Tech Tips _ How to cancel one person ticket in IRCTC online
Tech Tips : సాధారణంగా రైల్లో ప్రయాణించే ముందు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటుంటారు. రైల్వే అధికారిక వెబ్‌సైట్ IRCTC ద్వారా ఒకేసారి ఎక్కుమందికి ట్రైన్ టికెట్లను బుకింగ్ చేసుకునే వీలుంది. అయితే కొన్ని సందర్భాల్లో బుకింగ్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంటుంది. కుటుంబ సభ్యుల కోసం రైల్వే టికెట్ బుకింగ్ చేసుకున్న తర్వాత వారిలో ఒక ప్రయాణికుడి టికెట్ క్యాన్సిల్ చేయాల్సి రావొచ్చు.
అప్పుడు చాలామంది రైల్వే ప్రయాణికులకు బుకింగ్ చేసుకున్న టికెట్ ఎలా రద్దు చేసుకోవాలో తెలియకపోవచ్చు. కొన్ని సార్లు ప్రయాణికుల ప్లాన్‌లలో మార్పు కారణంగా టికెట్లను రద్దు చేయాల్సి వస్తుంది. బల్క్ బుకింగ్ చేసుకున్న టికెట్లలో ఒక ప్రయాణికుడి టికెట్ మాత్రమే క్యాన్సిల్ చేయలేమా? అంటే చేయవచ్చు. చాలా సింపుల్ కూడా. పాక్షికంగా టికెట్లను రద్దు చేయలేమా అనే సందేహం కలుగుతుంది.
మీరు 3 నుంచి 4 సీట్ల బుకింగ్ చేసి ఒకటి లేదా రెండు సీట్లకు రద్దు చేసుకోవచ్చు. ఈ-టికెట్లను పాక్షికంగా రద్దు చేయాలంటే.. IRCTC ఈ-టికెటింగ్ వెబ్‌సైట్లో లాగిన్ అవ్వాలి. IRCTC వెబ్‌సైట్ చార్ట్ రెడీ అయ్యే లోగా బుకింగ్ చేసుకున్న రైలు టికెట్ రద్దు చేసే సదుపాయాన్ని అందిస్తుంది. రైల్వే టికెట్ కౌంటర్లలో ఈ-టికెట్ల రద్దుకు మాత్రం అనుమతి లేదని గమనించాలి. మీరు మీ టికెట్‌ను రద్దు చేయాలనుకుంటే.. కేవలం సింగిల్ వ్యక్తి IRCTC ఈ-టికెట్ రిజర్వేషన్‌ను రద్దు చేసుకోవచ్చు.
Tech Tips _ How to cancel one person ticket in IRCTC online
* లాగిన్ స్క్రీన్‌పై సరైన వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా IRCTC ఈ-టికెటింగ్ వెబ్‌సైట్‌ను తెరిచి లాగిన్ చేయండి.
* నిర్దిష్ట ఈ-టికెట్‌ను రద్దు చేసేందుకు ‘My Transactions’కి వెళ్లండి.
* ఇప్పుడు నా అకౌంట్ మెను కింద ‘Booked Ticket History’ లింక్‌పై క్లిక్ చేయండి.
* మీరు బుక్ చేసిన టికెట్ల సెక్షన్‌లో చూస్తారు.
* ఇప్పుడు Cancel చేయాల్సిన టికెట్లను ఎంచుకుని, ‘Cancel Ticket‘పై క్లిక్ చేయండి.
* టికెట్ Cancel చేయాల్సిన ప్రయాణీకుల పేరును ఎంచుకోవడం ద్వారా ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.
* ఇప్పుడు ప్రయాణీకుల పేరు ముందు ఉన్న చెక్ బాక్స్‌ను ఎంచుకోవాలి. “Cancel Ticket” బటన్‌పై క్లిక్ చేయండి.
* Cancel నిర్ధారించడానికి కన్ఫర్మేషన్ పాప్‌అప్‌పై Ok క్లిక్ చేయండి.
* Cancel సక్సెస్ అయిన తర్వాత మీరు ఎంచుకున్న టికెట్ Cancel అవుతుంది. ఆ టికెట్ నగదు మీ అకౌంట్లో రీఫండ్ అవుతుంది.
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్‌లో Ticket Cancelకు సంబంధించిన నిర్ధారించేందుకు SMS, ఈ-మెయిల్‌ను కూడా పొందవచ్చు.
Note : ఒక టికెట్ క్యాన్సిల్ చేసిన సందర్భంలో ఇతర ప్రయాణీకులతో కూడిన ERS అనే ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్ లేటెస్ట్ ప్రింటౌట్‌ని పొందాల్సి ఉంటుంది. ఎందుకంటే.. క్యాన్సిల్ చేసిన టికెట్ లేకుండా మిగతా టికెట్లతో ప్రింట్ తీసుకోవాలి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : Book Train Tickets : ట్రైన్ జనరల్ టికెట్ల కోసం ఇక క్యూలైన్ అక్కర్లేదు.. ఇలా బుకింగ్ చేస్తే సరి..!