Samsung Galaxy S25 Ultra : సూపర్ డిస్కౌంట్ బ్రో.. ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ లాంచ్ అయిన వెంటనే పాత మోడల్ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఇలాంటి డీల్ మళ్లీ రాదు. కొంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.

1/8
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ లవర్స్ పండగ చేస్కోండి. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా భారీ తగ్గింపుతో లభిస్తోంది.
2/8
ఈ అద్భుతమైన డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. శాంసంగ్ కొత్త S26 అల్ట్రా ఫోన్ మార్కెట్లో రిలీజ్ కాగానే ఈ పాత మోడల్ అల్ట్రా ఫోన్ ధర ఒక్కసారిగా తగ్గింది.
3/8
కంపెనీ సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు ఎక్కువ సంవత్సరాలు ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ అదిరిపోయే ఆఫర్ ఎలా పొందాలి? శాంసంగ్ అల్ట్రా ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.
4/8
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ధర తగ్గింపు : ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర రూ. 1,29,999 ఉండగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,08,948 తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు.
5/8
ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై అదనంగా రూ. 5,000 డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ. 1,03,948కి తగ్గుతుంది. టైటానియం సిల్వర్‌బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
6/8
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌, అడ్రెనో 830 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.9-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లే కూడా ఉంది.
7/8
కెమెరాల విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 200MP ప్రైమరీ మల్టీ-డైరెక్షనల్ సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి.
8/8
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ స్నాపర్ ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5000mAh బ్యాటరీ సపోర్టు ఇస్తుంది.