×
Ad

Samsung Galaxy Z Flip 6 : వారెవ్వా.. ఖతర్నాక్ డీల్.. ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్ సగం ధరకే ఇలా కొనేసుకోవచ్చు.. డోంట్ మిస్!

Samsung Galaxy Z Flip 6 : కొత్త శాంసంగ్ మడతబెట్టే ఫోన్ కొంటున్నారా? ఈ విజయ్ సేల్స్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 తగ్గింపు ధరకే కొనేసుకోండి.

Samsung Galaxy Z Flip 6

Samsung Galaxy Z Flip 6 : మీరు ఫోల్డబుల్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? స్టైలిష్, కాంపాక్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ధర భారీగా తగ్గింది. ఇప్పుడు విజయ్ సేల్స్‌లో రూ. 54వేలకు పైగా భారీ తగ్గింపుతో లభ్యమవుతుంది. ఈ గెలాక్సీ Z ఫ్లిప్ 6 అసలు ధర రూ. 1,09,999 ఉండగా ప్రస్తుతం కేవలం రూ. 55వేల లోపు ధరకు అమ్ముడవుతోంది.

మీరు శాంసంగ్ అభిమాని అయితే ఈ అద్భుతమైన (Samsung Galaxy Z Flip 6) డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. అంతేకాదు.. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా లేదా ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్నా ధరలో సగం కన్నా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ధర తగ్గింపు :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ఫోన్ రూ.1,09,999 ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ ఫోల్డబుల్ ఫోన్ రూ.55,999 ధరకే లభిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో రూ.3,500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ అసలు ధర రూ.52,499 నుంచి తగ్గింపు పొందింది. పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చేంజ్ చేసుకోవాలని అనుకుంటే డివైజ్, మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి ధర తగ్గింపు పొందవచ్చు.

Read Also : 5 Camera Phones : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కన్నా టాప్ 5 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు ఇవే.. ఫీచర్లలో అసలు తగ్గేదేలే.. ఏదైనా కొనేసుకోండి!

శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6లో 6.7-అంగుళాల FHD+ డైనమిక్ అమోల్డ్ 2X మెయిన్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. పవర్‌ఫుల్ విజువల్స్ స్మూత్ స్క్రోలింగ్‌ను అందిస్తుంది. ఫోల్డ్ బయటి సైడ్ క్విక్ నోటిఫికేషన్‌లు, సెల్ఫీలు, యాప్ ప్రివ్యూలకు 3.4-అంగుళాల సూపర్ అమోల్డ్ కవర్ స్క్రీన్ (60Hz)ను కలిగి ఉంది. హుడ్ కింద, ఈ శాంసంగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఫ్లాగ్‌షిప్-లెవల్ పర్ఫార్మెన్స్ కోసం 12GB వరకు ర్యామ్‌తో వస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ సెన్సార్, 2MP అల్ట్రావైడ్ లెన్స్‌ కలిగి ఉంది. అయితే, 10MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. 4000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ అందిస్తుంది. శాంసంగ్ ఆటో జూమ్ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లను కూడా అందిస్తోంది. ఫొటో సబ్జెక్ట్‌లను ఆటోమాటిక్‌గా గుర్తించి ఫ్రేమింగ్‌ను అడ్జెస్ట్ చేస్తుంది.