Top Smartphones 2026 : కొంటే ఇలాంటి ఫోన్లే కొనాలి.. 9000mAh బ్యాటరీతో మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్ ఫోన్లు ఇవే!

Top Smartphones 2026 : భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? 2026లో 9000mAh బ్యాటరీతో టాప్ స్మార్ట్‌ఫోన్లను మీకోసం అందిస్తున్నాం.. మీకు నచ్చిన ఫోన్ ఏది కావాలంటే?

Top Smartphones 2026 ( Image Credit : AI )

  • వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్ 8GB + 256GB వేరియంట్ ధర రూ. 41,999
  • భారీ 9020mAh బ్యాటరీతో వివో టీ5 ప్రో 5జీ ఫోన్లు అందుబాటులో
  • 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సెటప్

Top Smartphones 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారీ బ్యాటరీ ఉన్న ఫోన్ కావాలా? ప్రస్తుతం మార్కెట్లో పెద్ద బ్యాటరీ ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. భారీ బ్యాటరీ ఫోన్లు తీసుకుంటే లాంగ్ టైమ్ ఛార్జింగ్ అందిస్తాయి. అందుకే చాలామంది వినియోగదారులు పెద్ద బ్యాటరీ ఫోన్లే ఎక్కువగా కొనేస్తున్నారు. మీరు కూడా మంచి బ్యాటరీ ఫోన్ కోసం చూస్తుంటే ఈ స్టోరీ మీకోసమే..

వినియోగదారుల అవసరాలను బట్టి స్మార్ట్ ఫోన్ కంపెనీలు (Top Smartphones 2026) ఇప్పుడు రెండు రోజుల వరకు ఛార్జింగ్ అందించే భారీ బ్యాటరీలను అందిస్తున్నాయి. ముఖ్యంగా 9000mAh కన్నా ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీలతో వచ్చే స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. 2026లో 9000mAH బ్యాటరీతో లభ్యమయ్యే టాప్ స్మార్ట్‌ఫోన్లపై ఓసారి లుక్కేయండి..

వన్‌ప్లస్ నార్డ్ 6 :
ఈ వన్‌ప్లస్ ఫోన్ 8GB + 256GB వేరియంట్‌ ధర రూ. 41,999కి కొనేసుకోవచ్చు. 12GB + 256GB వేరియంట్‌ ధర రూ. 46,999కి కొనేసుకోవచ్చు. ఇందులో 9,000mAh భారీ బ్యాటరీ స్పెషల్ అట్రాక్షన్. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ 6లో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 165Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. నార్డ్ 6 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరాలో OISతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి.

వివో T5 ప్రో 5 :
భారత మార్కెట్లో ఇటీవలే ఈ వివో ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 29,999 ఉండగా, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 33,999 ఉంటుంది. టాప్ 12GB + 256GB వేరియంట్ ధర రూ. 39,999గా ఉంది. ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ 9020mAh బ్యాటరీ ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. 37 నిమిషాల్లో 50శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ 5 ఏళ్ల పాటు చెక్కుచెదరదు.

144Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్, 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 SoC ద్వారా రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 32MP ప్రైమరీ కెమెరా ఉంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68/IP69 రేటింగ్‌ అందిస్తుంది.

Read Also : Waterproof Smartphones : వర్షంలో తడిసినా టెన్షన్ లేదు! రూ. 20వేల లోపు 5 బెస్ట్ వాటర్‌ప్రూఫ్ ఫోన్లు ఇవే!

వన్‌ప్లస్ టర్బో 6 :
ఈ ఫోన్ ప్రస్తుతం చైనా మార్కెట్‌లో మాత్రమే లభ్యమవుతుంది. 6.78-అంగుళాల FHD+ హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే అందిస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 16GB వరకు ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. పవర్ కోసం 9,000mAh బ్యాటరీ ఉంది.

80W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. OISతో 50MP సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్, ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో ఫుల్-ఫంక్షన్ NFC, మల్టీ-బ్యాండ్ GPS ఉన్నాయి. ఈ ఫోన్ IP66, IP68, IP69, IP69K సర్టిఫికేషన్ అందిస్తుంది. ఈ ఫోన్ వాటర్, డస్ట్ నుంచి తట్టుకోగలదు.

వన్‌ప్లస్ టర్బో 6V ఫోన్ :
ఈ ఫోన్‌లో 6.78-అంగుళాల FHD+ డిస్‌ప్లే, 9,000mAh బ్యాటరీ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజ్‌తో రన్ అవుతుంది. వన్‌ప్లస్ టర్బో 6V ఫోన్ కలర్‌ఓఎస్ 16పై రన్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌, రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.

కెమెరా హార్డ్‌వేర్ టర్బో 6 మాదిరిగానే ఉంటుంది. ఇందులో 50MP, సోనీ LYT-600 OIS కెమెరా, 2MP సెకండరీ లెన్స్, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఫోన్ మన్నిక కోసం IP66, IP68, IP69, IP69K రేటింగ్స్‌తో లభిస్తుంది.