Samsung Galaxy Watch Series : శాంసంగ్ గెలాక్సీ కొత్త సిరీస్ వాచ్‌లివే.. బీపీ, ఈసీజీ ఎంత ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు!

Samsung Galaxy Watch Series : హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ వాచ్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్లో గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ వాచ్ 5, గెలాక్సీ వాచ్ 4 సిరీస్‌లో బ్లడ్ ప్రెజర్, ఈసీజీ ఫీచర్లను అందిస్తున్నాయి.

Samsung Galaxy Watch 6, Watch 5, Watch 4 Series Get Blood Pressure Monitoring and ECG in India

Samsung Galaxy Watch Series : కొత్త స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ నుంచి అద్భుతమైన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో మూడు స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 సిరీస్‌ని గత ఏడాదిలో కంపెనీ గెలాక్సీ అన్ ప్యాకడ్ ఈవెంట్‌లో కంపెనీ లాంచ్ చేసింది. ఇప్పుడు, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ బ్రాండ్ భారత మార్కెట్లో లేటెస్ట్ వేరబుల్ డివైజ్‌ల కోసం ఈసీజీ (ఎలక్ట్రో కార్డియోగ్రఫీ), BP (రక్తపోటు) మానిటరింగ్ సామర్థ్యాలను ప్రవేశపెట్టింది.

శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 లైనప్‌లోని శాంసంగ్ హెల్త్ మానిటర్ యాప్ ద్వారా కొత్త హెల్త్ ట్రాకింగ్ ఫీచర్‌లను యాక్సెస్ చేయవచ్చు. వినియోగదారులు తమ ఇళ్లలోనే ఈసీజీ పరీక్షలను చేసుకోవచ్చు. సాధారణ హెల్త్ చెకింగ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. బీపీ, ఈసీజీ ట్రాకింగ్ ఫీచర్లు గెలాక్సీ వాచ్ 4, గెలాక్సీ వాచ్ 5 సిరీస్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ గెలాక్సీ వాచ్ సిరీస్ ధర రూ. 21,999 నుంచి కొనుగోలు చేయొచ్చు.

Read Also : Samsung Galaxy S24 Series : భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ధర తెలిసిందోచ్.. ప్రీ-ఆర్డర్ల కోసం ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!

శాంసంగ్ హెల్త్ మానిటర్ యాప్ :
భారత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి రెగ్యులేటరీ క్లియరెన్స్, సర్టిఫికేషన్‌లు పొందిన తర్వాత శాంసంగ్ భారత్‌లో గెలాక్సీ వాచ్ 6 సిరీస్‌లో రక్తపోటు మానిటరింగ్, ఈసీజీ ఫీచర్లను యాక్టివేట్ చేస్తోంది. అధికారిక ప్రకటన ప్రకారం.. వేరబుల్ డివైజ్‌ల్లో బండిల్ చేసిన శాంసంగ్ హెల్త్ మానిటర్ యాప్ ద్వారా హెల్త్ ట్రాకింగ్ ఫీచర్‌లను యాక్సెస్ చేయవచ్చు. అంతేకాదు.. అప్‌డేట్‌లు OTA (ఓవర్-ది-ఎయిర్) రోల్‌అవుట్ ద్వారా డివైజ్‌లు చేరుకుంటాయి. ఈ రెండు ఫీచర్లు గెలాక్సీ వాచ్ 4, గెలాక్సీ వాచ్ 5 డివైజ్‌ల్లో అందుబాటులోకి వస్తాయి.

ఈసీజీ డేటాను రికార్డు చేయొచ్చు :
వినియోగదారులు గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ వాచ్ 5, గెలాక్సీ వాచ్ 4 మోడళ్లను వారి మణికట్టుపై ధరించాలి. ఈసీజీ ట్రాకింగ్ ఫీచర్ ద్వారా వారి గుండె చప్పుడు, లయను కొలవవచ్చు. చర్మంపై ఉంచిన సెన్సార్‌లు గుండె కొట్టిన ప్రతిసారీ ఉత్పత్తి చేసే విద్యుత్ సంకేతాలను గుర్తిస్తాయి. డేటా గ్రాఫ్‌లో రికార్డ్ అవుతుంది. శాంసంగ్ హెల్త్ మానిటర్ ఈసీజీ యాప్‌తో, వినియోగదారులు ఆరోగ్య నిపుణులతో ఈసీజీ డేటాను క్రియేట్ చేయవచ్చు లేదా రికార్డ్ చేయవచ్చు. ఆపై రిపోర్టును సేవ్ చేయవచ్చు. ఈజీగా షేర్ చేయవచ్చు.

Samsung Galaxy Watch 6, Watch 5, Watch 4 Series  

గెలాక్సీ వాచ్‌తో రక్తపోటు, ఈసీజీని ఎలా కొలవాలి? :
మీ గెలాక్సీ వాచ్, గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లో శాంసంగ్ హెల్త్ మానిటర్ యాప్‌ను సెటప్ చేసిన తర్వాత మీకు కావలసినప్పుడు ఎక్కడైనా ఈసీజీ తీసుకోవచ్చు. మీరు యాప్‌లోని సూచనల ఆధారంగా వేరబుల్ డివైజ్ కాలిబ్రేట్ చేయాలి. రక్తపోటు కొలతలను సమీక్షించడానికి మీ మణికట్టు పైకి స్లైడ్ చేయాలి.

ఈసీజీ రిపోర్టు ఇలా :

  • మీ గెలాక్సీ వాచ్‌ని గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేయండి.
  • గెలాక్సీ వాచ్‌ను మీ మణికట్టుపై ధరించి శాంసంగ్ హెల్త్ మానిటర్ యాప్‌ను ఓపెన్ చేయండి.
  • గెలాక్సీ వాచ్ టాప్ బటన్‌పై 30 సెకన్ల పాటు ఎదురుగా ఉన్న మీ వేలికొనను లైటుగా పెట్టి ఉంచండి.
  • మీ ఫోన్‌లో శాంసంగ్ హెల్త్ మానిటర్ యాప్‌ని ఓపెన్ చేసి డేటాను వీక్షించడానికి రికార్డ్‌ను నొక్కండి.
  • మీ ECG ఫలితాల పీడీఎఫ్ షేర్ చేయడానికి ఈ రిపోర్టును షేర్ చేయి అనే ఆప్షన్ నొక్కండి.

Read Also : Realme 12 Pro 5G Series : రియల్‌మి 12ప్రో 5జీ సిరీస్ లాంచ్ డేట్ ఇదే.. ముందుగా రెండు మోడళ్లు.. స్పెషిఫికేషన్లు ఇవేనా?

ట్రెండింగ్ వార్తలు