Top 5 Smartphones : ఛార్జింగ్ టెన్షన్‌కు గుడ్‌బై.. 7,000mAh బ్యాటరీతో అదరగొడుతున్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు!

Top 5 Smartphones : 7,000mAh బ్యాటరీతో పాటు బ్యాటరీ, కెమెరా, ప్రాసెసర్, ఛార్జింగ్ ఫీచర్లతో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో రెడీగా ఉన్నాయి.. వివో, మోటోరోలా, ఒప్పో రియల్ మి ఫోన్లలో మీకు ఏది కావాలో అది కొనేసుకోవచ్చు..

Top 5 Smartphones With 7000mAh Battery

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీ
  • 7,000mAh బ్యాటరీతో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే
  • గేమింగ్, వీడియోలు, సోషల్ మీడియా.. అన్నింటికీ సూపర్

Top 5 Smartphones : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? మీకోసం అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు కెమెరా, ప్రాసెసర్, డిస్‌ప్లేతో పాటు ఇప్పుడు చాలామంది బ్యాటరీ బ్యాకప్‌కు కూడా ఎక్కువ ప్రాయారిటీ ఇస్తున్నారు.

గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా వాడకం ఎక్కువైతే ఫోన్‌ పదేపదే ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేలా 7,000mAh బ్యాటరీ సామర్థ్యంతో 5 స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..
అవేంటో చూద్దాం.

1. వివో టీ5ఎక్స్ 5జీ :
ఈ ఫోన్‌లో ఏకంగా 7,200mAh బ్యాటరీ, 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయి. మీడియాటెక్ డైమన్షిటీ 7400 టర్బో ప్రాసెసర్, 6.76 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ 120Hz డిస్‌ప్లే, రియర్ 50MP కెమెరా, ఫ్రంట్ 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. IP68, IP69 రేటింగ్స్ కూడా అందిస్తుంది.

2. మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ :
ప్రీమియం డిస్‌ప్లే కోరుకునేవారికి అద్భుతమైన ఆప్షన్. 7,000mAh బ్యాటరీ, 68W టర్బోపవర్ ఛార్జింగ్, స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్ ఉన్నాయి. 6.78 అంగుళాల 1.5K అమోల్డ్ 144Hz స్క్రీన్, OISతో 50MP సోనీ ఎల్‌వైటీ-710 కెమెరా, 13ఎంపీ అల్ట్రావైడ్, 32ఎంపీ సెల్ఫీ కెమెరా లభిస్తాయి.

Read Also : Samsung Galaxy S25 5G : రూ.80,999 శాంసంగ్ 5G ఫోన్ జస్ట్ రూ.52,249కే.. బ్యాంక్ ఆఫర్‌తో కొంటే ఇంకా చౌక!

3. ఒప్పో ఎఫ్33 ప్రో 5జీ :
సెల్ఫీ ప్రియులకు ఈ ఫోన్ అద్భుతంగా ఉంటుంది. 7,000mAh బ్యాటరీ, 80W సూపర్‌వూక్ ఛార్జింగ్ ఉన్నాయి. ఫ్రంట్ 50MP అల్ట్రావైడ్ సెల్ఫీ కెమెరా, రియర్ 50MP మెయిన్, 2MP పోర్ట్రెయిట్ కెమెరాలు ఉన్నాయి.

4. రియల్‌మి పీ4ఎక్స్ 5జీ :

బడ్జెట్‌లో గేమింగ్ ఫోన్ కోరుకునేవారికి అద్భుతమైన ఫోన్.. 7,000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. డైమన్షిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్, 144Hz డిస్‌ప్లే, 5,300mm² వేపర్ కూలింగ్ సిస్టమ్ అందిస్తుంది.

5. మోటో జీ57 పవర్ 5జీ :
7,000mAh బ్యాటరీ, 33డబ్ల్యూ టర్బో పవర్ ఛార్జింగ్‌తో వస్తుంది. 60 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని మోటరోలా పేర్కొంటోంది. స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 4 ప్రాసెసర్, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, 6.72 అంగుళాల 120Hz ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉన్నాయి. 50MP మెయిన్, 8MP అల్ట్రావైడ్, 8MP సెల్ఫీ కెమెరాలు లభిస్తాయి.

ఏ ఫోన్ కొనాలి? :
బ్యాటరీ, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. వివో టీ5ఎక్స్ 5జీ ఫోన్ ప్రీమియం డిస్‌ప్లే కోసం మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్, సెల్ఫీల కోసం ఒప్పో ఎఫ్33 ప్రో 5జీ, గేమింగ్ కోసం రియల్‌మి పీ4ఎక్స్ 5జీ, లాంగ్ బ్యాటరీ బ్యాకప్ కోసం మోటో జీ57 పవర్ 5జీ ఫోన్ కొనేసుకోవచ్చు…