Toyota Cars : ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టయోటా కార్లు ధరలు
Toyota Cars Expensive : టయోటా గ్లాన్జా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్నోవా హైక్రాస్, హిలక్స్, ఫార్చ్యూనర్, లెజెండర్‌లను విక్రయిస్తోంది.
- Sreehari A
- Published On : March 28, 2024 / 05:17 PM IST
Toyota Cars to get expensive from April 1
Toyota Cars Expensive : టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇన్‌పుట్ ఖర్చులు, కార్యాచరణ వ్యయాల కారణంగా ఎంపిక చేసిన మోడల్‌ల ధరలను ఏప్రిల్ 1 నుంచి ఒక శాతం వరకు పెంచనుంది. భారత మార్కెట్లో గ్లెంజా, రమియన్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్, హిలక్స్, ఫార్చునర్, లెజండర్, కెమ్రీ, వెల్‌ఫైర్, ల్యాండ్ క్రూయిజర్, వంటి మోడళ్లను విక్రయిస్తోంది. ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి వచ్చే నిర్దిష్ట మోడల్‌లలోని కొన్ని గ్రేడ్‌ల ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఇన్‌పుట్ ఖర్చులు, కార్యాచరణ వ్యయాలు పెరగడం వల్ల ఒక శాతం పెరుగుదలతో ధరలను పెంచుతున్నట్టు కంపెనీ పేర్కొంది. అయితే, కార్ల తయారీ సంస్థ ధరల పెరుగుదల సంబంధించి మోడళ్లను మాత్రం వెల్లడించలేదు. ప్రత్యర్థి కార్ల తయారీ సంస్థ కియా ఇండియా కూడా తన మోడళ్లైన సోనెట్, కేరెన్స్, సెల్టోస్ ధరలను ఏప్రిల్ 1 నుంచి 3శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది.
టయోటా మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఆధారిత టైసర్ ఏప్రిల్ 3న ప్రారంభమవుతుంది. కంపెనీ ఇప్పటికే రెండు బ్యాడ్జ్-ఇంజనీరింగ్ మోడల్‌లను అందిస్తుంది. మరోవైపు.. మారుతి సుజుకి బాలెనో-ఆధారిత గ్లాంజా, మారుతి సుజుకి ఎర్టిగా-ఆధారిత రూమియన్ వంటి మోడళ్లపై ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది.
