×
Ad

Waterproof Mobiles : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. రూ. 25వేల లోపు టాప్ 5 వాటర్ ప్రూఫ్ మొబైల్స్.. నీళ్లలో తడిసినా డోంట్ కేర్..

Waterproof Mobiles : వాటర్ ప్రూఫ్ మొబైల్ కావాలా? ప్రస్తుతం ఈ ఫిబ్రవరిలో మీకోసం రూ. 25వేల లోపు ధరలో అద్భుతమైన ఫోన్ మోడల్స్ ఉన్నాయి.. ఇందులో ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి.

  • Published On : February 15, 2026 / 07:23 PM IST

Waterproof Mobiles

  • వాటర్ ప్రూఫ్ మొబైల్ ఫోన్లు మీ బడ్జెట్ ధరలోనే
  • ఫిబ్రవరి 2026లో టాప్ 5 వాటర్ ప్రూఫ్ మొబైల్స్ మీకోసం
  • డ్యూయల్ IP68, IP69 రేటింగ్‌తో అందుబాటులో

Top Waterproof Mobiles : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో మంచి వాటర్‌ప్రూఫ్ ఫోన్లు మీ బడ్జెట్ ధరలోనే లభిస్తున్నాయి. ఫిబ్రవరి 2026లో మీరు కూడా రూ. 25వేల బడ్జెట్ లోపు వాటర్ ప్రూఫ్ మొబైల్స్ కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు వదులుకోవద్దు.

ఈ ఫోన్లు పవర్‌ఫుల్ ప్రాసెసర్లతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, భారీ డిస్‌ప్లేతో భారీ బ్యాటరీతో ఉన్నాయి. టాప్-టైర్ వాటర్ ప్రూఫ్ ప్రొటెక్షన్ కోసం సర్టిఫై పొందాయి. టాప్ 5 వాటర్ ప్రూఫ్ మొబైల్స్ మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన ఏదైనా ఫోన్ కొనేసుకోవచ్చు.

1. వివో Y400 5జీ :
వివో Y400 5జీ ఫోన్ డ్యూయల్ IP68, IP69 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ పెద్ద 6.67-అంగుళాల 120Hz అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 6000mAh బ్యాటరీ ప్యాక్‌ పొందుతుంది. ఈ ఫోన్ విజయ్ సేల్స్‌లో రూ. 24,999 ధరకు కొనేసుకోవచ్చు.

2. ఒప్పో A5 ప్రో 5G :
ఒప్పో A5 ప్రో 5జీ ఫోన్ ఆర్మర్ బాడీతో IP69 రేటింగ్‌ అందిస్తుంది. భారీ 6.67-అంగుళాల 120Hz డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 5జీ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. భారీ 5800mAh బ్యాటరీతో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. విజయ్ సేల్స్‌లో ఈ ఫోన్ ధర రూ. 19,999కు కొనేసుకోవచ్చు.

Read Also : Income Tax Rules 2026 : మీకు క్రెడిట్ కార్డు ఉందా? ఏప్రిల్ 1 నుంచి భారీ మార్పులు.. ఈ 5 ఆదాయపు పన్ను రూల్స్ తప్పక తెలుసుకోండి!

3. రియల్‌మి 15x 5G :
రియల్‌మి 15x 5జీ ఫోన్ టాప్-టైర్ వాటర్‌ప్రూఫ్ ప్రొటెక్షన్, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ కోసం IP69 సర్టిఫికేషన్ పొందింది. భారీ 6.8-అంగుళాల 144Hz డిస్‌ప్లేతో వస్తుంది. భారీ 7000mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 3 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ అందిస్తుంది. 60W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ రూ.19,999కు కొనేసుకోవచ్చు.

4. ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G :
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G ఫోన్ IP65 రేటింగ్‌ పొందింది. డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.78-అంగుళాల 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమన్షిటీ 7100 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. భారీ 6500mAh బ్యాటరీ ప్యాక్‌ అందిస్తుంది. ఈ ఫోన్ ధర సుమారు రూ. 19,999 నుంచి లభ్యమవుతుంది.

5. శాంసంగ్ గెలాక్సీ F70e 5జీ :
శాంసంగ్ గెలాక్సీ F70e 5జీ ఫోన్ ఇటీవలే భారత మార్కెట్లో ఫిబ్రవరి 9, 2026న లాంచ్ అయింది. IP54 రేటింగ్ ఉంది. ఈ శాంసంగ్ ఫోన్‌లో 6.7-అంగుళాల 120Hz ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. అద్భుతమైన వ్యూ అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్‌లో 6000mAh భారీ బ్యాటరీ కూడా ఉంది. బేస్ వేరియంట్ ధర రూ. 12,999కు కొనేసుకోవచ్చు.