Antarctic Robot
Antarctic Robot : అంటార్కిటికాలో ఒక బుల్లి రోబో తప్పిపోయింది. కానీ, ఎక్కడికి వెళ్లిందో వెళ్లి అకస్మాత్తుగా తిరిగి వచ్చింది. ఆర్గో ఫ్లోట్ అనే పేరుగల ఈ రోబో సముద్రం ఉష్ణోగ్రత ఉప్పు శాతాన్ని కొలవగలదు. శాస్త్రవేత్తలు టోటెన్ హిమానీనదం దగ్గర అందుకే వదిలివేశారు.
అక్కడి మంచు పూర్తిగా కరిగితే (Antarctic Robot)సముద్ర మట్టాలు 3.5 మీటర్లు పెరగవచ్చు. కానీ, రోబో త్వరగా దూరంగా వెళ్లిపోయింది. టోటెన్ కరగడానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించి నిరాశ చెందారు. ఇప్పుడు రోబో డెన్మాన్ షాకిల్టన్ ఐస్ షెల్వ్స్ కిందకు వెళ్లి తిరిగి వచ్చింది. రోబో 9 నెలలు మంచు కింద గడిపి కీలకమైన సమాచారాన్ని సేకరించింది.
ఆర్గో ఫ్లోట్ రోబో అంటే ఏంటి? :
ది డెబ్రీఫ్ నివేదికల ప్రకారం.. ఆర్గో ఫ్లోట్ అనేది సముద్రం గుండా ప్రయాణించే ఒక ఆటోమేటెడ్ రోబో. రెండు కిలోమీటర్ల లోతుకు డైవ్ చేస్తుంది. పైకి కిందికి కదులుతుంది. ప్రతి 10 రోజులకు ఉపరితలానికి తిరిగి వచ్చి శాటిలైట్లకు డేటాను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది ఇలాంటి ఫ్లోట్‌లు పనిచేస్తాయి. ఈ రోబో ఫస్ట్ టైమ్ తూర్పు అంటార్కిటికాలోని మంచు షెల్ఫ్ కింద ప్రతి 5 రోజులకు ఉష్ణోగ్రత డేటాను సేకరించింది.
అంటార్కిటికాలో భారీగా తేలియాడే మంచు పలకలు, భూమి మంచు సముద్రంలోకి ప్రవహించకుండా నిరోధిస్తాయి. వెచ్చని నీరు దిగువ నుంచి వస్తే కరుగుతాయి. కరుగుతున్న మంచు వేగంగా సముద్రంలోకి పడిపోతుంది. నీటి మట్టం పెరుగుతుంది.
డెన్మాన్ హిమానీనదం చాలా మంచును కలిగి ఉంది. అది పూర్తిగా కరిగిపోతే నీటి మట్టాన్ని 1.5 మీటర్లు పెంచుతుంది. షాక్లెటన్ మంచు తూర్పు అంటార్కిటికాలోని ఉత్తరాన మరింత పెరగనుంది. దీనికి సంబంధించి సమాచారంపై ఒక రోబో పూర్తి చేసింది.
300 కి.మీ దూరం ప్రయాణించిన రోబో :
టోటెన్ నుంచి డెన్మాన్ వరకు రోబో కొట్టుకుపోయింది. మంచు కింద నుంచి వెచ్చని నీరు కారుతోంది. రోబోట్ మంచు కిందకి వెళ్ళింది. అయితే, ఆ రోబో ఎప్పటికీ తిరిగి రాదని శాస్త్రవేత్తలు భావించారు. కానీ, 9 నెలల తర్వాత డెన్మాన్, షాక్లెటన్ కింద నుంచి బయటపడింది.
ఈ సమయంలో 300 కిలోమీటర్లు ప్రయాణించి దాదాపు 200 సార్లు డేటాను రికార్డ్ చేసింది. మంచు కింద ఉండటం జీపీఎస్ నిరోధించింది. కానీ, రోబో మంచును తాకినప్పుడల్లా అది పరిమాణాన్ని అంచనా వేస్తుంది. గత శాటిలైట్ సమాచారంతో కలపడం ద్వారా శాస్త్రవేత్తలు మార్గాన్ని గుర్తించారు.
ఇలాంటి రోబోలనే పంపుతున్న సైంటిస్టులు :
షాకిల్టన్ ఐస్ షెల్ఫ్ కిందకు వెచ్చని నీరు ఇంకా చేరలేదని డేటా వెల్లడించింది. అక్కడి నీరు చాలా చల్లగా ఉంటుంది. ప్రస్తుతం మంచు గడ్డిగానే ఉంది. అయితే, డెన్మాన్ కిందకు వెచ్చని నీరు చేరుతోంది. మంచు మెల్లగా కరుగుతోంది.
టోటెన్, డెన్మాన్ హిమానీనదాలు సముద్ర మట్టాలను 5 మీటర్ల వరకు పెంచవచ్చు. ఈ కొత్త సమాచారంతో శాస్త్రవేత్తలు వాతావరణానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోనున్నారు. సైంటిస్టులు ఇప్పుడు అలాంటి మరిన్ని రోబోలను పంపాలని చూస్తున్నారు.