5 Camera Phones : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కన్నా టాప్ 5 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు ఇవే.. ఫీచర్లలో అసలు తగ్గేదేలే.. ఏదైనా కొనేసుకోండి!
5 Camera Phones : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాదిరిగా కెమెరా ఫీచర్లతో 5 ఆండ్రాయిడ్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఏ కెమెరా ఫోన్ కొంటారో కొనేసుకోండి.

5 Camera Phones
5 Camera Phones : కొత్త ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే. ఐఫోన్ 17 ప్రో ఫ్లాగ్‌షిప్-లెవల్ ఫొటోగ్రఫీని అందించే అద్భుతమైన ఆండ్రాయిడ్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అడ్వాన్స్ పెరిస్కోప్ జూమ్ నుంచి ప్రో-గ్రేడ్ ఇమేజ్ ప్రాసెసింగ్ వరకు ఈ కెమెరా ఫోన్లు స్పీడ్ పర్ఫార్మెన్స్, ప్రీమియం వీడియో క్వాలిటీని అందిస్తాయి.
ఐఫోన్ 17 ప్రో కన్నా బెటర్ (5 Camera Phones) ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, వివో X200 ప్రో, షావోమీ 15 అల్ట్రా, ఒప్పో ఫైండ్ X8 ప్రో, గూగుల్ పిక్సెల్ 10 ప్రో వంటి ఫోన్లు లభ్యమవుతున్నాయి. బెస్ట్ ఫొటోగ్రఫీ-సెంట్రలైజడ్ స్మార్ట్‌ఫోన్‌లలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (రూ. 98,999) :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో 200MP మెయిన్ కెమెరా, 5x జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 10MP 3x టెలిఫొటో, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. 8K వీడియో రికార్డింగ్, HDR10+ సపోర్టును అందిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ సినిమాటిక్ ఫొటో, వీడియో క్వాలిటీని అందిస్తుంది. ఐఫోన్ 17 ప్రో టాప్ రేంజ్ పోటీదారుగా నిలుస్తుంది.
వివో X200 ప్రో (రూ. 94,999) :
వివో X200 ప్రోలో 50MP ప్రైమరీ షూటర్, 200MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. జీసెస్ ఆప్టిక్స్, 8K రికార్డింగ్ షార్ప్‌నెస్, పవర్‌ఫుల్ కలర్ ఆప్షన్లలో ప్రత్యేకంగా ఉంటుంది. 2025లో ఐఫోన్ 17 ప్రో ఫొటోగ్రఫీ పరంగా పరిశీలిస్తే ఆండ్రాయిడ్ ఫోన్లలో వివో X200 ప్రో కెమెరా ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.
Read Also : Apple iPhone 17 : ఇది కదా ఆఫర్.. ఆపిల్ ఐఫోన్ 17పై అద్భుతమైన డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే ఇంకా తక్కువ ధరకే..!
షావోమీ 15 అల్ట్రా (రూ. 1,09,999) :
లైకా డెవలప్ చేసిన షావోమీ 15 అల్ట్రాలో ఒక అంగుళాల 50MP ప్రైమరీ సెన్సార్, భారీ 200MP పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. డాల్బీ విజన్ సపోర్ట్, 8K వీడియో సపోర్టు, టీఓఎఫ్ 3డీ డెప్త్ సెన్సింగ్ ఆప్షన్ కలిగి ఉంది. ఫొటోగ్రఫీ ఔత్సాహికులకు అద్భుతమైన పవర్‌హౌస్‌గా రన్ అవుతుంది. ఆపిల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్‌తో షావోమీ 15 అల్ట్రా ఫోన్ పోటీనిస్తుంది.
ఒప్పో ఫైండ్ X8 ప్రో (రూ. 99,999) :
ఒప్పో ఫైండ్ X8 ప్రో క్వాడ్ 50MP కెమెరా రేంజ్ కలిగి ఉంది. ఇందులో 6x ఆప్టికల్ జూమ్ వరకు సపోర్టు ఇచ్చే డ్యూయల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌లు ఉన్నాయి. హాసెల్‌బ్లాడ్ కలర్ ట్యూనింగ్, ప్రో-లెవల్ ఇమేజ్ ప్రాసెసింగ్‌తో డైనమిక్ రేంజ్ అందిస్తుంది. ఐఫోన్ 17 ప్రో మాదిరిగా అదిరిపోయే కెమెరా ఫోన్‌లతో గట్టి పోటీనిస్తుంది,.
గూగుల్ పిక్సెల్ 10 ప్రో (రూ. 1,09,999) :
గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ లెన్స్, 5x జూమ్‌తో 48MP పెరిస్కోప్ టెలిఫోటో, 48MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. 42MP ఫ్రంట్ కెమెరా 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అద్భుతమైన కెమెరా క్వాలిటీని అందిస్తుంది. అడ్వాన్స్ కంప్యూటేషనల్ ఇమేజింగ్‌తో ఐఫోన్ 17 ప్రో కెమెరా పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది.