Twitter undo button: ట్విట్ల కోసం కొత్త ఫీచర్ కన్ఫామ్

 ట్వీట్లలో తప్పులు, అక్షర దోషాలు లాంటివి మార్చుకునేందుకు మిలియన్ల కొద్దీ యూజర్లు అడుగుతున్న రిక్వెస్ట్ లను పరిగణనలోకి తీసుకుంటూ.. ట్విట్టర్ ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి..

Twitter undo button: ట్వీట్లలో తప్పులు, అక్షర దోషాలు లాంటివి మార్చుకునేందుకు మిలియన్ల కొద్దీ యూజర్లు అడుగుతున్న రిక్వెస్ట్ లను పరిగణనలోకి తీసుకుంటూ.. ట్విట్టర్ ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. సబ్ స్కిప్షన్ పొందిన వారికి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. అది ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు CNET కన్ఫామ్ చేసింది.

జాన్ మాంచన్ వాంగ్ అనే యాప్ రీసెర్చర్ సబ్‌స్క్రిప్షన్ అకౌంట్లలో కనిపిస్తున్నట్లు గమనించాడు. పెయిడ్ ఫీచర్స్ అయిన అంబూ ట్వీట్ లాంటి సదుపాయాలు ఉన్నాయని శుక్రవారం స్క్రీన్ షాట్ సహాయంతో వెల్లడించారు. అందరికీ కనిపించే ట్వీట్ ను డిలీట్ చేసుకోవడం మళ్లీ దాని తప్పులు మార్చి పోస్ట్ చేయడం వల్ల ఒరిజినల్ ట్వీట్ మిస్ అయిపోతుంది. ఏ కాస్త చిన్న తప్పు ఉన్నా ట్వీట్ డిలీట్ చేస్తేనే గానీ మార్చుకోవడానికి వీలు కాదు.

జీమెయిల్ కూడా దాని యూజర్లకు మంచి ఫీచర్ అందిస్తోంది. మెసేజ్ పంపి సెండ్ బటన్ నొక్కిన తర్వాత అది సెండింగ్ ప్రోసెస్‌లో ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయ్యే లోపు ఆపాలనుకుంటే సాధ్యపడుతుంది. ఇప్పుడు ట్విట్టర్ లో కూడా అంతే. మెసేజ్ పోస్ట్ అయ్యేలోపు ఉన్న గ్యాప్ లో కావాలనుకుంటే అన్ డూ చేసేయొచ్చు.

సంవత్సరాల తరబడి అడుగుతున్న ట్విట్టర్ యూజర్ల కోరికను యాజమాన్యం నెరవేర్చింది. ట్విట్టర్ 315 మిలియన్ మోనటైజబుల్ యాక్టివ్ యూజర్లతో 2023 నాటికి 7.5బిలియన్ రెవెన్యూ సంపాదించాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసమే పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ మొదలుపెట్టాలనుకున్న సీఈఓ జాక్ డార్స్ అతి త్వరలో టెస్టింగ్ పూర్తి చేసి మనకు అందించాలని ప్లాన్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు