సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై స్పామ్ (బల్క్) ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. స్పామ్ యూజర్ అకౌంట్లపై ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాం ట్విట్టర్ కన్నెర్ర చేసింది.
సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై స్పామ్ (బల్క్) ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. స్పామ్ యూజర్ అకౌంట్లపై ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాం ట్విట్టర్ కన్నెర్ర చేసింది. స్పామర్ల అకౌంట్లను కట్టడి చేసేందుకు ట్విట్టర్ నిబంధనల్లో మార్పులు చేసింది. ట్విట్టర్ అకౌంట్లో ఫాలోవర్లపై పరిమితి విధించింది. ఒక రోజులో ట్విట్టర్ యూజర్లు కేవలం 400 అకౌంట్లను మాత్రమే ఫాలో అవ్వగలరు.
ఇప్పటివరకూ ట్విట్టర్ అకౌంట్లపై ఉన్న వెయ్యి ఫాలోవర్ల పరిమితిని 400 ఫాలోవర్లకు తగ్గించినట్టు శాన్ ఫ్రాన్సిస్ కో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఫాలో, అన్ ఫాలో, ఫాలో, అన్ ఫాలో.. ఎవరిని ఎవరూ ఫాలో, అన్ ఫాలో అవుతారో చూద్దాం.. స్పామర్స్.. ట్విట్టర్ అకౌంట్లలో మార్పులు చేస్తున్నాం. ఇకపై రోజుకు మీరు వెయ్యి నుంచి 400 అకౌంట్లను మాత్రమే ఫాలో అవ్వగలరు.. మీ మంచికే..’ అంటూ ట్విట్టర్ గట్టి షాక్ ఇచ్చింది.
Read Also : కన్నీటిని తాగేస్తున్నాయి : ఆమె కంట్లో తేనెటీగలు
ట్విట్టర్ ప్లాట్ ఫాంపై హెల్తీ సర్వీసును అందించాలనే ఉద్దేశంతో స్పామ్ కంటెంట్, అకౌంట్లను కట్టడి చేస్తున్నామని ట్విట్టర్ ప్రతినిధి ఎంగాడ్జెట్ తెలిపారు. ట్విట్టర్ అకౌంట్లపై రోజుకు ఫాలోయింగ్ పరిమితి ఉండాల్సిన దానికంటే భారీ సంఖ్యలో పెరిగిపోతున్నట్టు గుర్తించామన్నారు. అందుకే.. ట్విట్టర్ అకౌంట్లలో డెయిలీ ఫాలోయింగ్ రేట్ లిమిట్ ను తగ్గిస్తున్నట్టు చెప్పారు.
కొంతమంది యూజర్లు.. బాట్స్ ద్వారా బల్క్ ఫాలోయింగ్ ట్రిక్స్ అప్లయ్ చేస్తున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. 2018 ఏడాదిలోనే ట్విట్టర్ బల్క్ ట్వీట్ యూజర్లను కట్టడి చేసింది. దీంతో ఒకే రకమైన కంటెంట్ ను.. ఇతర ట్విట్టర్ అకౌంట్లలో షేర్ కాకుండా అడ్డుకుంది. కొత్త రిపోర్టింగ్ టూల్స్ ద్వారా హ్యుమన్స్ మాత్రమే ఇకపై ట్వీట్లు చేయగలరు. అందుకు వెరిఫికేషన్ ప్రాసెస్ అవసరం అవుతుంది. యూజర్లు తమ ఐడెంటీని ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ తో ధ్రువీకరించుకున్న తర్వాతే వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
Follow, unfollow, follow, unfollow. Who does that? Spammers. So we’re changing the number of accounts you can follow each day from 1,000 to 400. Don’t worry, you’ll be just fine.
— Twitter Safety (@TwitterSafety) April 8, 2019
Read Also : ఆర్బీఐకి హైకోర్టు ప్రశ్న: Google Payకు లైసెన్స్ ఉందా?