Apple iPhone 17 : కొత్త ఆపిల్ ఐఫోన్ 17 కావాలా? బ్లింకిట్‌లో జస్ట్ ఆర్డర్ చేస్తే చాలు.. కేవలం 10 నిమిషాల్లోనే మీ ఇంటికి డెలివరీ..!

Apple iPhone 17 : సెప్టెంబర్ 19 నుంచి బ్లింకిట్ నుంచి నేరుగా ఐఫోన్ 17 ఆర్డర్ చేసి ఇన్‌స్టంట్ డెలివరీ పొందవచ్చునని బ్లింకిట్ ప్రకటించింది.

Apple iPhone 17 : కొత్త ఆపిల్ ఐఫోన్ 17 కావాలా? బ్లింకిట్‌లో జస్ట్ ఆర్డర్ చేస్తే చాలు.. కేవలం 10 నిమిషాల్లోనే మీ ఇంటికి డెలివరీ..!

Apple iPhone 17

Updated On : September 11, 2025 / 7:26 PM IST

Apple iPhone 17 : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. కొత్త ఐఫోన్ 17 మోడల్ కేవలం 10 నిమిషాల్లోనే మీ ఇంటికి డెలివరీ కానుంది. జోమాటో సబ్-బ్రాండ్ బ్లింకిట్ ఎక్స్ వేదికగా ఇదే విషయాన్ని వెల్లడించింది.

ఆపిల్ ఇటీవలే భారత్, ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 17 సిరీస్‌ (Apple iPhone 17)ను లాంచ్ చేయగా, సెప్టెంబర్ 19 నుంచి అమ్మకాలు ప్రారంభించనుంది. అయితే, ఆసక్తిగల కస్టమర్లు అదే రోజు నుంచి బ్లింకిట్ యాప్ నుంచి నేరుగా ఐఫోన్ 17ను ఆర్డర్ చేయొచ్చునని కంపెనీ ధృవీకరించింది. క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ ప్రకారం.. ఐఫోన్ 17 కేవలం 10 నిమిషాల్లో మీ ఇంటి వద్దకే డెలివరీ చేయనుంది.

క్షణాల్లో ఐఫోన్ 17 డెలివరీ :
సెప్టెంబర్ 19 నుంచి కస్టమర్లు బ్లింకిట్ యాప్ నుంచి నేరుగా ఐఫోన్ 17ను ఆర్డర్ చేసి ఇన్ స్టంట్ డెలివరీ పొందవచ్చని బ్లింకిట్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. కిరాణా సామాగ్రి, నిత్యావసరాలకు మించి ప్రీమియం గాడ్జెట్‌లను అంతే వేగంతో డెలివరీ చేయనుంది. ప్రీమియం లాంచ్‌ ఫోన్ల కోసం బ్లింకిట్ భాగస్వామ్యం ఇదే మొదటిసారి కాదు. కంపెనీ గతంలో గాడ్జెట్‌లు, గేమింగ్ కన్సోల్‌లు, పండుగకు సంబంధిత వస్తువులను కూడా నిమిషాల్లో డెలివరీ చేసింది.

Read Also : RBI Lock Phones : EMIల్లో ఫోన్లు కొనేవాళ్లు అందరికీ బిగ్ అలర్ట్.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..!

ఆపిల్ మొత్తం 4 కొత్త ఐఫోన్ 17 మోడళ్లను ఆవిష్కరించింది. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ గ్లోబల్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కొత్త లైనప్ డిజైన్, పర్ఫార్మెన్స్, కెమెరా అప్‌గ్రేడ్‌లతో వస్తున్నాయి. ఇందులో ఐఫోన్ ఎయిర్ కేవలం 5.6 మిమీతో ఆపిల్ అత్యంత సన్నని ఫోన్‌గా నిలిచింది.

స్టాండర్డ్ ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ. 79,900గా ఉంటుంది. అత్యంత సన్నగా చాలా తేలికైన ఐఫోన్ ఎయిర్ రూ.1,19,900 నుంచి ప్రారంభమవుతుంది. ప్రీమియం మోడళ్లను చూస్తున్న వారికి ఐఫోన్ 17 ప్రో ధర రూ.1,34,900, టాప్-ఎండ్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ రూ.1,49,900 నుంచి లభ్యమవుతుంది.

ఇదేలా వర్క్ చేస్తుందంటే? :
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ ముందుగా ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులో ఉంటుంది. అతి త్వరలో మరిన్ని నగరాలకు విస్తరించనుంది. కస్టమర్లు బ్లింకిట్ యాప్‌లో మోడల్, కలర్, స్టోరేజీ, వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. ఒకసారి వెరిఫై తర్వాత బ్లింకిట్ 10 నిమిషాల్లో ఐఫోన్ 17 మోడల్ నేరుగా మీ ఇంటికే డెలివరీ చేస్తుంది.