Tech Tips _ How to secure your transactions_ 5 UPI tips for safe online payments
UPI Payments : ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్ర్తత్త.. గుర్తు తెలియని అనుమానాస్పద లింకులను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు. అనధికారిక వెబ్ సైట్లలో లింకుల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ చేయరాదు. అలా చేస్తే.. మీకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు మీ విలువైన డేటాతో పాటు బ్యాంకు అకౌంట్లో డబ్బులను కాజేస్తారు.. ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీతో పాటు సైబర్ క్రైమ్‌లు కూడా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు బ్యాంకు అధికారులుగా నమ్మించి వినియోగదారులను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ల నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి UPIని ఉపయోగించి ఆన్‌లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు. అయితే UPI పేమెంట్స్ చేసే సమయంలో అనుసరించాల్సిన 5 సెక్యూరిటీ టిప్స్ ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
1. స్క్రీన్ లాక్ (Screen Lock) :
మీ ఫోన్‌లో స్ట్రాంగ్ స్ర్కీన్ లాక్, పాస్‌వర్డ్ లేదా PIN కలిగి ఉండటం వల్ల మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచడమే కాకుండా మీ పేమెంట్, ఆర్థిక లావాదేవీల యాప్‌లను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మీ సున్నితమైన వ్యక్తిగత, ఫైనాన్షియల్ డేటా లీక్ కావడం లేదా అనధికార వ్యక్తుల ద్వారా యాక్సెస్ అయిందని నిర్ధారిస్తుంది. మీ పేరు, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ వంటి సాధారణ పాస్‌వర్డ్‌లను ఎప్పుడూ కూడా వాడరాదని గుర్తించుకోవడం చాలా ముఖ్యం.
2. మీ PIN ఎవరికీ షేర్ చేయొద్దు :
మీ పిన్‌ను ఎవరితోనైనా షేర్ చేయడం వల్ల మీరు మోసపోయే అవకాశం ఉంది, ఎందుకంటే.. సైబర్ నేరగాళ్లు మీ ఫోన్‌కి యాక్సెస్ చేసుకునే వీలుంది. అనధికారిక లావాదేవీలు చేయొచ్చు. మీ పిన్‌ను ఎవరితోనూ షేర్ చేయకపోవడం చాలా ముఖ్యం. మీ PIN ఎవరికైనా తెలిసి ఉందేమోని అనుమానం కలిగితే వెంటనే ఏదైనా ఆ PIN మార్చుకోవడం తప్పనిసరి.
UPI Payments : How to secure your transactions_ 5 UPI tips for safe online payments
3. వెరిఫై చేయని లింక్‌లపై క్లిక్ చేయడం, అన్‌నౌన్ నంబర్ల ఫోన్ కాల్స్‌కు స్పందించొద్దు :
ఆర్థిక నష్టాన్ని నివారించాలంటే.. వెరిఫై చేయని లింక్‌లు, ఫేక్ కాల్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి. సైబర్ నేరస్థులు తరచుగా మాల్‌వేర్ లింక్‌లతో మెసేజ్‌లను పంపుతారు లేదా బ్యాంక్‌లు లేదా ఇతర సంస్థల నుంచి కాల్ చేస్తున్నట్టుగా నటిస్తూ మీ PIN అడుగుతారు. లేదంటే.. మీ ఫోన్ OTP చెప్పమంటూ నమ్మిస్తారు. మీ వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే ఇవ్వరాదు. అంతేకాదు.. వెరిఫికేషన్ కోసం థర్డ్-పార్టీ యాప్‌ని డౌన్‌లోడ్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు. అలాంటి వ్యక్తిగత వివరాలను బ్యాంకులు ఎప్పుడూ అడగవని గమనించడం ముఖ్యం. వెరిఫై చేయని లింక్‌లపై క్లిక్ చేయొద్దు. గుర్తు తెలియని నంబర్‌లు లేదా అనుమానాస్పద ఫోన్ కాల్స్‌కు స్పందించొద్దు.
4. UPI యాప్‌ని క్రమం తప్పకుండా Update చేస్తూ ఉండండి :
మీరు లేటెస్ట్ ఫీచర్‌లు, మరెన్నో బెనిఫిట్స్ యాక్సెస్ పొందాలంటే మీ UPI పేమెంట్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌తో అప్‌డేట్ చేసుకోవడం చాలా అవసరం. ఎల్లప్పుడూ అప్‌డేట్‌ల కోసం చెక్ చేయండి. యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
5. మల్టీ పేమెంట్ అప్లికేషన్‌లను వాడొద్దు :
మీ ఆన్‌లైన్ పేమెంట్ల సెక్యూరిటీని నిర్ధారించడానికి గూగుల్ Play Store లేదా App Store వంటి అధికారిక యాప్ స్టోర్‌ల నుంచి వెరిఫైడ్ పేమెంట్ అప్లికేషన్‌లను మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది. మోసపూరిత కార్యకలాపాల ప్రమాదాన్ని తగ్గించడానికి మీ ఫోన్‌లో మల్టీ పేమెంట్స్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయొద్దు.
Read Also : Tech Tips : మీ PAN కార్డు పనిచేస్తుందో లేదో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్.. ఇలా చెక్ చేసుకోండి..!