Tecno Camon Slim : వివో, శాంసంగ్ ఫోన్లకు పోటీగా.. మతిపొగొట్టే ఫీచర్లతో కొత్త టెక్నో కామన్ స్లిమ్.. లాంచ్ డేట్ ఇదే..!

Tecno Camon Slim : టెక్నో కామన్ స్లిమ్ స్మార్ట్‌ఫోన్ 5 కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. టెక్నో కామన్ స్లిమ్‌లో కెమెరా బార్, రియర్ కెమెరా మాడ్యూల్ బ్లాక్ కలర్, మెటాలిక్ సిల్వర్ ఫ్రేమ్‌ ఉండొచ్చు.. పూర్తి వివరాలివే..

Tecno Camon Slim

  • ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌ ఉండొచ్చు
  • టెక్నో కామన్ స్లిమ్‌లో సోనీ లైటియా 600 ప్రైమరీ కెమెరా సెటప్
  • 5,600 mAh బ్యాటరీ, 60W ఛార్జింగ్ సపోర్ట్‌, ఫ్రంట్ సైడ్ 13MP కెమెరా

Tecno Camon Slim : టెక్నో లవర్స్ మీకోసమే.. చైనాకు స్మార్ట్ ఫోన్ మేకర్ టెక్నో త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. కొత్త టెక్నో కామన్ స్లిమ్ డిజైన్‌కు సంబంధించిన టీజర్‌ లాంచ్ అయింది. వివో, శాంసంగ్ ఫోన్లకు పోటీగా గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో రన్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ అడ్డంగా ఒక కెమెరా బార్ కనిపిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.39 మిల్లీమీటర్ల మందంతో ఉంటుందని అంచనా.

టీజర్‌ల ప్రకారం.. ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కానుందని సూచించాయి. టెక్నో కామన్ స్లిమ్ జూన్ 21న లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఉగాండాలో ఈ టెక్నో ఫోన్ కోసం ప్రీ-ఆర్డర్లు కూడా మొదలయ్యాయి. టెక్నో కామన్ స్లిమ్‌ను ప్రీ-ఆర్డర్ చేసే కస్టమర్లకు భారీ డిస్కౌంట్ అందించనున్నారు.

Read Also : Apple iPhone Air : పండగ చేస్కోండి..! ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర భారీగా తగ్గింది.. అమెజాన్‌లో ఇంత తక్కువకు మళ్లీ దొరకదు..!

5 కలర్ ఆప్షన్లు, కెమెరా బార్ ఫీచర్ :
రాబోయే స్మార్ట్‌ఫోన్‌ 5 కలర్ ఆప్షన్లలో ఉండవచ్చు. టెక్నో కామన్ స్లిమ్‌లో అడ్డంగా ఉండే కెమెరా బార్ కనిపిస్తుంది. రియర్ కెమెరా మాడ్యూల్ బ్లాక్ కలర్, మెటాలిక్ సిల్వర్ ఫ్రేమ్‌తో ఉంటుంది. డిజైన్ టెక్నో స్పార్క్ స్లిమ్‌ మాదిరిగా ఉండవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లకు సంబంధించి కంపెనీ ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. టెక్నో కామన్ స్లిమ్‌లో ప్రాసెసర్‌గా మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మందం 6.39 మి.మీ. ఉండవచ్చు. టెక్నో కామన్ స్లిమ్ రియర్ కెమెరా యూనిట్‌లో సోనీ లైటియా 600 ప్రైమరీ కెమెరా ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 60W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,600mAh బ్యాటరీ అందించనుంది.

ఇటీవలే ఈ స్మార్ట్‌ఫోన్ కార్ల్‌కేర్ సర్వీస్ వెబ్‌సైట్‌లో CN6c మోడల్ నంబర్‌తో లిస్ట్ అయింది. టెక్నో కామన్ స్లిమ్ 8GB ర్యామ్, 128GB లేదా 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) వెబ్‌సైట్‌లో కూడా ఇదే మోడల్ నంబర్‌తో లిస్ట్ అయింది. టెక్నో పోవా 8 గత వారమే భారత మార్కెట్లో లాంచ్ అయింది.

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. టెక్నో పోవా 8 రియర్ కెమెరా యూనిట్‌లో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 13MP కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.76-అంగుళాల ఫుల్ HD+ IPS డిస్‌ప్లే ఉంది. టెక్నో పోవా 8 ఫోన్ 8,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.