Pig Kidney to Human: పంది కిడ్నీని మనిషికి అమర్చిన సైంటిస్టులు

జంతువుల అవయవాలతో మనుషుల ప్రాణాలు కాపాడే ప్రయోగంలో ముందడుగేశారు సైంటిస్టులు. పంది కిడ్నీని మానవ శరీరానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు.

Pig Kidney to Human: జంతువుల అవయవాలతో మనుషుల ప్రాణాలు కాపాడే ప్రయోగంలో ముందడుగేశారు సైంటిస్టులు. పంది కిడ్నీని మానవ శరీరానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు. అవయవ కొరత ఉన్న నేపథ్యంలో పందుల కిడ్నీలపై రీసెర్చ్ మొదలుపెట్టారు.

పందుల్లో ఉండే కణాల్లో గ్లూకోజ్.. మానవ శరీరానికి విదేశీ వ్యవస్థలా పనిచేస్తుంది. దాంతో అవయవ ఏర్పాటు అనేది తిరస్కరణకే దారి తీస్తుంది. అందుకే ఈ ప్రయోగం కోసం జన్యుపరమైన మార్పులు ఉన్న జంతువు నుంచి కిడ్నీ సేకరించి ఇమ్యూన్ సిస్టమ్ పై దాడి జరగకుండా చూసుకున్నారు.

‘ఇది పూర్తిగా సాధారణంగానే పనిచేస్తుంది. మేం అనుకున్నట్లుగా ఇబ్బంది కాకుండా ఉంది’ అని డా. రాబర్ట్ మాంగ్టోమెరీ అన్నారు. ‘ఈ ప్రయోగం ప్రత్యేకంగా నిలవనుంది. సరైన పద్ధతిలోనే ప్రయోగం జరిపాం’ అని డా. ఆండ్రూ ఆడమ్స్ చెప్పుకొచ్చారు.

……………………………………………. : ప్రేయసి కోసం శానిటరీ ప్యాడ్‌లు దొంగతనం చేసిన ప్రియుడు

జంతువుల నుంచి మనుషులకు అవయవ మార్పిడి అనేది 17వ శతాబ్దంలో జంతువుల రక్తాన్ని మనుషులకు ఎక్కించిన దానికి ప్రేరణ అయింది. 20వ సెంచరీలో సర్జన్లు మనుషులకు అవయవ మార్పిడి చేయాలంటే కోతుల నుంచి సేకరించేవారు. గుండె సమస్య ఉన్న పసిపాపకు ఇలా అరేంజ్ చేయడంతో 21రోజుల పాటు బతికి తర్వాత చనిపోయింది.

ఈ విషయంలో కోతుల కంటే పందులు బెటర్ అని చెప్తున్నారు. వాటిని ఆహారంగా కూడా తీసుకుంటారు కాబట్టి.. అవయవాలను సులువుగా సేకరించగలమని చెప్తున్నారు. దశాబ్దాల క్రితమే పంది గుండె కవాటాలు మనిషికి సరిపోతాయని రుజువైంది. వాటి ప్రేగుల నుంచి వచ్చే హెపరైన్.. రక్తాన్ని పలచగా ఉంచుతుంది. వాటి చర్మంతో పోయిన కంటిచూపును కూడా తీసుకొస్తున్నారు చైనా సర్జన్లు.

ట్రెండింగ్ వార్తలు