Free AI Videos : ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం టాప్ 5 AI యాప్స్.. ఫ్రీగా వీడియోలు చేయొచ్చు.. లైకులు, కామెంట్లు పక్కా!
Free AI Videos : ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం అద్భుతమైన ఏఐ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏ యాప్ అయినా ఫ్రీగా ఏఐ వీడియో క్రియేట్ చేయొచ్చు.. ఎలాగంటే?
- Sreehari A
- Published On : March 25, 2026 / 05:12 PM IST
Free AI Videos
- ఈ ఏఐ యాప్స్ ఎప్పుడైనా ట్రై చేశారా?
- ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసేవారికి ఈ ఏఐ యాప్స్ చాలా బెస్ట్
- ఏయే యాప్స్ ఫ్రీగా పొందవచ్చు.. ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే?
Free AI Videos : ఏఐ వీడియోలు కావాలా? పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా ఏఐ వీడియోలు చేయొచ్చు తెలుసా? మీరు ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు అయితే ఇది మీకోసమే.. అద్భుతమైన ఏఐ వీడియోలతో మీకు నచ్చిన కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. అయితే, చాలామందికి ఆన్‌లైన్‌లో ఏయే ఏఐ యాప్స్ ఫ్రీగా లభిస్తున్నాయో తెలియదు. మీరు కూడా మంచి ఏఐ యాప్స్ కోసం చూస్తుంటే మీకోసం 5 ఏఐ యాప్‌లను అందిస్తున్నాం.
మీరు కేవలం కొన్ని సెకన్లలోనే ట్రెండింగ్ ఏఐ వీడియోలను జనరేట్ చేయొచ్చు. ఆ తర్వాత ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మాదిరిగా పోస్టు చేయొచ్చు. ఈ యాప్‌లు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో అత్యధిక రేటింగ్ పొందాయి. చాలా పాపులర్ కూడా. మీరు కూడా సరైన ఏఐ యాప్ కోసం చూస్తుంటే మోస్ట్ రేటింగ్ అందించిన యాప్స్ అందుబాటులో ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.
గూగుల్ జెమిని :
గూగుల్ జెమిని అనేది పవర్‌ఫుల్ ఏఐ టూల్. చాట్‌బాట్‌కు సరైన ప్రాంప్ట్ ఇస్తే మంచి వీడియోలను జనరేట్ చేసి ఇస్తుంది. ఈ యాప్ మీకు స్క్రిప్ట్‌లను జనరేట్ చేయడం, మీ ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం అద్భుతమైన ఐడియాస్ అందిస్తుంది. కేవలం సింపుల్ ప్రాంప్ట్ ఇస్తే చాలు.. కొన్ని నిమిషాల్లోనే ఈ యాప్ మీ కోసం అద్భుతమైన ఏఐ వీడియోను జనరేట్ చేసి ఇస్తుంది.
ఈజీ కట్ :
ఈజీకట్ ఇన్‌స్టాగ్రామ్ కోసం ఏఐ వీడియోలను జనరేట్ చేయొచ్చు. అత్యంత పాపులర్ ఎడిటింగ్ యాప్‌లలో ఇదొకటి. వీడియోలను కట్ చేయడం లేదా ఎడిట్ చేసేందుకు అనుమతిస్తుంది. వాస్తవానికి, వినియోగదారులు తమ వీడియోల స్పీడ్, లైటింగ్‌ను అడ్జెస్ట్ చేయవచ్చు, వాటికి ఎఫెక్ట్‌లు, మ్యూజిక్ యాడ్ చేయొచ్చు.
పిక్స్ వర్స్ :
పిక్స్‌వర్స్ అనేది ఏఐ వీడియో జనరేటర్ ప్లాట్‌ఫామ్. టెక్స్ట్, ఫొటోలను కేవలం కొన్ని సెకన్లలో అందమైన వీడియోగా మారుస్తుంది. ఇందులో రెండు వేర్వేరు ఫోటోలను కూడా జాయింట్ చేయొచ్చు. ఈ యాప్ స్పెషాలిటీ ఏమిటంటే.. ఫొటోలకు ప్రాణం పోయగలదు. మిమ్మల్ని మీరు కౌగిలించుకోవడం లేదా ఫొటోలోని ఒక వ్యక్తిని కదిలేలా చేయడం వంటి ఫొటోలను జనరేట్ చేసుకోవచ్చు.
ఫిల్మోరా :
ఫిల్మోరా మీ విజువల్స్‌కు సినిమాటిక్ లుక్ అందిస్తుంది. ఈ యాప్‌తో మీరు మ్యూజిక్, స్టిక్కర్లను కూడా యాడ్ చేయొచ్చు. బ్రెయిన్‌స్టార్మింగ్ కోసం మీకు వివిధ ఏఐ టెంప్లేట్‌లను కూడా అందిస్తుంది. ఈ యాప్ మీ టెక్స్ట్‌ను స్పీచ్‌గా కూడా మారుస్తుంది. వాయిస్‌ఓవర్‌గా కూడా వాడుకోవచ్చు.
గ్రోక్ ఏఐ :
ఎక్స్ గ్రోక్ ఏఐలో ‘Imagine’ అనే సెక్షన్ ఉంది. ఇదో ఇమేజ్ జనరేటర్ టూల్. గ్రోక్‌తో మీరు వీడియోకు మీ వాయిస్‌ని యాడ్ చేయొచ్చు. రియల్ టైమ్ ఫొటోలు, వీడియోలను ఎడిట్ చేయవచ్చు. మీ ఫోటోల నుంచి ఏఐ వీడియోలను క్రియేట్ చేయొచ్చు.
