×
Ad

Samsung Galaxy S24 5G : వావ్.. ఈ శాంసంగ్ గెలాక్సీ S24 5Gపై అమెజాన్ స్పెషల్ ఆఫర్.. ధర, డిస్కౌంట్ వివరాలివే..!

Samsung Galaxy S24 5G : ఈ శాంసంగ్ 5జీ ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఇలా కొన్నారంటే సగానికి సగం ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

Samsung Galaxy S24 5G (Image Credit To Original Source)

  • శాంసంగ్ గెలాక్సీ S24 5జీపై భారీ తగ్గింపు ఆఫర్
  • అమెజాన్‌లో 47 శాతం తగ్గింపుతో రూ. 39,999 లిస్టింగ్
  •  ఈ శాంసంగ్ 5జీ ఫోన్ అసలు ధర రూ. 74,999 

Samsung Galaxy S24 5G : శాంసంగ్ కొత్త ఫోన్ కావాలా? అయితే, ఇదే అద్భుతమైన అవకాశం. తక్కువ ధరలో శాంసంగ్ గెలాక్సీ S24 5జీ ఫోన్ కొనేసుకోవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఫోన్‌ను అతి తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. అంతేకాదు బ్యాంకు ఆఫర్లతో కొనుగోలు చేస్తే ఈ శాంసంగ్ 5జీ ఫోన్ సగం ధరకే సొంతం చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S24 5జీ ఫోన్ 6.2-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేటు కూడా అందిస్తుంది. ఎక్సినోస్ 2400 చిప్‌సెట్ కూడా ఉంది. 4000mAh బ్యాటరీతో 25W వైర్డ్ ఛార్జింగ్‌ సపోర్టు ఇస్తుంది. అమెజాన్ ఈ శాంసంగ్ 5జీ ఫోన్‌ ఎంత డిస్కౌంట్ అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ S24 5జీపై అమెజాన్ డిస్కౌంట్ :
అమెజాన్‌లో తగ్గింపు ధరకు శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ కొనేందుకు అద్భుతమైన అవకాశం. ఈ శాంసంగ్ ఫోన్ ఇ-కామర్స్ సైట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. అసలు ధర రూ. 74,999కు పొందవచ్చు. కానీ, కంపెనీ నేరుగా 47శాతం తగ్గింపు తర్వాత రూ. 39,999కి లిస్ట్ అయింది. తద్వారా ఈ శాంసంగ్ ఫోన్ నేరుగా రూ. 35వేలకు పైగా తగ్గింపుతో లభిస్తోంది.

Samsung Galaxy S24 5G (Image Credit To Original Source)

అయితే, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదనంగా రూ. 2వేలు సేవ్ చేసుకోవచ్చు. దాంతో మొత్తం ఫోన్ ధర రూ. రూ. 37,999 తగ్గింపు పొందవచ్చు. అంటే ఈ శాంసంగ్ ఫోన్‌ కొనుగోలుపై దాదాపు 50శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : Best Vivo Phones : అద్భుతమైన ఫోన్లు భయ్యా.. రూ. 20వేల లోపు ధరలో 5 ఖతర్నాక్ వివో ఫోన్లు.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ 6.2-అంగుళాల ఫుల్ HD+ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. శాంసంగ్ ఎక్సినోస్ 2400 చిప్‌సెట్ ఈ ఫోన్‌కు పవర్ అందిస్తుంది. 4000mAh బ్యాటరీ, 25W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. అదనంగా, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 కూడా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌లో 50MP వైడ్-యాంగిల్ కెమెరా, 12MP అల్ట్రావైడ్-యాంగిల్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. సేఫ్టీ కోసం ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.