Samsung Galaxy F17 : AI ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F17 ఆగయా.. ధర కూడా చాలా తక్కువే.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..

Samsung Galaxy F17 : శాంసంగ్ గెలాక్సీ F17 ఏఐ ఫీచర్లతో వచ్చేసింది. ధర కూడా మీ బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

Samsung Galaxy F17

Samsung Galaxy F17 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో సౌత్ కొరియన్ దిగ్గజం కొత్త స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ F17 లాంచ్ చేసింది. ఈ శాంసంగ్ ఫోన్ కంపెనీ F సిరీస్‌లో లేటెస్ట్ మోడల్. ఈ ఏడాది మార్చిలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ F16 తర్వాత రిలీజ్ అయింది.

ఈ స్మార్ట్‌ఫోన్ స్లిమ్ డిజైన్, అనేక ఏఐ ఫీచర్లు (Samsung Galaxy F17) కలిగి ఉంది. OISతో కూడిన 50MP కెమెరాతో, అల్ట్రా-వైడ్, మాక్రో లెన్స్‌తో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ F17 ఫోన్ 6 జనరేషన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్ కూడా అందిస్తుంది.

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ F17 ధర, లభ్యత :
శాంసంగ్ గెలాక్సీ F17 ఫోన్ వైలెట్ పాప్, నియో బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 4GB + 128GB, 6GB + 128GB, 8GB + 128GB అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
బేస్ వేరియంట్ ధర రూ. 13,999, మిడ్-టైర్ వేరియంట్ ధర రూ. 15,499, టాప్-టైర్ వేరియంట్ ధర రూ. 16,999కు పొందవచ్చు.

4GB + 128GB : రూ.13,999
6GB + 128GB : రూ.15,499
8GB + 128GB : రూ.16,999

శాంసంగ్ గెలాక్సీ F17 5G ఫోన్ ఈరోజు నుంచి రిటైల్ స్టోర్లు, Samsung.com, Flipkart వెబ్ సైట్లలో అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు HDFC బ్యాంక్, UPI లావాదేవీలపై రూ. 500 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ కూడా పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ F17 స్పెసిఫికేషన్లు :
డిస్ ప్లే : 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే
ప్రాసెసర్ : 5nm-ఆధారిత ఎక్సినోస్ 1330 ప్రాసెసర్

Read Also : Apple iPhone 17 : కొత్త ఆపిల్ ఐఫోన్ 17 కావాలా? బ్లింకిట్‌లో జస్ట్ ఆర్డర్ చేస్తే చాలు.. కేవలం 10 నిమిషాల్లోనే మీ ఇంటికి డెలివరీ..!

కెమెరా ఫీచర్లు :
బ్యాక్ సైడ్ : 50MP+ 5MP+ 2MP
ఫ్రంట్ సైడ్ : 13MP
బ్యాటరీ : 25W ఛార్జింగ్‌తో 5,000mAh
డిజైన్ : IP54 రేటింగ్

శాంసంగ్ గెలాక్సీ F17 ఫోన్ 7.5mm స్లిమ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఈ శాంసంగ్ ఫోన్ IP54 రేటింగ్‌ కూడా కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 5nm-ఆధారిత ఎక్సినోస్ 1330 ప్రాసెసర్‌తో వస్తుంది. 8GB వరకు ర్యామ్, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ F17 5G ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. గెలాక్సీ F17 5Gలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. గెలాక్సీ F17 5G “సర్కిల్ టు సెర్చ్ విత్ గూగుల్” తో వస్తుంది. అదనంగా, “జెమిని లైవ్” తో కొత్త ఏఐ ఎక్స్ పీరియన్స్ కూడా అందిస్తుంది.