Tecno POVA 8 Pro 5G : వావ్.. కొత్త టెక్నో గేమింగ్ ఫోన్ ఆగయా.. ఫీచర్లు మాత్రం కిర్రాక్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ డేట్ ఇదే..!
Tecno POVA 8 Pro 5G : భారత మార్కెట్లో టెక్నో పోవా 8 ప్రో లాంచ్ అయింది. ఈ టెక్నో ఫోన్ పవర్‌ఫుల్ 6500mAh బ్యాటరీ, పవర్‌ఫుల్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ గేమింగ్ ఫోన్ ధర ఎంతంటే?
- Sreehari A
- Published on- August 19, 2026 / 07:51 PM IST
Tecno POVA 8 Pro 5G
- భారీ బ్యాటరీతో టెక్నో పోవా 8 ప్రో 5జీ ఫోన్ వచ్చేసింది
- భారత మార్కెట్లో ఈ గేమింగ్ ఫోన్ ధర ఎంతంటే?
- 8GB ర్యామ్, 256GB, 12GB ర్యామ్ 512GB స్టోరేజీ
Tecno POVA 8 Pro 5G : టెక్నో లవర్స్ మీకోసమే.. కొత్త గేమింగ్ ఫోన్ వచ్చేసింది. టెక్నో పోవా 8 ప్రో 5జీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. టెక్నో ఇప్పటికే ఈ సిరీస్‌లో పోవా 8 5జీని దేశ మార్కెట్లో ప్రవేశపెట్టింది.
టెక్నో అందించే ఈ ఫోన్ మీడియాటెక్ మిడ్-బడ్జెట్ 7000 సిరీస్ చిప్‌సెట్‌తో వస్తుంది. 6,500mAh బ్యాటరీ అమర్చారు. లుక్, డిజైన్ చూసేందుకు అద్భుతంగా ఉంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
టెక్నో పోవా 8 ప్రో 5జీ ధర :
ఈ టెక్నో ఫోన్ 8GB ర్యామ్ + 256GB, 12GB ర్యామ్ + 512GB అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 49,999 మాత్రమే. ఈ ఫోన్ టాప్ వేరియంట్ ధర రూ. 54,999కు లభిస్తుంది.
ఆర్క్ వైట్, గ్రాఫైట్ బ్లాక్ టండ్రా గ్రీన్ అనే 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఆగస్టు 21 నుంచి ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనేసుకోవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ రూ. 3వేల వరకు తగ్గింపు అందిస్తోంది.
8GB ర్యామ్ + 256GB : రూ. 49,999
12GB ర్యామ్ + 512GB : రూ. 54,999
టెక్నో పోవా 8 ప్రో 5జీ :
ఈ టెక్నో ఫోన్‌లో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. కంపెనీ ఈ ఫోన్‌లో హైపర్‌లక్స్ టెక్నాలజీని వాడింది. ఈ డిస్‌ప్లే 4,500 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్, 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌కు IP69K రేటింగ్ కూడా ఉంది. వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్ 512GB స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌లో ప్రత్యేకమైన టెక్నో P1 చిప్‌ను కూడా అందించింది. హీటింగ్ మేనేజ్ కోసం వేపర్ ఛాంబర్ కూలింగ్ ఫీచర్ ఉంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే ఉంది.
టెక్నో పోవా 8 ప్రో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో వస్తుంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)తో 50MP మెయిన్ కెమెరా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ 5జీ సిమ్ కార్డులు, వైఫై, బ్లూటూత్ NFC ఉన్నాయి. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
