OnePlus 13 Price : ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్ బ్రో.. వన్‌ప్లస్ 13 ధర మరి ఇంత తక్కువా.. ఇప్పుడు కొనడమే బెటర్..!
OnePlus 13 Price : వన్‌ప్లస్ 13 ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ 13 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
OnePlus 13 Price
OnePlus 13 Price : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కొంటున్నారా? ఈ-కామర్స్ దిగ్గజ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్లు భారీ ధర తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ లిస్టులో వన్‌ప్లస్ 13 కూడా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.60వేల కన్నా తక్కువ ధరకు బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో అందుబాటులో ఉంది.
ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో అత్యుత్తమ ఫ్లాగ్‌షిప్ డీల్‌లలో ఒకటి. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.69,999గా ఉంది. ప్రీమియం వీగన్ లెదర్ ఫినిష్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, ట్రిపుల్ కెమెరా సెటప్ మరెన్నో అందించింది. ఈ ఫోన్ కొన్ని ఏఐ ఫీచర్ల లిస్టును కూడా అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13 ధర ఎంతంటే? :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13 కేవలం రూ.61,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. అసలు లాంచ్ ధర రూ.69,999 నుంచి రూ.8వేలు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా, కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి పేమెంట్ చేయడం ద్వారా అదనంగా రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ నెలకు రూ.2,180 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది.
Read Also : Vivo X100 Pro : అద్భుతమైన ఆఫర్ భయ్యా.. వివో X100 ప్రో ధర భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
పాత ఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే కస్టమర్లకు కంపెనీ ద్వారా ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. ఆసక్తిగల వినియోగదారులు ఎక్స్ఛేంజ్‌లో రూ. 50,200 వరకు వాల్యూను పొందవచ్చు. అయితే, డివైజ్ వాల్యూ ఎక్స్చేంజ్ డివైజ్ బ్రాండ్, మోడల్ కండిషన్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 13 ఫోన్ 6.82-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో వస్తుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ గరిష్టంగా 4,500 నిట్స్ బ్రైట్‌నెస్‌ను చేరుకోగలదు. హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ కలిగి ఉంటుంది. 24GB వరకు ర్యామ్, 1TB స్టోరేజ్‌తో వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. 6,000mAh బ్యాటరీ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.
ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. ట్రిపుల్-కెమెరాతో వస్తుంది. 50MP ప్రైమరీ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్ షూటర్ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 32MP షూటర్‌తో సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
