Best AC Sales 2026 : కొంటే ఇలాంటి AC కొనాలి.. ఈ వేసవిలో రూ. 30వేల లోపు 7 బెస్ట్ వన్ టన్ ఏసీలు.. ఇల్లంతా కూలింగ్..!
Best AC Sales 2026 : కొత్త ఏసీ కొనేవారికి గుడ్ న్యూస్.. ఈ సమ్మర్ సీజన్లో రూ. 30వేల లోపు ధరలో అదిరిపోయే ఒక టన్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఏసీని కొనేసుకోవచ్చు.
Best AC Sales 2026
- సమ్మర్ సీజన్ మొదలైంది.. ఏసీలకు ఫుల్ డిమాండ్
- రూ. 30వేల లోపు ధరలో అద్భుతమైన ఏసీల మోడల్స్
- వన్ టన్ ఏసీల కొనుగోలుపై ధర ఎంత చెల్లించాలంటే?
Best AC Sales 2026 : సమ్మర్ వచ్చేసింది. ఎండలు పెరగకముందే కొత్త ఏసీలు, కూలర్లు కొనేందుకు జనం ఎగబడుతున్నారు. కొంతమంది ఏసీలు ధరలు తక్కువగా ఉండగానే కొనేసి పెట్టుకుందామని చూస్తున్నారు. మీరు కూడా కొత్త ఏసీని కొనాలని భావిస్తుంటే ఇది మీకోసమే.
మీరు బేసిక్ 1-టన్ ఏసీ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ వేసవిలో అద్భుతమైన టాప్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ కండిషనర్ల కోసం భారీగా ఖర్చు పెట్టే బదులు రూ. 30 వేల లోపు ధరలో మీకు నచ్చిన బెస్ట్ ఏసీని ఇంటికి తెచ్చుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
డైకిన్ 1 టన్ 3 స్టార్ (రూ. 25,189) :
డైకిన్ స్ప్లిట్ ఏసీ ఒక టన్ సామర్థ్యంతో 100 చదరపు అడుగుల వరకు గదులకు అనుకూలంగా ఉంటుంది. కూలింగ్ పవర్ పరంగా ఈ ఏసీ 12000 బ్రిటిష్ థర్మల్ యూనిట్లతో వస్తుంది. 3D ఎయిర్‌ఫ్లో, డ్యూ క్లీన్ టెక్నాలజీ, 52°C వరకు హై-యాంబియంట్ ఆపరేషన్, పీఎం 2.5 ఫిల్టర్, ట్రిపుల్ డిస్ప్లే వంటి ప్రత్యేక ఫీచర్లతో వస్తుంది. అంతేకాకుండా, ఈ ఏసీపై ఒక ఏడాది పీసీబీఐ 5 సంవత్సరాలు, కంప్రెసర్‌పై 10 ఏళ్ల వారంటీతో లభిస్తుంది.
క్యారియర్ 1-టన్ 3-స్టార్ ఫ్లెక్సీకూల్ (రూ. 29,990) :
ఫ్లెక్సీకూల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో క్యారియర్ స్ప్లిట్ ఏసీ, హీట్ లోడ్ బట్టి పవర్ అడ్జెస్ట్ చేసే స్పీడ్ కంప్రెసర్‌ను అందిస్తుంది. 6-ఇన్-1 ఇన్వర్టర్ ద్వారా వినియోగదారుడు కూలింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు. దాదాపు 50శాతం విద్యుత్ వినియోగాన్ని ఆదా చేసుకోవచ్చు.
హిసెన్స్ 1.0 టన్ 3-స్టార్ (రూ. 27,900) :
హైసెన్స్ ఈ స్ప్లిట్ ఏసీకి దాదాపు 3.4 కిలోవాట్ల కూలింగ్ పవర్ అందిస్తుంది. 4-వే స్వింగ్, డస్ట్ ఫిల్టర్, ఫాస్ట్ కూలింగ్, ఇన్వర్టర్ కంప్రెసర్, రిమోట్ కంట్రోల్ స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. సామర్థ్యం 1.0 టన్, 70-100 చదరపు అడుగుల గదులకు అనుకూలంగా ఉంటుంది. అదనంగా, ఈ ఏసీ ఏడాదికి 675.7 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది. 3 స్టార్ల రేటింగ్ కూడా అందిస్తుంది.
వోల్టాస్ 123V CAE 1-టన్ 3 (రూ. 29,999) :
వోల్టాస్ 1 టన్ ఏసీలో 3300 కిలోవాట్ల కూలింగ్ పవర్ అందిస్తుంది. ప్రత్యేక ఫీచర్లుగా డస్ట్ ఫిల్టర్, ఫాస్ట్ కూలింగ్, ఇన్వర్టర్ కంప్రెసర్, రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. ఈ ఏసీ 110 నుంచి 120 చదరపు అడుగుల గదులకు బాగా సరిపోతుంది. వార్షిక విద్యుత్ వినియోగం 672.93kWh ఉంటుంది.
వోల్టాస్ 1-టన్ 3-స్టార్ ఫిక్స్డ్-స్పీడ్ విండో ఏసీ (రూ. 25,480) :
వోల్టాస్ 1-టన్ విండో ఏసీ 48 డిగ్రీల సెల్సియస్ పరిసర ఉష్ణోగ్రతను అందిస్తుంది. 3-స్టార్ రేటింగ్, ఏడాదికి 3100 యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంది. వోల్టాస్ అదనంగా ఒక ఏడాది వారంటీని కంప్రెసర్‌పై 5 ఏళ్ల వారంటీని అందిస్తుంది.
లాయిడ్ 1.0 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (రూ. 27,990) :
లాయిడ్స్ స్ప్లిట్ ఏసీ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో వస్తుంది. పవర్, టెంపరేచర్ బట్టి కంప్రెసర్ స్పీడ్ మార్చుకునే సౌకర్యాన్ని అందిస్తుంది. 5 కూలింగ్ మోడ్లు ఉన్నాయి.3-స్టార్ రేటింగ్, 698.49kWh వార్షిక విద్యుత్ వినియోగాన్ని అందిస్తుంది. తయారీదారు ఉత్పత్తిపై ఒక ఏడాది, పీసీబీతో సహా పార్టులపై 5 ఏళ్ల వారంటీని అందిస్తుంది.
గోద్రెజ్ 1 టన్ 3 స్టార్ (రూ. 27,990) :
గోద్రెజ్ ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీతో 5-ఇన్-1 కన్వర్టిబుల్ స్ప్లిట్ ఏసీని అందిస్తోంది. హీట్ లోడ్ బట్టి పవర్ అడ్జెస్ట్ చేసే వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ అందిస్తుంది. ఈ యూనిట్ కూలింగ్ సామర్థ్యంలో 40శాతం నుంచి 110శాతం వరకు పనిచేస్తుంది. 3 స్టార్ రేటింగ్, ఏడాదికి 905.41 పౌండ్ల విద్యుత్ వినియోగం కూడా ఉంది.
