Vi vs BSNL Plans : Vi, BSNL రూ. 998 ప్లాన్ , రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఇందులో ఏది బెటర్? వ్యాలిడిటీ, డేటా బెనిఫిట్స్ ఒకటేనా?
Vi vs BSNL Prepaid Plans : వోడాఫోన్ ఐడియా లేదా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ ఏదైనా సరే.. ఇందులో ఏ ప్లాన్ బెనిఫిట్స్ అందిస్తాయి? వ్యాలిడిటీ, డేటా, బెనిఫిట్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- August 7, 2026 / 08:10 PM IST
Vi vs BSNL Plans
- Vi ప్లాన్ రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, అదనపు బెనిఫిట్స్
- BSNL ప్లాన్ అదే రోజువారీ డేటాతో లాంగ్ వ్యాలిడిటీతో వస్తుంది
- అదనపు బెనిఫిట్స్ కావాలా లాంగ్ వ్యాలిడిటీ కావాలా మీదే ఛాయిస్
Vi vs BSNL Prepaid Plans : మీ ప్రీపెయిడ్ ప్లాన్ ముగుస్తోందా? లాంగ్ వ్యాలిడిటీ, మంచి డేటా బెనిఫిట్స్ ఉన్న రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? మీకోసం అద్భుతమైన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, లాంగ్ వ్యాలిడిటీని కోరుకునే వారికి వోడాఫోన్ ఐడియా రూ. 998, బీఎస్ఎన్ఎల్ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్‌లు అద్భుతంగా ఉంటాయి.
ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లు రోజుకు 2GB డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందిస్తాయి. కానీ, ఈ రెండు పూర్తిగా ఒకేలా ఉండవు. వ్యాలిడిటీ, అదనపు బెనిఫిట్స్ మొత్తం వాల్యూ పరంగా డిఫరెంట్ ఉంటాయి. మీరు Vi, BSNL కస్టమర్లు అయితే రూ. 998 ప్లాన్ , రూ. 997 ప్లాన్లలో ఏది తీసుకుంటే బెటర్ అనేది ఇప్పుడే డిసైడ్ అవ్వండి.
వోడాఫోన్ ఐడియా రూ. 998 ప్రీపెయిడ్ ప్లాన్ :
వోడాఫోన్ ఐడియా రూ. 998 ప్రీపెయిడ్ ప్యాక్ 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB హై-స్పీడ్ డేటాతో వస్తుంది. రోజువారీ లిమిట్ దాటాక కంపెనీ రూల్స్ ప్రకారం తక్కువ డేటా స్పీడ్‌తో బ్రౌజింగ్ చేయొచ్చు.
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా ఉంటాయి. వోడాఫోన్ ఐడియా హాఫ్ డే అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్ కింద ప్రతిరోజూ ఉదయం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది. సబ్‌స్క్రైబర్‌లు పూర్తి 84 రోజుల వ్యాలిడిటీతో సోనీలైవ్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు.
ఈ రీఛార్జ్ ప్లాన్‌లో వీకెండ్ డేటా కూడా ఉంది. మీ డేటా మిగిలితే డేటాను వీకెండ్‌కు పొడిగించుకోవచ్చు. అంటే.. శని, ఆదివారాల్లో వాడుకోవచ్చు అనమాట. అంతేకాదు.. ప్రతి నెలా 2GB బ్యాకప్ డేటాను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా వాడుకోవచ్చు. 5జీ ఫోన్ వాడే యూజర్లు కంపెనీ నిబంధనలు, షరతులతో వోడాఫోన్ ఐడియా 5జీ కవరేజ్ ప్రాంతాల్లో అన్ లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ రూ. 997 ప్రీపెయిడ్ ప్యాకేజీ 150 రోజుల లాంగ్ వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు అదనంగా మరో 5GB ప్రమోషనల్ డేటాను అందిస్తుంది. అన్‌లిమిటెడ్ ఫోన్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా లభిస్తాయి.
రోజువారీ డేటా లిమిట్ 2GB, ఇంటర్నెట్ స్పీడ్ 40Kbpsకి తగ్గుతుంది. అలాగే, ఈ రీఛార్జ్ ప్యాకేజీ అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్స్‌ను అందిస్తుంది. అదనపు 5జీబీ ప్రమోషనల్ డేటా, రీఛార్జ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఎన్ని రీఛార్జ్‌లు చేసినా ఒక్కసారికి మాత్రమే వర్తిస్తుంది.
ఏ ప్లాన్ ఎంచుకోవాలి? :
మీరు ఎంటర్‌టైన్మెంట్ రీఛార్జ్ కోసం చూస్తుంటే.. వోడాఫోన్ ఐడియా రూ. 998 ప్లాన్ తీసుకోవచ్చు. 84 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ హాఫ్-డే డేటాను అందిస్తుంది. వీకెండ్ డేటా అన్ లిమిటెడ్ 5జీ కూడా అందిస్తుంది. అయితే, రోజుకు 2GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ కోసం చూస్తుంటే 150 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ రూ. 997 ప్లాన్ ఎంచుకోవడమే బెటర్.
