Samsung Galaxy A14 5G : శాంసంగ్ గెలాక్సీ A14 5జీ ఫోన్‌పై భారీ తగ్గింపు.. కేవలం రూ.14,499కే సొంతం చేసుకోండి!

Samsung Galaxy A14 5G Price Cut : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. శాంసంగ్ గెలాక్సీ ఎ14 5జీ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ 5జీ ఫోన్ కేవలం రూ.14,499కే కొనుగోలు చేయొచ్చు.

Samsung Galaxy A14 5G gets price cut, now listed for Rs 14,499

Samsung Galaxy A14 5G Price Cut : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ సొంత బ్రాండ్ గెలాక్సీ ఎ సిరీస్ మోడల్ ధర భారీగా తగ్గింది. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎ14 5జీ ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్ అందిస్తోంది. ఇప్పుడు అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. కానీ, శాంసంగ్ నుంచి వచ్చిన ఈ A సిరీస్ 5G ఫోన్ కన్నా శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 5జీ మెరుగైన డీల్ అని చెప్పవచ్చు.

Read Also : Samsung Phones High Risk : శాంసంగ్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్.. మీ ఫోన్ సేఫ్‌గా ఉండాలంటే వెంటనే అప్‌‌డేట్ చేసుకోండి..!

లేటెస్ట్ శాంసంగ్ ఫోన్ డీల్స్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శాంసంగ్ మిడ్-రేంజ్ 5జీ ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో రూ. 16,499కి లాంచ్ అయింది. ఇప్పుడు ధర ఏకంగా రూ.14,499కి పడిపోయింది. శాంసంగ్ గెలాక్సీ ఎ14 5జీపై అదనపు సేల్ ఆఫర్ తగ్గింపు కూడా అందిస్తోంది. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

శాంసంగ్ గెలాక్సీ ఎ14 5జీ ధర తగ్గింపు వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ ఎ14 5జీ ఫోన్ రూ. 14,499 ధర ట్యాగ్‌తో అందుబాటులో ఉంది. ఈ డివైజ్ వాస్తవానికి జనవరి 2023లో రూ. 16,499కి అందుబాటులోకి వచ్చింది. అంటే వినియోగదారులు రూ. 2వేలు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. గెలాక్సీ ఎ14 5జీపై అదనంగా రూ. 1,000 తగ్గింపు కూడా అందిస్తోంది. తద్వారా గెలాక్సీ ఎ14 సిరీస్ ధరను రూ. 13,499కి తగ్గించింది. శాంసంగ్ అధికారిక భారత వెబ్‌సైట్, అమెజాన్‌లో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్‌‌పై ఈ ఆఫర్ అందిస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఎ14 5జీపై భారీ తగ్గింపు :
శాంసంగ్ గెలాక్సీ ఎ14 5జీ ధర భారత మార్కెట్లో భారీ తగ్గింపును పొందింది. అయితే, గెలాక్సీ ఎమ్14 5జీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. అద్భుతమైన స్పెషిఫికేషన్లతో అతి తక్కువ ధరకు విక్రయిస్తోంది. అంతేకాకుండా.. ఎమ్ సిరీస్ ఫోన్‌లోని కెమెరా ధర పరిధిలో ఎ సిరీస్ కన్నా మెరుగ్గా ఉంటుంది.

Samsung Galaxy A14 5G price cut 

రెండు ఫోన్‌లలో పర్పార్మెన్స్ ఎక్కువ లేదా తక్కువ ఒకేలా ఉంటుంది. ఎమ్14, ఎ14 5జీ కన్నా మెరుగైన డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. మీరు గెలాక్సీ ఎమ్14లో అదే శక్తివంతమైన 6.6-అంగుళాల డిస్‌ప్లేను పొందవచ్చు. కానీ, హై రిజల్యూషన్‌తో ఎఫ్‌హెచ్‌డీ ప్లస్, ఎ14లో కనిపించే హెచ్‌డీ ప్లస్ సపోర్టుగా ఎమ్ సిరీస్ మోడల్‌లో భారీ 6,000ఎంఎహెచ్ బ్యాటరీ కూడా ఉంది.

గెలాక్సీ ఎ14 మోడల్ 5,000ఎంఎహెచ్ యూనిట్ కన్నా పెద్దది. అయితే, మీరు ఫోన్‌తో పాటు ఛార్జర్‌ను పొందలేరు. బ్యాటరీని టాప్ అప్ చేసేందుకు పాత ఛార్జర్‌లను ప్రయత్నించవచ్చు. అదనంగా, ఫోన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్23 మాదిరిగానే కనిపిస్తుంది. మీరు బడ్జెట్ ధరలో అధునాతన డిజైన్‌ను పొందవచ్చు. శాంసంగ్ భారత వెబ్‌సైట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 5జీ మోడల్ లాంచ్ ధర రూ. 14,490 ఉండగా రూ. 12,490 తగ్గింపు ధరతో అందిస్తోంది. శాంసంగ్ దీనిపై కూడా రూ. 2వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.

Read Also : Samsung Galaxy S24 Ultra Leak : టైటానియం ఫ్రేమ్, గొరిల్లా గ్లాస్ అప్‌గ్రేడ్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?