×
Ad

Samsung Galaxy S24 FE : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. ఈ శాంసంగ్ గెలాక్సీ S24 FE ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!

Samsung Galaxy S24 FE : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy S24 FE

  • అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు
  • 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే, ఎక్సినోస్ 2400e ప్రాసెసర్
  • క్రెడిట్ కార్డ్ యూజర్లకు శాంసంగ్ ఫోన్‌పై రూ.1,046 వరకు క్యాష్‌బ్యాక్

Samsung Galaxy S24 FE : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ ఫోన్ 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే, ఎక్సినోస్ 2400e ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ తో వస్తుంది.

మిడ్ రేంజ్ ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ రూ. 50వేల కన్నా ఎక్కువ ధరకు లభిస్తోంది. కెమెరా, హై ప్రాసెసింగ్ స్పీడ్, జీరో లాగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ భారీ తగ్గింపుతో లభ్యమవుతుంది. స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లపై ఓసారి పరిశీలిద్దాం..

శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ధర తగ్గింపు :
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ 8GB ర్యామ్ వేరియంట్ అందిస్తుంది. ఈ ఫోన్ రూ.34,899కి అందుబాటులో ఉంది. అసలు ధర రూ.59,999కు లభిస్తోంది. ఇంకా, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఫోన్‌పై రూ.1,046 వరకు అమెజాన్ పే బ్యాలెన్స్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Read Also : Anant Ambani Luxury Watches : అయ్య బాబోయ్.. అనంత్ అంబానీ లగ్జరీ వాచ్ కలెక్షన్ ఫొటోలు చూశారా? ఒక్కో వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే..!

శాంసంగ్ గెలాక్సీ S24 FE స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ఫోన్ 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే, 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. శాంసంగ్ 7 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇప్పటి నుంచి కనీసం 4 ఏళ్ల వరకు ఉంటుంది. అంతే కాకుండా, స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ 2400e ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఎక్స్‌క్లిప్స్ 940 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S24 FEలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో సెన్సార్‌, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీడియో కాల్స్‌, సెల్ఫీలు కోసం 10MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 4700mAh బ్యాటరీతో పాటు 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ అందిస్తుంది.