Samsung Galaxy S26 Ultra
Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. అతి త్వరలో శాంసంగ్ నుంచి నెక్స్ట్ జనరేషన్ గెలాక్సీ S-సిరీస్ వచ్చేస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ లాంచ్ కానుంది.
కొత్త నివేదిక ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. లీక్ డేటాను పరిశీలిస్తే.. డిజైన్, పర్ఫార్మెన్స్, కెమెరా ఫీచర్ల పరంగా అనేక అప్‌గ్రేడ్‌లతో రానుంది. టెలిఫోటో కెమెరా అత్యంత ఆకర్షణగా ఉంటుంది.
గెలాక్సీ క్లబ్ నివేదిక ప్రకారం.. రాబోయే శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా మోడల్ ప్రస్తుత గెలాక్సీ S25 అల్ట్రా మాదిరిగానే అదే టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ లెన్స్‌తో రావచ్చు. అదనంగా, శాంసంగ్ సెకండరీ టెలిఫోటో కెమెరాతో 200MP సెన్సార్‌ను ప్రవేశపెట్టవచ్చని పుకార్లు సూచిస్తున్నాయి. ఇంకా, ఈ శాంసంగ్ ఫోన్ వేరియబుల్ ఎపర్చర్‌తో 200MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉండొచ్చు.
గెలాక్సీ S26 అల్ట్రా లాంచ్ టైమ్‌లైన్ :
శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ జనవరి 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతానికి కంపెనీ లాంచ్ తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
రాబోయే శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ పెద్ద 6.9-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ ఓవర్‌లాక్డ్ “ఫర్ గెలాక్సీ” వెర్షన్ కోసం క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 ప్రాసెసర్‌తో ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 3 స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. 256GB, 512GB, 1TB, 16GB ర్యామ్ కలిగి ఉండొచ్చు.
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అయితే, ఈ గెలాక్సీ S26 సిరీస్ పూర్తి ఫీచర్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. లీక్ ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా సన్నని బాడీతో రానుంది. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ప్లస్-సైజ్ మోడల్‌ను ఎడ్జ్ మోడల్‌తో రిప్లేస్ చేసే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా కంపెనీ ధృవీకరించలేదు.