Mid-Range Smartphones : టెక్నో, రియల్‌మి, వివో అదుర్స్.. ఈ మిడ్ రేంజ్ ఫోన్‌లలో ఏది కొంటే బెటర్? ఫుల్ డిటెయిల్స్..!
Mid-Range Smartphones : భారత మార్కెట్లో టెక్నో పోవా 8 అనే కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. రియల్‌మి 16 5జీ, వివో V60e ఫోన్లతో పోటీపడుతుంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- June 16, 2026 / 09:08 PM IST
Mid-Range Smartphones
- టెక్నో పోవా 8 ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్
- రియల్‌మి 16 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో ప్రాసెసర్
- వివో V60eలో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్
Mid-Range Smartphones : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేవారికి అదిరిపోయే ఫోన్లు.. భారత మార్కెట్లో మూడు బ్రాండ్ల ఫోన్లు ఖతర్నాక్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. టెక్నో ఇటీవలే కొత్త స్మార్ట్‌ఫోన్, టెక్నో పోవా 8 లాంచ్ చేయగా, రియల్‌మి 16 5జీ, వివో V60eలకు గట్టి పోటీనిస్తోంది. టెక్నో పోవా 8 ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
రియల్‌మి 16 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో ప్రాసెసర్‌తో వస్తుంది. వివో V60e ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌తో (Mid-Range Smartphones) రన్ అవుతుంది. టెక్నో పోవా 8, రియల్‌మి 16 5జీ, వివో V60e ఫోన్లలో ఏది కొంటే బెటర్ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ధర స్టోరేజ్:
టెక్నో పోవా 8 ఫోన్ 6GB/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999, 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999. రియల్‌మి 16 5జీ 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999, 8GB/256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999కు లభిస్తుంది. వివో V60e ఫోన్ 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999, 8GB/256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999కు లభిస్తుంది.
డిస్‌ప్లే, రిజల్యూషన్ :
టెక్నో పోవా 8లో 1080×2344 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 381ppi పిక్సెల్ డెన్సిటీ 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.76-అంగుళాల ఫుల్ HD+ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది. అయితే, రియల్‌మి 16 5జీ, 2372×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 4,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.5-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. వివో వి60ఇలో 2392×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.
ప్రాసెసర్ :
టెక్నో పోవా 8 ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌తో వస్తుంది. రియల్‌మి 16 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. వివో V60e ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
ఆపరేటింగ్ సిస్టమ్ :
టెక్నో పోవా 8లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16పై రన్ అవుతుంది. రియల్‌మి 16 5జీ కాగా ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0 తో వస్తుంది. వివో V60e ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్‌ఓఎస్ 15పై రన్ అవుతుంది.
కెమెరా సెటప్ :
టెక్నో పోవా 8 బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్‌మి 16 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఎఫ్/2.4 అపర్చర్‌తో 2MP సెకండరీ కెమెరాతో వస్తుంది.
సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.4 అపర్చర్‌తో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. వివో V60e ఫోన్ బ్యాక్ సైడ్ ఎఫ్/1.88 అపర్చర్‌తో 200MP ప్రైమరీ కెమెరా, ఎఫ్ /2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ బ్యాకప్ :
టెక్నో పోవా 8లో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 8,000mAh బ్యాటరీ ఉంది. రియల్‌మి 16 5జీలో 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీ అందిస్తుంది. వివో V60eలో 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీ కూడా ఉంది.
