Best Realme Phones : కిర్రాక్ ఫోన్లు భయ్యా.. రూ. 35వేల లోపు బెస్ట్ రియల్‌మి ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోండి..!

Best Realme Phones : కొత్త రియల్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? 2025లో రూ. 35వేల లోపు బెస్ట్ రియల్‌మి ఫోన్లు మీకోసం అందుబాటులో ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.

Best Realme Phones : కిర్రాక్ ఫోన్లు భయ్యా.. రూ. 35వేల లోపు బెస్ట్ రియల్‌మి ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోండి..!

Best Realme Phones

Updated On : December 28, 2025 / 8:24 PM IST

Best Realme Phones : రియల్‌మి లవర్స్ మీకోసమే.. కొత్త రియల్‌మి ఫోన్ కొనాలంటే కొనేసుకోండి. ఇందులో రియల్‌మి GT 7T, రియల్‌మి 15 ప్రో, రియల్‌మి 14 ప్రో ప్లస్, రియల్‌మి 13 ప్రో ప్లస్, రియల్‌మి జీటీ 6 ఉన్నాయి. ఈ ఫోన్లలో అద్భుతమైన డిస్‌ప్లేలు, పవర్‌ఫుల్ కెమెరాలను అందిస్తాయి. సరసమైన ధరలో క్వాలిటీ కోరుకునే వారికి అదిరిపోయే ఫోన్లుగా చెప్పొచ్చు.

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో 2025లో (Best Realme Phones) రూ. 35వేల లోపు ధరలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించే 5 బెస్ట్ రియల్‌మి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆకర్షణీయమైన డిస్‌ప్లేలు, భారీ ప్రాసెసర్‌లు, ఇమేజింగ్ కెపాసిటీలతో వస్తాయి. స్మార్ట్‌ఫోన్ ప్రియులు తమ బడ్జెట్‌ ధరలో నచ్చిన ఫోన్ ఇంటికి తెచ్చుకోండి.

రియల్‌మి GT 7T (రూ. 34,999) :
రియల్‌మి జీటీ 7T 1B కలర్ ఆప్షన్లతో 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 8400 మ్యాక్స్ చిప్‌సెట్‌తో వస్తుంది. 120W వైర్డ్ ఛార్జింగ్‌తో కూడిన భారీ 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. ఈ ఫోన్ 50MP + 8MP డ్యూయల్ కెమెరా సెటప్, షార్ప్ క్లియర్ క్లిక్‌ల కోసం 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

రియల్‌మి 15 ప్రో (రూ. 31,999) :
రియల్‌మి 15 ప్రో 6.8-అంగుళాల OLED డిస్‌ప్లే, 1B కలర్ ఆప్షన్లు, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. క్వాల్కమ్ SM7750-AB స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 చిప్‌సెట్‌తో వస్తుంది. 80W వైర్డ్ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్ 50MP + 50MP డ్యూయల్ కెమెరా సెటప్, క్లియర్ షాట్‌ల కోసం 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

Read Also : New Year 2026 : న్యూ ఇయర్ కోసం ప్లాన్ చేస్తున్నారా? ఎప్పుడూ చూడని 7 అద్భుతమైన ప్రదేశాలివే.. ఈసారి వెళ్లి ఫుల్‌గా చిల్ అవ్వండి!

రియల్‌మి 14 ప్రో ప్లస్ (రూ. 31,999) :

రియల్‌మి 14 ప్రో ప్లస్ 6.83-అంగుళాల OLED డిస్‌ప్లే, 1B కలర్ ఆప్షన్లు, 1500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. క్వాల్కమ్ SM7635 స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 80W వైర్డ్ ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 50MP + 50MP + 8MP ట్రిపుల్ కెమెరా సెటప్, ప్రతి క్లిక్‌తో అద్భుతమైన ఫొటోల కోసం 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

రియల్‌మి 13 ప్రో ప్లస్ (రూ. 25,650) :
రియల్‌మి 13 ప్రో ప్లస్ 1B కలర్ ఆప్షన్లు, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. క్వాల్కమ్ SM7435-AB స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్‌తో 80W వైర్డ్ ఛార్జింగ్‌తో 5200mAh బ్యాటరీని అందిస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 50MP + 50MP + 8MP ట్రిపుల్ కెమెరా సెటప్, ప్రతి క్లిక్‌తో క్వాలిటీ షాట్‌ల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

రియల్‌మి GT 6 (రూ. 32,999) :
రియల్‌మి జీటీ 6లో 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే 1B కలర్ ఆప్షన్లు, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. క్వాల్‌కామ్ SM8635 స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. 120W వైర్డ్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ ఫోన్ 50MP + 50MP + 8MP ట్రిపుల్ కెమెరా సెటప్, క్వాలిటీ ఫొటోగ్రఫీ కోసం 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.