Anant Ambani Luxury Watches : అయ్య బాబోయ్.. అనంత్ అంబానీ లగ్జరీ వాచ్ కలెక్షన్ ఫొటోలు చూశారా? ఒక్కో వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే..!
Anant Ambani Luxury Watches : అనంత్ అంబానీ వాచ్ కలెక్షన్ అత్యంత అరుదైనవి.. ఆయనకు లగ్జరీ వాచ్‌ల పట్ల ఎంత ఇష్టమో ఈ కలెక్షన్ చూస్తే అర్థమవుతుంది.. కొన్ని కోట్ల విలువైన ఈ వాచ్ బ్రాండ్లలో 5 లగ్జరీ వాచ్ కలెక్షన్ గురించి ఓసారి లుక్కేయండి.. All Photos (Image Credit To Original Source)

లగ్జరీ వాచ్.. ఇప్పుడు ఇదే ట్రెండ్.. సెలబ్రిటీల దగ్గర నుంచి బిలియనర్ల వరకు అందరూ లగ్గరీ వాచ్ లతోనే కనిపిస్తున్నారు. చేతి వాచ్ అనేది స్టేటస్ సింబల్ అయిపోయింది. అందులోనూ బడా బిలియనీర్ ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ లగ్జరీ వాచ్ కలెక్షన్ చేస్తే మతిపోవాల్సిందే.. అనంత్ అంబానీకి లగ్జరీ వాచ్ లంటే తెగ ఇష్టమట.. ఆయన దగ్గర అత్యంత అరుదైన కాస్ట్ లీ వాచ్ ల కలెక్షన్ ఉంది.. ఒక్కో వాచ్ ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. వజ్రాలతో పొదిగిన ఖరీదైన రంగుల రాళ్లతో పొదిగిన వాచ్ లువి.. ఇలాంటి లగ్జరీ వాచ్ లు ఎక్కడా కనిపించవు.. లగ్జరీ వాచ్ ధరలు కొన్ని వేల (రూ. 1.8 కోట్ల నుంచి రూ.13.7 కోట్ల వరకు రేంజ్) కోట్లు ఉంటాయి.. ప్రస్తుతం అనంత అంబానీ దగ్గర ఎన్ని కోట్ల విలువైన లగ్జరీ వాచ్ లు ఉన్నాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం..

1. ఆడెమర్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ ఆఫ్‌షోర్ సెల్ఫ్‌వైండింగ్ క్రోనోగ్రాఫ్ : ఈ వాచ్ చూసేందుకు వైట్ కలర్ వజ్రాలతో పొదిగి ఉంది. డిజైన్ మాత్రం చాలా ట్రెండీగా క్లాసీ లుక్ కనిపిస్తుంది. లగ్జరీ వాచ్ విషయంలో అంబానీకి ఉన్న మక్కువ అంతాఇంతా కాదు.. ధర సుమారు 250,000 డాలర్ల నుంచి 300,000 డాలర్ల వరకు (రూ. 2.29 కోట్ల నుంచి రూ. 2.74 కోట్లు) ఉంటుంది.

2. పాటెక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ 5990/1422G రూబీ వాచ్ : ఈ లగ్జరీ వాచ్ అత్యంత అరుదైనది.. చూసేందుకు మెరూన్ బ్రైట్ కలర్ నాటిలస్ రాూబీ రత్నాలతో పొదిగి ఉంటుంది. డ్యూయల్ టైమ్ ఫీచర్ స్పెషల్ అట్రాక్షన్. ఈ కాస్ట్ లీ వాచ్ ధర సుమారు 800,000 డాలర్ల నుంచి 1 మిలియన్ డాలర్లు (రూ.7.33 కోట్ల నుంచి రూ. 9.17 కోట్లు) ఉంటుంది.

3. పాటెక్ ఫిలిప్ నాటిలస్ 5990 / 1422G వాచ్ : నాటిలస్ లగ్జరీ వాచ్ కూడా చాలా రేర్ పీస్.. ఐకానిక్ డిజైన్ సూపర్.. అడ్వాన్ టెక్నాలజీతో డిజైన్ చేశారు. క్లాసిక్ పాటెక్ ఫిలిప్ స్కిల్స్ ఫీచర్లతో వస్తుంది. అనంత్ అంబానీ వాచ్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన వాచ్ ఇది.. ఈ లగ్జరీ వాచ్ ధర 700,000 డాలర్ల నుంచి 800,000 డాలర్ల మధ్య (రూ. 6. 41 కోట్ల నుంచి రూ. 7.33 కోట్ల వరకు) ఉంటుంది.

4. రిచర్డ్ మిల్లె RM 52-05 టూర్‌బిల్లాన్ ఫారెల్ విలియమ్స్ : లగ్జరీ బ్రాండ్ మోడల్ వాచ్ అత్యంత అరుదైన వాచ్.. చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్ట్ బేసిడ్ టైమ్ పీస్ అనమాట.. వాచ్ మధ్యభాగంలో పుర్రె ఆకారంలో క్రాస్ బోన్ ఉంటుంది. ఖరీదైన మెటల్ తో తయారైంది. గ్లోబ్, గెలాక్సీ వంటి డిజైన్ కూడా ఉంది. అద్భుతమైన టూర్ బిల్లాన్ మూవెంట్ అందిస్తుంది. ఈ లగ్జరీ వాచ్ ఖరీదు సుమారుగా 950,000 డాలర్ల నుంచి 1.1 మిలియన్ డాలర్ల మధ్య (రూ.8.70 కోట్ల నుంచి రూ.10.08 కోట్లు) ఉంటుంది.

5 . పటేక్ ఫిలిప్ ఆక్వానాట్ లూస్ రెయిన్బో మినిట్ రిపీటర్ : ఈ లగ్జరీ వాచ్ కూడా మరో అద్భుతం. చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందించారు. ఇందులో చిన్నపాటి రిపీటర్ కాంప్లికేషన్ ఉంది. కలర్ ఫుల్ రెయిన్ బో మాదిరి రత్నాలతో మెరిసిపోతుంటుంది. అనంత్ అంబానీ లగ్జరీ వాచ్ కలెక్షన్లలో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ వాచ్ ఖరీదు దాదాపు 1.5 మిలియన్ డాలర్లు (రూ.13.8 కోట్లు) ఉంటుంది.
