WhatsApp Security : వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ ప్రైవసీ డేంజర్‌లో.. వెంటనే ఈ 5 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్
WhatsApp Security : వాట్సాప్ తమ యూజర్ల ప్రైవసీకి సంబంధించి అనేక ఫీచర్లను అందిస్తోంది. ఈ సెక్యూరిటీ ఫీచర్లను వెంటనే ఆన్ చేసుకోండి.

WhatsApp Security
WhatsApp Security : వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. వాట్సాప్‌లో మీ ప్రైవసీ కోసం ఇప్పుడే సెక్యూరిటీ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోండి. ప్రస్తుతం వాట్సాప్ స్కామర్‌లు, హ్యాకర్లకు ప్రధాన లక్ష్యంగా మారింది.
ఫిషింగ్ లింక్స్ నుంచి సిమ్ స్వాప్ అటాక్స్ వరకు స్కామర్లు యూజర్ల డేటాను యాక్సస్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. పర్సనల్ డేటా సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఉండేందుకు సరైన సెక్యూరిటీ ఎనేబుల్ చేయాలి. వాట్సాప్ యూజర్లు మల్టీ ఇన్-యాప్ సెక్యూరిటీ టూల్స్ ద్వారా క్షణాల వ్యవధిలోనే యాక్టివ్ చేయొచ్చు.
1. టూ-స్టెప్ వెరిఫికేషన్ :
సెక్యూరిటీ కోసం యూజర్లు Settings > Acount > Two-step Verification వెళ్లి ఎనేబుల్ చేయాలి. మీరు కొత్త ఫోన్ లాగిన్ అయినప్పుడల్లా ఈ ఫీచర్‌కు మీ OTPతో పాటు 6-అంకెల పిన్ అవసరం.
2. ఫింగర్‌ఫ్రింట్ లేదా ఫేస్ ఐడీ లాక్ :
ఎవరైనా మీ హ్యాండ్‌సెట్‌ను యాక్సెస్ చేయగలిగినప్పటికీ, వారు మీ చాట్‌లను ఓపెన్ చేయకుండా వాట్సాప్ కోసం బయోమెట్రిక్ లాక్‌ని ఎనేబుల్ చేయండి. Settings > Privacy > Fingerprint Lock / Face ID Lock కింద యాక్టివేట్ చేయండి.
3. డిసెప్పయరింగ్ మెసేజ్‌లు :
అదనపు ప్రైవసీ కోసం వ్యక్తిగత లేదా గ్రూపు చాట్‌ల కోసం డిసెప్పయరింగ్ మెసేజ్‌లు ఆన్ చేయండి. మెసేజ్‌లు 24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజుల తర్వాత ఆటోమాటిక్‌గా అదృశ్యమవుతాయి. సమాచారం శాశ్వతంగా స్టోర్ చేసే రిస్క్ తగ్గిస్తుంది.
4. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ బ్యాకప్ :
వాట్సాప్ చాట్స్ ఇప్పటికే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయ్యాయి. కానీ, మీ క్లౌడ్ బ్యాకప్స్ అలా ఉండకపోవచ్చు. Settings > Chats > Chat Backup > ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌కి వెళ్లి ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్ యాక్టివేట్ చేయండి. మీ చాట్ హిస్టరీని మరెవరూ యాక్సెస్ చేయకుండా స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను సెట్ చేయండి.
5. ప్రొఫైల్ ప్రైవసీ కంట్రోల్స్ :
మీ ప్రొఫైల్ ఫొటో, లాస్ట్ సీన్. ఆన్‌లైన్ స్టేటస్ మీ గురించి సమాచారాన్ని ఎవరు చూడవచ్చో కంట్రోల్ చేయొచ్చు.
Settings > Privacy ఆప్షన్ > (Everyone), My Contacts Except లేదా Nobody ఆప్షన్ నుంచి ఎంచుకోండి. ఈ సమాచారాన్ని లిమిట్ చేయడం వల్ల గుర్తుతెలియని వ్యక్తులు మీ వివరాలను దుర్వినియోగం చేయకుండా నిరోధించవచ్చు.
ఈ 5 సాధారణ వాట్సాప్ సెట్టింగ్స్‌తో మీ అకౌంట్ హ్యాక్ చేయడం సైబర్ నేరగాళ్లకు చాలా కష్టతరం అవుతుంది. ప్రతి వాట్సాప్ యూజర్ డేటా దొంగతనం, స్కామ్‌లు, స్నూపింగ్ వంటివి నివారించేందుకు ఇప్పుడే ఎనేబుల్ చేయాలి.