ఖర్చులు పెరగడం ప్రధాన కారణంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వివో, ఒప్పో, మోటరోలా, రియల్‌మి కూడా తమ ఫోన్ల ధరలను పెంచనున్నాయి.
