Samsung: అదిరిపోయే ఫీచర్లతో ఎం సిరీస్‌లో మరో రెండు స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తున్న శాంసంగ్

వీటి ఫీచర్ల గురించి విశ్లేషకులు వివరించి చెబుతున్నారు.

భారత్‌లో శాంసంగ్ తన గెలాక్సీ ఎం సిరీస్‌లో మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. శాంసంగ్ గెలాక్సీ M16 5G, శాంసంగ్ గెలాక్సీ M06 5G త్వరలోనే లాంచ్‌ కానున్నాయి.

ఈ కొత్త మోడళ్లు గత శాంసంగ్ గెలాక్సీ M15 5G, శాంసంగ్ గెలాక్సీ M05కు అప్‌డేటెడ్‌ మోడళ్లుగా వస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ M16 5G, శాంసంగ్ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్లు భారత్‌ బిస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించాయి. అమెజాన్‌లో కనపడుతున్న వివరాల ప్రకారం.. వీటి ఫీచర్ల గురించి విశ్లేషకులు వివరించి చెబుతున్నారు.

శాంసంగ్ గెలాక్సీ M06 5G మోడల్ నంబర్ SM-M166P/DS. దీన్ని ఇప్పటికే శాంసంగ్ ఇండియా పేజీలో లిస్ట్ చేశారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ మెరిటెక్ 6300 SOC, 8GB RAM ఫీచర్లుగా ఉన్నాయి.

Also Read: భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు.. మరి పడిడి ధరల సంగతేంటి?

వన్ యూఐ6తో ఆండ్రాయిడ్ 14తో ఇది రానుంది. ఇది గత అక్టోబర్‌లో లాంచ్‌ అయిన శాంసంగ్ గెలాక్సీ A16 స్పెసిఫికేషన్లను పోలి ఉంది. అలాగే, శాంసంగ్ గెలాక్సీ M16 5G డిజైన్‌ కూడా M06 మోడల్‌లాగే ఉంది.

అయితే, శాంసంగ్ గెలాక్సీ M16 5Gలో కెమెరా అరేంజ్‌మెంట్‌ మాత్రం విభిన్నంగా ఉంది. M16 కూడా మీడియాటెక్ మెరిటెక్ 6300 SOCతో 6GB వరకు ర్యామ్‌తో విడుదల కానుంది.

యూఐ 7 ఆండ్రాయిడ్ 15తో ఇది ఆపరేట్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ M16 5G, శాంసంగ్ గెలాక్సీ M06 5G రెండు ఫోన్‌లకు నాలుగు సంవత్సరాలపాటు ఓఎస్‌ అప్‌గ్రేడ్‌లను, సెక్యూరిటీ అప్‌డేట్లు కూడా వస్తుంటాయి.

శాంసంగ్ ఈ కొత్త ఫోన్‌లను అమెజాన్.ఇన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో రిటైల్ అవుట్‌లెట్‌లతోనూ లభ్యం కానుంది.