Vivo X300e Launch : బ్యాటరీలో బాహుబలి.. కెమెరాలో కింగ్! వివో X300e వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్..!
Vivo X300e Launch : వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. ఆగస్టు 27న వివో X300e ఫోన్ లాంచ్ కానుంది. మొత్తం 3 కలర్ వేరియంట్లలో లభించనుంది.
Vivo X300e Launch
- ఈ వివో X300e ఫోన్లో 3 రియర్ కెమెరాలు
- స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్తో రానుంది
- 3 కలర్ వేరియంట్లలో లాంచ్ కాబోతుంది
Vivo X300e Launch : కొత్త వివో ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వివో X300e ఫోన్ అతి త్వరలో లాంచ్ కాబోతుంది. ఈ ఫోన్ రాక ముందే కీలక స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. 6.59-అంగుళాల డిస్ప్లే ఉంటుంది. అలాగే, 3 రియర్ కెమెరాలు ఉంటాయి.
అందులో మెయిన్ సెన్సార్ 50MP ఉండొచ్చు. సెల్ఫీల కోసం 50MP కెమెరా కూడా ఉంటుందని అంచనా. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 పవర్ఫుల్ చిప్సెట్ ఉంటుంది. వివో X300e ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వివో X300e లాంచ్ ఎప్పుడంటే? :
వివో X300e లాంచ్ ఈవెంట్ ఆగస్టు 27న జరగనుంది. కంపెనీ దేశీయ మార్కెట్లో లాంచ్ చేస్తోంది. చైనాలో ఉదయం 9 గంటల నుంచి కంపెనీ సోషల్ మీడియా సైట్లలో లైవ్ కానుంది. ఈ వివో ఫోన్ లాంచ్‌కు ముందు స్పెసిఫికేషన్లు వివిధ సర్టిఫికేషన్లలో వెల్లడయ్యాయి. కంపెనీ వివో X300ఇ ఫోన్ మొత్తం 3 కలర్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.
వివో X300e స్పెసిఫికేషన్లు :
వివో X300e ఫోన్లో 6.59-అంగుళాల డిస్ప్లే ఉంటుంది. హై రిజల్యూషన్ డిస్ప్లే ఉంటుందని అంచనా. ఈ ఫోన్లో కంపెనీ క్వాల్కామ్ పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్ అందించింది. టాప్ ఫ్రీక్వెన్సీ 3.8GHzతో వస్తుంది. 8GB+256GB, 12GB+256GB, 12GB+512GB వేరియంట్లలో లభ్యం కానుంది.
ఈ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50MP సెన్సార్‌తో వస్తుందని అంచనా. సెకండరీ కెమెరా 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉండొచ్చు. కంపెనీ 8MP మూడో సెన్సార్‌ను కూడా చేర్చింది. సెల్ఫీల కోసం ఈ ఫోన్లో 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో రన్ అవుతుంది.
వివో X300e ఫోన్ కంపెనీ 3 కలర్ వేరియంట్లలో వస్తోంది. ఇందులో మూన్లైట్ వైట్, సన్‌లైట్ ఆరెంజ్, మిడ్నైట్ బ్లాక్ వంటి షేడ్స్ ఉన్నట్లు సమాచారం. ఈ ఫోన్ కొలతలు 157.52 × 74.33 × 7.99mm కాగా, బరువు 203 గ్రాములుగా ఉంటుందని అంచనా.
ఈ ఫోన్లో 7200mAh బ్యాటరీ ఉంది. అలాగే కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు అందిస్తోంది. కనెక్టివిటీ కోసం ఈ ఫోన్లో NFC, బ్లూటూత్, WLAN, USB వంటి ఆప్షన్లు ఉన్నాయి. అలాగే, సేఫ్టీ కోసం డిస్ప్లేలో ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది.
