Telugu » Technology » Vivo S50 Pro Mini Launched With Snapdragon 8 Gen 5 Soc Vivo S50 Tags Along Price Specifications Sh
Vivo S50 Pro Mini : వారెవ్వా.. వివోనా మజాకా.. ఈ 2 కొత్త వివో ఫోన్లు చూశారా? ఫీచర్లు కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతో తెలుసా?
Vivo S50 Pro Mini : వివో నుంచి సరికొత్త సిరీస్ ఫోన్ వచ్చేసింది. వివో S50 ప్రో మినీ, వివో S50 రెండు ఫోన్లలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.. ధర, ఫీచర్ల పరంగా ఎలా ఉందంటే?
Vivo S50 Pro Mini : వివో S సిరీస్ కింద చైనాలో 2 కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. వివో S50, వివో S50 ప్రో మినీ రెండు ఫోన్‌లు వచ్చేశాయి.
2/7
ఈ ప్రీమియం ఫోన్లలో అమోల్డ్ డిస్‌ప్లే, లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
3/7
వివో S50 స్టాండర్డ్-సైజ్ డిస్‌ప్లేతో వస్తుంది. అయితే, వివో ప్రో మినీ వేరియంట్ మరింత కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌లో వస్తుంది. చైనాలో వివో S50 బేస్ వేరియంట్ 12GB + 512GB, 16GB + 256GB వేరియంట్ ధర వరుసగా CNY 2,999, CNY 3,299, CNY 3,399, 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్ ధర CNY 3,599కు పొందవచ్చు.
4/7
వివో S50 ప్రో సిరీస్ ఫీచర్లు : వివో S50 ప్రో మినీ 12GB + 256GB వేరియంట్ ధర CNY 3,699 నుంచి ప్రారంభమవుతుంది. 12GB + 512GB మోడల్ ధర CNY 3,999కు అందుబాటులో ఉంది. అయితే, టాప్-ఆఫ్-ది-లైన్ 16GB + 512GB వేరియంట్ ధర CNY 4,299కు పొందవచ్చు. ఈ రెండు ఫోన్‌లు వివో అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉంది.
5/7
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. : వివో S50 ఫోన్ 1260x2750 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. మరోవైపు, వివో S50 ప్రో మినీ 1216x2640 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.31-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్ 16 ఆధారంగా OriginOS 6పై రన్ అవుతాయి.
6/7
బ్యాటరీ విషయానికొస్తే.. వివో S50, వివో S50 ప్రో మినీ రెండూ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,500mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. అయితే, కంపెనీ ప్రకారం.. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే ప్రో మినీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. పర్ఫార్మెన్స్ కోసం వివో S50 ప్రో మినీ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
7/7
16GB వరకు LPDDR5x ర్యామ్, 512GB వరకు యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్‌తో వస్తుంది. స్టాండర్డ్ వివో S50 స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ రెండు ఫోన్‌లలోనూ కెమెరా సెటప్ ఒకేలా ఉంటుంది. 50MP ప్రైమరీ సోనీ సెన్సార్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.