Samsung Galaxy A74 : ఈ ఏడాదిలో శాంసంగ్ గెలాక్సీ A74 ఫోన్ రానట్టేనా? అసలు సమస్య ఏంటంటే?

Samsung Galaxy A74 : శాంసంగ్ యూజర్లకు నిజంగా ఇది బ్యాడ్ న్యూస్.. గెలాక్సీ A సిరీస్ ఫోన్లలో గెలాక్సీ A74 మోడల్ ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అసలు కారణం ఇదేనని నివేదికలు సూచిస్తున్నాయి.

Samsung Galaxy A74 may not launch this year

Samsung Galaxy A74 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో Galaxy S23 సిరీస్ ఎంట్రీతో సక్సెస్ అందుకుంది. అదే కాలంలో గత గెలాక్సీ S22 సిరీస్ కన్నా S23 లైనప్ ప్రపంచవ్యాప్తంగా భారీ అమ్మకాలను నమోదు చేసిందని శాంసంగ్ ఇటీవలే ప్రకటించింది. శాంసంగ్‌కు కీలక మార్కెట్‌ అయిన భారత్‌.. ఈ ఏడాది 1.4 రెట్లు అధిక విక్రయాలను మాత్రమే నమోదు చేసింది.

ఆసక్తికరంగా, శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్‌, మిడ్-రేంజ్ Galaxy A54, Galaxy A74 ఫోన్ ఈ రెండూ మార్కెట్లోకి రానుంది. ప్రపంచ మార్కెట్లో 2023 శాంసంగ్ గెలాక్సీ లైనప్‌లో A34, A54, A74, S23 FE, S23, S23+, S23 Ultra, నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్స్ అందించనుంది. కొన్ని F సిరీస్ ఫోన్‌లు కూడా రానున్నాయని చెప్పవచ్చు.

ఈ ఏడాదిలో శాంసంగ్ Galaxy A74, S23 FEలను ఒకే ఫోన్‌ మాదిరిగా రానున్నాయని లీక్ నివేదికలు సూచిస్తున్నాయి. శాంసంగ్ Galaxy A54 ఇప్పటికే రూ. 40వేల ధరను దాటేసింది. గత ఏడాది వరకు Galaxy A73, A74, S23 FE అనే రెండు ఫోన్‌లను A54, S23తో రానుందని నివేదికలు తెలిపాయి.

Read Also : Twitter Bird Logo : బుల్లిపిట్ట తిరిగొచ్చింది.. ట్విట్టర్‌‌ ‘డాగీ కాయిన్’ లోగో మార్చేశాడు.. మస్క్ మామూలోడు కాదుగా..!

అందుకే, శాంసంగ్ గెలాక్సీ A74ని ఈ ఏడాది రద్దు చేసే అవకాశం ఉంది. అయితే, అసలు సమస్య ఏమిటంటే.. సౌత్ కొరియన్ ఫోన్ తయారీదారు FE లేదా ఫ్యాన్ ఎడిషన్ లైనప్‌ను సస్పెండ్ చేసినట్లు గతంలో నివేదికలు సూచించాయి. దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు.

Samsung Galaxy A74 may not launch this year

ఈ ఏడాదిలో Galaxy S22 FEని అందించలేదు. గతంలో, శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ మోడల్‌లను ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసింది. రాబోయే S23 FE కూడా ఉండకపోవచ్చు. శాంసంగ్ Galaxy A54, S23 మధ్య భారీ తేడాలు ఉండవచ్చు. FE మోడల్‌లు పాపులర్ అయ్యాయి. ఎందుకంటే, ఫ్లాగ్‌షిప్ సిరీస్ నుంచి చాలా ఫీచర్‌లను అందించాయి. ధర కూడా అదే స్థాయిలో ఉండనున్నాయి.

A లైనప్ విషయంలో ఇప్పటివరకు రెండు ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. శాంసంగ్ Galaxy A74 లేదా S23 FE కావచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఈ ఏడాది ఆగస్ట్‌లో కొత్త ఫోన్లు మార్కెట్లోకి రావాల్సి ఉంది. శాంసంగ్ నెక్స్ట్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను Galaxy Z Fold 5, Galaxy Z Flip 5తో పాటు నెక్స్ట్ ఫోన్‌ను అందించే అవకాశం లేదు.

S23 FE నుంచి ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? :
గెలాక్సీ S23 టోన్డ్-డౌన్ వెర్షన్.. దాదాపు ఫ్లాగ్‌షిప్ చిప్ సాయంతో అధిక రిఫ్రెష్ రేట్ FHD+ AMOLED ప్యానెల్‌తో రావొచ్చు. శాంసంగ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో రావొచ్చునని లీక్‌లు సూచిస్తున్నాయి. ఈ ఫోన్‌ కొంచెం సరసమైనదిగా చెప్పవచ్చు. గత ఏడాదిలో స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCని ఆప్షన్‌తో మార్కెట్లోకి వచ్చింది. OISతో అధిక-రిజల్యూషన్ ప్రధాన కెమెరా రెండు ఇతర సెన్సార్‌ల ద్వారా సపోర్టు ఇస్తుంది. IP రేటింగ్, ప్రామాణిక 25W ఛార్జింగ్ సపోర్టు అందించనుంది. కానీ, బాక్స్ లోపల ఎలాంటి ఛార్జర్ ఉండకపోవచ్చు.

Read Also : OnePlus Nord CE 3 Lite Price : అదిరే ఫీచర్లతో వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!