Vivo S18 Series : వివో S18 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

Vivo S18 Series : వివో నుంచి సరికొత్త ఎస్ సిరీస్ ఫోన్ రెండు వేరియంట్లలో గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఈ వివో ఫోన్ లాంచ్‌కు ముందు కీలక ఫీచర్లు లీకయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

Vivo S18 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది. వివో S18 సిరీస్ రెండు వేరియంట్లలో లాంచ్ కానుంది. వివో S18, వివో S18 ప్రో మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి రానుంది. అంతకంటే ముందుగానే ఈ వివో ఎస్ సిరీస్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. 2023 ఏడాది మేలో చైనాలో లాంచ్ అయిన వివో ఎస్17 లైనప్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది.

Read Also : Infinix Hot 40i Launch : ఇన్పినిక్స్ హాట్ 40ఐ ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

వివో ఎస్18 సిరీస్ త్వరలో లాంచ్ కానుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కంపెనీ ఇప్పుడు అధికారికంగా వివో ఎస్18 సిరీస్ లాంచ్‌ను టీజ్ చేసింది. వివో బ్లూ హార్ట్ ఏఐ అసిస్టెంట్‌తో వస్తుందని చెప్పవచ్చు. రాబోయే ఫోన్‌ల గురించి కంపెనీ చాలా వివరాలను వెల్లడించనప్పటికీ, అనేక లీక్‌లు కీలక స్పెసిఫికేషన్‌లను సూచించాయి. వివో ఎస్18 లైనప్ స్కీమాటిక్ డిజైన్ రెండర్ కూడా ఆన్‌లైన్‌లో కనిపించింది.

ఆకర్షణీయమైన కెమెరా ఫీచర్లు (అంచనా) :
వెయిబో పోస్ట్‌లో వివో ఇంటర్నల్ బ్లూ హార్ట్ ఏఐ అసిస్టెంట్‌తో వివో ఎస్18 సిరీస్ త్వరలో లాంచ్ కానుందని ధృవీకరించింది. కంపెనీ షేర్ చేసిన పోస్టర్ వివో ఎస్18 సైడ్ ప్రొఫైల్‌ను చూపుతుంది. వెనుకవైపు కొద్దిగా పెరిగిన కెమెరా మాడ్యూల్‌ను సూచిస్తుంది.

Vivo S18, Vivo S18 Pro Launch

మరోవైపు, వివో ఎస్18 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్, 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్920 సెన్సార్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. హై-ఎండ్ మోడల్ సన్నని తేలికపాటి పోర్ట్రెయిట్ సెల్ఫీలు తీసుకోవచ్చు. అప్‌గ్రేడ్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో రానుంది. ఇదే విధమైన బ్యాటరీని అందించనుందని భావిస్తున్నారు.

రెండు ఫోన్లలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
రెండు ఫోన్‌లు కూడా 80డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఇస్తాయని భావిస్తున్నారు. అమోల్డ్ డిస్‌ప్లేతో పాటు వై-ఫై 7 కనెక్టివిటీని అందిస్తాయి. చివరగా, వివో ఎస్18 మోడల్‌లు 50ఎంపీ సెన్సార్‌తో అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, టెలిఫోటో లెన్స్‌తో వస్తాయని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది. టిప్‌స్టర్ షేర్ చేసిన స్కీమాటిక్ డిజైన్ రెండర్ వివో ఎస్18 మోడల్ బ్యాక్ ప్యానెల్‌లోని టాప్ లెఫ్ట్ కార్నర్‌లో రెండు వేర్వేరు ఆకర్షణీయమైన కటౌట్‌లను కలిగి ఉంటుంది.

Read Also : Redmi 12C Discount : రూ. 7వేల కన్నా తక్కువ ధరకే రెడ్‌మి 12C ఫోన్ సొంతం చేసుకోవచ్చు.. ఇదిగో ఇలా..!

ట్రెండింగ్ వార్తలు