iPhone Charge Mistakes : ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఇకపై ఛార్జింగ్ పెడితే ఈ 4 మిస్టేక్స్ చేయొద్దు.. లేదంటే మీ బ్యాటరీ గోవిందా..!
iPhone Charge Mistakes : మీ ఐఫోన్ బ్యాటరీ ఎక్కువ రోజులు రావాలంటే సరిగ్గా ఛార్జ్ చేయడం బెటర్. ప్రతిసారి 100శాతం వరకు ఛార్జ్ చేయడం లేదా రాత్రంతా ఛార్జింగ్ పెట్టి ఉంచడం వంటి పనులు చేయొద్దు. ఇంకా ఈ తప్పులు చేస్తే బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది..
- Sreehari A
- Published on- July 19, 2026 / 06:38 PM IST
iPhone Charge Mistakes
iPhone Charge Mistakes : మీ ఐఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ వెంటనే అయిపోతుందా? అయితే, మీరు ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు. చాలామంది సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, ఆఫీస్ వర్క్ కోసం ఎక్కువగా ఫోన్ వాడేస్తుంటారు. దాంతో బ్యాటరీ త్వరగా అయిపోతుంది.
కానీ, కొన్నిసార్లు కొన్ని ఛార్జింగ్ అలవాట్ల కారణంగా ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. ముఖ్యంగా ఐఫోన్ యూజర్లు బ్యాటరీ లాంగ్ టైమ్ రావాలంటే ఛార్జింగ్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి..
ప్రతిసారీ 100శాతం వరకు ఛార్జ్ అక్కర్లేదు :
చాలా మంది తమ ఫోన్‌లు 100 శాతం పూర్తిగా ఛార్జ్ అయ్యాక కూడా ఎక్కువ సేపు ఛార్జర్‌కు కనెక్ట్ చేసి పెడతారు. తద్వారా బ్యాటరీపై అదనపు భారం పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజువారీ వాడకానికి బ్యాటరీని 20 శాతం నుంచి 80 శాతం మధ్య ఉంచడం బెటర్. బ్యాటరీ హెల్త్ లాంగ్ టైమ్ మంచి కండిషన్ అందిస్తుంది.
రాత్రంతా ఛార్జింగ్ పెట్టొద్దు :
చాలా మందికి నిద్రపోయే ముందు ఫోన్ ఛార్జ్ చేసే అలవాటు ఉంటుంది. మోడ్రాన్ ఐఫోన్‌లలో బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉన్నప్పటికీ గంటల తరబడి ఛార్జర్‌కు కనెక్ట్ చేస్తే లాంగ్ బ్యాటరీ లైఫ్‌పై ఎఫెక్ట్ పడుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే ఛార్జ్ చేయండి. మీ ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయ్యాక ఛార్జర్ వెంటనే తీసివేయండి.
ఒరిజినల్ ఛార్జర్‌నే వాడండి :
మీ ఫోన్ బ్యాటరీని ప్రొటెక్ట్ చేసేందుకు ఒరిజినల్ లేదా సర్టిఫైడ్ ఛార్జర్లు, కేబుల్స్‌ను వాడాలి. చౌకైన లేదా లోకల్ ఛార్జర్లు సరైన వోల్టేజ్, కరెంట్‌ను అందించవు. తద్వారా బ్యాటరీ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. క్వాలిటీ లేని ఛార్జర్లు కొన్నిసార్లు ప్రమాదాలకు దారితీయొచ్చు.
వేడి ప్రదేశంలో ఛార్జ్ చేయొద్దు :
ఛార్జింగ్ చేసేటప్పుడు బ్యాటరీ టెంపరేచర్ పెరగడం కామన్. కానీ, మీ ఫోన్ ఇప్పటికే వేడి వాతావరణంలో ఉంటే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. సూర్యరశ్మి ఎక్కువగా ఉన్నచోట కాకుండా క్లోజ్ డోర్ కారులో లేదా వేడి గదిలో ఛార్జింగ్ చేయకూడదు. తద్వారా బ్యాటరీపై నెగటివ్ ఎఫెక్ట్ పడుతుంది.
మీ ఫోన్ కూల్ లేదా గాలి బాగా ఉండే ప్రదేశంలో ఛార్జ్ చేయడం బెటర్. ఛార్జింగ్ సమయంలో ఫోన్ అధికంగా వేడెక్కితే వాడకాన్ని తగ్గించి, నార్మల్ టెంపరేచర్ కూల్ అయ్యేవరకు వేచి ఉండండి. ఈ సింపుల్ కేర్ తీసుకుంటే మీ ఐఫోన్ బ్యాటరీ హెల్త్ లాంగ్ టైమ్ వస్తుంది. సరైన ఛార్జింగ్ కూడా బ్యాటరీ లైఫ్ పెంచుతుంది. మీ ఫోన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది.
