Motorola Edge 70 : మోటోరోలా ఫ్యాన్స్ మీకోసమే.. కొత్త మోటోరోలా ఎడ్జ్ 70 వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, కీలక ఫీచర్లు లీక్..!
Motorola Edge 70 : కొత్త మోటోరోలా ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి మోటోరోలా నుంచి సరికొత్త మోటోరోలా ఎడ్జ్ 70 ఫోన్ రాబోతుంది..
Motorola Edge 70
Motorola Edge 70 : మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో కొత్త మోటోరోలా ఎడ్జ్ 70 ఫోన్ వచ్చేస్తోంది. ఇప్పటికే ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలోకి ఈ మోటోరోలా ఎడ్జ్ 70 ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. అతి త్వరలో భారత మార్కెట్లో కూడా రిలీజ్ కానుంది.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్ అల్ట్రా-సన్నని 5.99mm ఫ్రేమ్ 159జీ డిజైన్ (Motorola Edge 70) కలిగి ఉంటుంది. అధికారిక వివరాలు ఇంకా రివీల్ చేయనప్పటికీ, లీక్‌లను పరిశీలిస్తే.. మోటోరోలా ఎడ్జ్ 70 లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్‌లు, ధర రేంజ్ సహా డివైజ్ కొన్ని వివరాలను రివీల్ చేసింది.
మోటోరోలా ఎడ్జ్ 70 లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
భారత మార్కెట్లో మోటోరోలా లాంచ్ తేదీని అధికారికంగా ధృవీకరించలేదు. మోటోరోలా ఎడ్జ్ 70 2026 ప్రారంభంలో లాంచ్ కావొచ్చునని ఇండస్ట్రీ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ మోటోరోలా ఫోన్ ఇప్పటికే మల్టీ సర్టిఫికేషన్ డేటాబేస్‌లలో కనిపించింది. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్‌కు రెడీ అవుతోంది.
మోటోరోలా ఎడ్జ్ 70 స్పెసిఫికేషన్లు (అంచనా) :
ప్రపంచవ్యాప్తంగా, మోటోరోలా ఎడ్జ్ 70 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 4,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల pOLED సూపర్ HD డిస్‌ప్లే కలిగి ఉంది. స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 70 68W టర్బోపవర్ వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 4,800mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ ఆండ్రాయిడ్ 16తో రన్ అవుతుంది. జూన్ 2031 వరకు సేఫ్టీ అప్‌డేట్స్ అందుకుంటుంది. ఈ మోటోరోలా ఫోన్ IP68/IP69 రేటింగ్ కూడా కలిగి ఉంది. మెరుగైన ప్రొటెక్షన్ కోసం MIL-STD-810H మన్నికను అందిస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. మోటోరోలా ఎడ్జ్ 70లో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో OISతో కూడిన 50MP ప్రైమరీ సెన్సార్, 3-ఇన్-1 లైట్ సెన్సార్‌తో 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. 50MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
మోటోరోలా థింక్‌షీల్డ్ సెక్యూరిటీ సూట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ కూడా ఇంటిగ్రేట్ అవుతుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 6E, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. డాల్బీ అట్మోస్ సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 70 భారత్ ధర, లభ్యత (అంచనా) :
యూకేలో మోటోరోలా ఎడ్జ్ 70 ధర జీబీపీ 700 (సుమారు రూ. 80 వేలు), యూరప్‌లో ఈయూఆర్ 799 (సుమారు రూ. 81వేలు)గా ఉంది. అయితే, భారత మార్కెట్లో ఈ మోటోరోలా ఫోన్ ధర కన్నా చాలా తక్కువగా ఉండవచ్చు. టిప్‌స్టర్ ప్రకారం.. దాదాపు రూ. 35వేల వరకు ఉండవచ్చు. ఈ మోటోరోలా ఫోన్ బ్రాంజ్ గ్రీన్, లిల్లీ ప్యాడ్, గాడ్జెట్ గ్రే అనే 3 పాంటోన్-సర్టిఫైడ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండవచ్చు.
